Monday, May 30, 2022

డాక్టర్....... K. లక్ష్మణ్ కు..... రాజ్యసభ!

*డాక్టర్....... K. లక్ష్మణ్ కు..... రాజ్యసభ!*

*హైదరాబాద్.....*
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు లభించింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆయనకు ప్రాతినిధ్యం కల్పిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.సోమవారం రాత్రి విడుదల చేసిన నలుగురు రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరుంది. సుమిత్ర వాల్మికి మధ్యప్రదేశ్‌ నుంచి, లహర్‌సింగ్‌ సిరోయ కర్ణాటక నుంచి, మిథిలేశ్‌ కుమార్‌ ఉత్తరప్రదేశ్‌ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం నామినేషన్‌ వేసేందుకు లక్ష్మణ్‌ లఖ్‌నవూకు వెళుతున్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతల్లో ఒకరికి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం ఇస్తుందని మొదటి నుంచీ అనుకుంటున్నారు.

లక్ష్మణ్‌తో పాటుగా తెలంగాణకు చెందిన మాజీ ఎంపీలు విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డిల పేర్లను అధిష్ఠానం పరిశీలించింది. చివరికి ఓబీసీ నేత లక్ష్మణ్‌కే మొగ్గు చూపించింది. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు. లక్ష్మణ్‌ 1999లో, 2014లో ముషీరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016 నుంచి 2020 దాకా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా పని చేశారు.

link Media ప్రజల పక్షం🖋️

No comments:

Post a Comment