Friday, July 17, 2020

తెలంగాణ సిఎం ప్రజలకు భరోసా

హైదరాబాద్ : 17/07/2020

*తాజా వార్తలు **

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావద్దు, అదే సందర్భంలో నిర్లక్ష్యం కూడా వద్దు. కరోనా సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదు, ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉంది: *సీఎం శ్రీ కేసీఆర్ **

కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై సీఎం శ్రీ కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడిలో, చికిత్సలోనూ ఎంతో గొప్పగా సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన సీఎం ప్రజలకు పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

@TelanganaCMO సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

బ్లాక్ మార్కెట్ లో మెడిసిన్ 😔

హైదరాబాద్ : 17/07/2020

*ఈ ఇంజక్షన్ బ్లాక్ లో మాత్రమే దొరుకుతోంది కరోనా పేషెంట్స్ కు అత్యవసరం అసలు ధర 45 వేలు బ్లాక్ లో 2 లక్షల పై మాటే🤐ప్రభుత్వం దగ్గర కూడా లేదట shortage అని చెప్తున్నారు*
 
@hemanidadhana 
Journalist 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

కలెక్టర్ సర్ వైకుంఠధామం తనిఖీ

హైదరాబాద్ : 17/07/2020

పటాన్ చెరు మండలం కిష్టారెడ్డి పేట గ్రామంలో వైకుంఠ దామమ్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు  పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
#SangareddyDistrict 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Thursday, July 16, 2020

కోవిద్ -19 లో పోలీసుల మానవత్వం

హైదరాబాద్ : 17/07/2020

న‌గ‌రంలోని  చాంద్రాయణగుట్ట  పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా వర్షంలో తడుస్తూ ఒక దుకాణం వద్ద పడిపోయిన వ్యక్తిని పోలీసులు గ‌మ‌నించారు ఆ వ్యక్తి  తన వివరాలను ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

*బీ మహేష్ అనే కానిస్టేబుల్,ఎండి సయీద్ అనే  హోం గార్డ్ ఇద్దరు ఆ వ్యక్తిని 108 వాహనం ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు తన పేరు శేఖర్ poగా బాధితుడు తెలిపాడు అంత‌కు మించి వివ‌రాలేమి చెప్ప‌లేక‌పోయాడు...మానవత్వం ఇంకా మిగిలి ఉంది ఏదో ఒక మూల🤐 **

*పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ మహేష్ గారికి మరియు హోంగార్డ్ ఎండి సయీద్ గారికి **ప్రజా సంకల్పం గ్రూప్ మరియు link Mediaఅభినందనలు తెలుపుతుంది 👏👍🙏*.

Source : @hemaindadhana 
Journalist 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

ఉచిత అంబులెన్సు సేవలు

హైదరాబాద్ : 16/07/2020

*ఈ విపత్కర పరిస్థితుల్లో అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్న ప్రయివేటు అంబులెన్సుల ఉచ్చులో చిక్కొద్దు.. **

సైబరాబాద్ పరిధిలో ఉచిత అంబులెన్స్ సేవల్ని పొందండి.. 
కాంటాక్ట్ : 8499843545

#FreeLastRideService
Great Job Team
@ActivistTeja 

Source : @AbhiramNetha  Journalist 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Wednesday, July 15, 2020

చెరువులు పరిరక్షణ

హైదరాబాద్ : 16/07/2020

*నిర్లక్ష్యం..వైఫల్యం!*

తెలంగాణ మంత్రివర్యులు గౌరవనీయులైన కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏.

సర్ మీరు చెరువులు పర్యావరణ పరిరక్షణ మరియు  కబ్జాల నుండి కాపాడుకోవాలి అని ఎన్నోసార్లు చెప్పారు అలాగే కొన్ని చెరువులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు కూడా.మరి మీరు అధికారులకు సూచనలు కూడా చేయడం జరిగింది గతంలోనే, మరి ఎందుకు సర్ ప్రభుత్వ యంత్రాంగం శాఖల మధ్య సమన్వయ లోపంతో చెరువులను పట్టించుకోవడం వదిలేసారు ??. 

సర్ ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ *చిన్న చెరువు**విషయంలో మీరు చెప్పిన విధంగా అధికారులు పని చేయడం లేదు.

 *అధికారులు ప్రజల సమస్యల పరిష్కారం చేయక అలసత్వం ప్రదర్శిస్తుండడం కరెక్ట్ కాదు సర్*. 

గతంలోనే *జీహెచ్‌ఎంసీలో భవన నిర్మాణాల్లో అక్రమాల నుంచి చెరువుల పరిరక్షణ, ఆస్తిపన్ను వసూళ్లు, ఘనవ్యర్థాల నిర్వహణల్లో జీహెచ్‌ంఎసీ విఫలమైందని ‘కాగ్‌’ (కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ )కడిగి పారేసింది.*

ఈ అంశాల్లో వేటిల్లోనూ సమర్థంగా పనిచేయలేదని విమర్శించింది. అడ్డగోలు నిర్మాణాలను అడ్డుకోనందున విచ్చలవిడిగా *అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయని తూర్పారబట్టింది.క్షేత్రస్థాయి తనిఖీలు లేవని తప్పుబట్టింది*

ఇక మై జీహెచ్‌ఎంసీ యాప్, ప్రజావాణి, ఎమర్జెన్సీ డయల్‌ 1100 తదితర కార్యక్రమాలను కాగ్‌ ప్రశంసించింది. 
*అక్రమ నిర్మాణాలున్నాయని ఒప్పుకున్న జీహెచ్‌ఎంసీ కోర్టు కేసుల వల్ల, ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ల వల్ల తగిన చర్యలు చేపట్టడంలో అశక్తతను వెల్లడించారని కుండబద్దలు కొట్టింది*.

 *టౌన్‌ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడాన్ని ప్రస్తావించింది*.  

*చెరువులు మాయమవుతున్నా పట్టదా..?*

*చెరువుల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు స్పష్టం చేసింది.* 

*17 సరస్సులు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోలేకపోయారని తప్పు పట్టింది. 9 సరస్సులు పూర్తిగా దురాక్రమణ పాలయ్యాయని నిగ్గు తేల్చింది.*  

కొన్ని పద్ధతులకు ప్రశంసలు
వివిధ అంశాల్లో జీహెచ్‌ఎంసీని తప్పుపట్టిన కాగ్‌.. కొన్ని అంశాల్లో మంచి పద్ధతులు ప్రవేశపెట్టారని కితాబిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్, ‘ప్రజావాణి’ కాల్‌సెంటర్,
ఎమర్జెన్సీ డయల్‌ 1100, ఆన్‌లైన్‌ సేవల(జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్, ట్విట్టర్‌)ను ప్రస్తావించింది.

*సర్ GHMC పరిధిలో మీరు చేపట్టిన ఉద్యమం చెరువులను కాపాడాలి అని కావున రామంతాపూర్ చిన్న చెరువు విషయంలో విచారణ చేసి న్యాయం చేయగలరు 🙏*.

COPY TO :
@KTRTRS 
@KTR_News
@KTRoffice  & Group link Media. 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, July 14, 2020

ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న చెరువు

హైదరాబాద్ : 15/07/2020

*ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న చెరువు (GHMC 9వ డివిజన్) పర్యావరణ కాలుష్యం మరియు కబ్జాల నుండి కాపాడి  భూగర్భ జలాలను పెంచే విధంగా చేయాలి అని మరియు వయోవృద్ధులకు వాకింగ్ ట్రాక్ చెరువు చుట్టూ ఏర్పాటు చేయాలి అని గత సంవత్సరంలోనే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప్పల్ నియోజకవర్గం MLA బేతి సుభాష్ రెడ్డి గారికి మరియు రామంతాపూర్ డివిజన్(9వ) కార్పొరేటర్ గంధం జ్యోత్స్నా నాగేశ్వర్ రావు మేడం గారికి మరియు GHMC LB నగర్ జోనల్ కమీషనర్ గారికి, GHMC ఉప్పల్ సర్కిల్ DC గారికి  అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అందరికి తెలిసిందే.*

మరి అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే వున్నాము కానీ *అధికారులు నిర్లక్ష్యం చేశారు అనడానికి ఇప్పుడున్న పరిస్థితులు నిదర్శనం.*

చెరువును అభివృద్ధి అంటే *మొదట చెరువును కాలుష్యం నుండి ప్రక్షాళన చేయాలి తరువాత చెరువులో ఎలాంటి వ్యర్థ పదార్థాలను వేయకుండా చర్యలు తీసుకోవాలి, భూగర్భ జలాలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చెరువు కింద ఎన్నో కాలనీ లు వున్నాయి భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని భావితరాల కోసం అయినా చెరువులు ముఖ్యం అవుతాయి అది మరిచిపోవద్దు.  తరువాత  వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి.*

*అసలు వాస్తవంగా చిన్న చెరువు పూర్తి వైశాల్యం ఎంత ఉండాలి ?? , ఇప్పుడు ఎందుకు తక్కువ అయింది చెప్పాల్సింది మొదట అధికారులు మరియు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు (గతంలో వున్న ప్రజాప్రతినిధులు కూడా) జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది.*

*చెరువు అభివృద్ధికి ప్రజలు అందరు సహకరిస్తారు అలాగని చెరువును కాపాడడంలో నిర్లక్ష్యం చేస్తే స్వచంద సంస్థలు వున్నాయి అని మరిచిపోవద్దు.*

*ప్రస్తుతం లోకాయుక్త, హైదరాబాద్, తెలంగాణ కోర్ట్ లో రామంతాపూర్ చిన్న చెరువు గురించి పిటిషన్ వేయబడింది మరియు EVDM (ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ) లో కంప్లైంట్ చేయబడింది.* 

చెరువులను కాపాడాలి అనే ఉద్యమంలో  *ప్రముఖ సామాజిక కార్యకర్త *Save Our Urban Lakes ( SOUL ) మాజీ కన్వీనర్ గౌరవనీయులు *డా . సర్వత్* మేడం గారు 
 *ప్రజా సంకల్పం మరియు link Media* మరియు *గంగపుత్ర సంఘము ** ఎప్పుడూ ముందు వుంటారు.

*ఈ ఉద్యమంలో దాదాపు అన్ని మీడియా సంస్థలు చిన్న చెరువు గురించి విశ్లేషణ లు ఇచ్చారు అందరికి *ప్రజా సంకల్పం & link Media*  ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాము 🙏. 

*We fight for Social Justice*

Bapatla Krishnamohan 
bplkmCS 

ప్రజా సంకల్పం 

prajasankalpam1@gmail.com 
@Praja_Snklpm (ట్విట్టర్)
ప్రజా సంకల్పం (యూట్యూబ్ )

https://prajasankalpam1.blogspot.com/