ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి, ఇస్లామోఫోబియాను ముడిపెడుతున్నారు – లెఫ్టిస్ట్ మీడియాను కడిగిపారేసిన వివేక్ అగ్నిహోత్రి
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై విమర్శలు చేస్తూ ఇస్లామోఫోబియాకు ముడిపెడుతుండటంపై లెఫ్టిస్ట్ మీడియాను కడిగిపారేశారు వివేక్ అగ్నిహోత్రి. సినిమా విడుదలైనప్పటి నుంచి ఉదారవాద భారతీయ మీడియా దీనిని ఇస్లామోఫోబియాతో ముడిపెడుతోందని మండిపడ్డారు. వాస్తవానికి ఎప్పుడైనా అందరినీ ఆందోళన కలిగించేది ఉగ్రవాదం. సినిమాలో ముస్లిం అనే పదాన్ని ఉపయోగించలేదు.. సినిమాలో పాకిస్థాన్ లేదా పాకిస్థానీ అనే పదాన్ని ఎక్కడా ఉపయోగించలేదు. టెర్రరిజానికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడిన తన సినిమాను “టెర్రర్ఫోబిక్” అని ఎందుకు అనలేదని ప్రశ్నించారు.
ఫిజా’ తదితర చిత్రాలు తీవ్రవాదంపై ఆధారపడి ఉన్నాయని.. అయితే వాటిని ఎప్పుడూ ఇస్లామోఫోబిక్ అని పిలవలేదని అగ్నిహోత్రి ప్రశ్నించారు. “అంటే టెర్రరిస్టును సమర్థిస్తే మానవత్వానికి మేలు చేసినవాడు.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇస్లామోఫోబిక్ అని ఏదైనా పుస్తకాల్లో లిఖించని చట్టం ఉందా” అని ఆయన నిలదీశారు.
సినిమా మొదటి సన్నివేశం హిందువుల, ముస్లింల మధ్య సోదరభావాన్ని తెలియజేస్తుందని గుర్తు చేశారు. “ఒక హిందూ బాలుడైన శివను కొందరు వ్యక్తులు కొడతారు. అబ్దుల్ వచ్చి తన ప్రాణాలను కాపాడుతాడు. ఆ తర్వాత పుష్కర్ నాథ్ అబ్దుల్ ప్రాణాలను కాపాడుతాడు. నిజానికి ఈ చిత్రానికి అత్యంత ముఖ్యమైన నిర్మాత ముస్లిం. అయితే ఆటను కూడా ఇస్లామోఫోబిక్ అయిపోతాడా?” అని అన్నారు.
ఇటీవల అగ్నిహోత్రి తన షెడ్యూల్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఎలా రద్దు చేసిందో ట్విట్టర్లో షేర్ చేశారు. ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగితే మూకుమ్మడి రాజీనామా చేస్తానని క్లబ్ నిర్వాహకులను కొందరు బెదిరించారు. తర్వాత ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ను ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకు మార్చారు, అక్కడ కూడా స్లాట్ అందుబాటులో లేదని చెప్పి బుకింగ్‌ని అంగీకరించడానికి నిరాకరించారు. తర్వాత అగ్నిహోత్రి మే 5న ప్రెస్ కాన్ఫరెన్స్ని హోటల్ లో నిర్వహించారు.
No comments:
Post a Comment