*పెట్టుబడుల.... వేట మరోసారి విదేశాలకు... KTR.....!*
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేటి నుంచి పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించమే లక్ష్యంగా పర్యటన వెళ్తున్నారు.ఈ సందర్భంగా బ్రిటన్‌తో పాటు స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు.
ఇవాళ ఉదయం 10 గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరి వెళ్తారు. లండన్‌లో మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీకానున్నారు.
ఆ తర్వాత ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు.ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ ప్రసంగించనున్నారు.
ఈ నెల 26న తిరిగి రాష్ట్రానికి కేటీఆర్ చేరుకోనున్నారు. పర్యటనలో కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారుల బృందం వెళ్లనున్నారు.
ఈ నేపథ్యంలో యూకేలోని వెస్ట్ లండన్‌లోని పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. 'వెల్‌కమ్ టు లండన్.. ఇండియాస్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్' అని టీఆర్‌ఎస్ ఎన్నారై నేత అనిల్ కూర్మాచలం ఏర్పాటు చేసిన పోస్టర్లు ఆకర్షణగా నిలిచాయి.
12 ఏండ్ల తర్వాత మంత్రి కేటీఆర్ లండన్‌లో పర్యటిస్తున్నారని, ఆయన రాక కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్నారైలే కాకుండా, పలు రాష్ర్టాలకు చెందిన ఎన్నారైలు ఎదురుచూస్తున్నారని అనిల్ కూర్మాచలం తెలిపారు. ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలను హైదరాబాద్‌కు రప్పించటంలో కేటీఆర్ చొరవ అసాధారణమైనదని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో, ప్రత్యేకించి ఐటీ విస్తరణలో కేటీఆర్ దేశానికి ఐకాన్‌గా నిలిచారని పేర్కొన్నారు.
కాగా.. March 20, 2022 లో కూడా తెలంగాణ ఐటీ - పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్ళారు. ఆయన వారం రోజుల పాటు అమెరికాలోని పలు నగరాల్లో పర్యటించారు. ప్రఖ్యాత అంతర్జాతీయ పారిశ్రామిక ప్రముఖులతో సమావేశమై.. కేటీఆర్ శాన్ డియాగో.. సానో హూజే..బోస్టన్ .. న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించారు. ప్రముఖ కంపెనీల అధిపతులు..సీఈవోలతో సమాసమయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రంతో పాటుగా ప్రత్యేకంగా హైదరాబాద్ కు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ప్రభుత్వ నిర్వహిస్తున్న మన ఊరు - మన బడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమెరికా లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు. 25వ తేదీ వరకు కేటీఆర్ అమెరికాలో పర్యటించనున్నారు. కేటీఆర్ తో పాటుగా తెలంగాణ ఐటీ .. పరిశ్రమల శాఖల ముఖ్య అధికారులు సైతం ఈ పర్యటనలో ఉన్నారు.
link Media ప్రజల పక్షం🖋️
No comments:
Post a Comment