*హైదరాబాద్ లో.....భారీ వర్షం*
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, మియాపూర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పూర్, అల్వాల్, బేగంపేట్, సైదాబాద్, చంపాపేట, సరూర్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్, తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపుర్‌మెట్, బుద్వేల్, శివరాంపల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్, కాప్రా, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, కంటోన్మెంట్, మల్కాజిగిరి, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోందిభారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. పలు కాలనీలు నీటిమయమయ్యాయి. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంజాగుట్ట కూడలి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్ కూడలి వద్ద మోకాళ్ల లోతులో నీరు చేరింది. యూసఫ్ గూడ మైత్రీవనం రహదారిపై స్టేట్ హోమ్ వద్ద రోడ్డుపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. యూసఫ్‌గూడలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షంతో గత కొన్నిరోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న నగర ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించినట్లైంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భువనగిరి పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment