*ప్రేమ పేరుతో బాలికకు బీజేపీ కార్పొరేటర్ కుమారుడి వేధింపులు.... ఫోక్స్ కేసు....!*
హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్ : ప్రేమ పేరుతో బాలికను వేధించిన ఓ కార్పొరేటర్ కుమారుడిపై రాచకొండ కమిషనరేట్‌లోని మీర్‌పేట్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.ఇన్‌స్పెక్టర్ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్ కార్పొరేషన్‌లోని 38వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ పద్మానర్సింహయాదవ్ కుమారుడు బి.ముఖేశ్‌యాదవ్ కొంతకాలంగా ఓ బాలికను (15) ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని, లేనట్టయితే చంపేస్తానంటూ ఫోన్‌లో మెసేజ్‌లు పంపించాడు.
దాంతో భయపడిన బాలిక విషయాన్ని తన తల్లికి చెప్పడంతో ఆమె మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ముఖేశ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడిపై ఇప్పటికే మరో సంఘటనలో నిర్భయ కేసు నమోదై ఉన్నదని, ఆ కేసులోనూ నిందితుడికి నోటీసు పంపించామని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. ఇంటిముందు జరిగిన ఓ గొడవలోనూ ముఖేశ్ నిందితుడిగా ఉండడం గమనార్హం.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment