హైదరాబాద్ : 15/07/2020
*ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న చెరువు (GHMC 9వ డివిజన్) పర్యావరణ కాలుష్యం మరియు కబ్జాల నుండి కాపాడి భూగర్భ జలాలను పెంచే విధంగా చేయాలి అని మరియు వయోవృద్ధులకు వాకింగ్ ట్రాక్ చెరువు చుట్టూ ఏర్పాటు చేయాలి అని గత సంవత్సరంలోనే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప్పల్ నియోజకవర్గం MLA బేతి సుభాష్ రెడ్డి గారికి మరియు రామంతాపూర్ డివిజన్(9వ) కార్పొరేటర్ గంధం జ్యోత్స్నా నాగేశ్వర్ రావు మేడం గారికి మరియు GHMC LB నగర్ జోనల్ కమీషనర్ గారికి, GHMC ఉప్పల్ సర్కిల్ DC గారికి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అందరికి తెలిసిందే.*
మరి అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే వున్నాము కానీ *అధికారులు నిర్లక్ష్యం చేశారు అనడానికి ఇప్పుడున్న పరిస్థితులు నిదర్శనం.*
చెరువును అభివృద్ధి అంటే *మొదట చెరువును కాలుష్యం నుండి ప్రక్షాళన చేయాలి తరువాత చెరువులో ఎలాంటి వ్యర్థ పదార్థాలను వేయకుండా చర్యలు తీసుకోవాలి, భూగర్భ జలాలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చెరువు కింద ఎన్నో కాలనీ లు వున్నాయి భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని భావితరాల కోసం అయినా చెరువులు ముఖ్యం అవుతాయి అది మరిచిపోవద్దు. తరువాత వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి.*
*అసలు వాస్తవంగా చిన్న చెరువు పూర్తి వైశాల్యం ఎంత ఉండాలి ?? , ఇప్పుడు ఎందుకు తక్కువ అయింది చెప్పాల్సింది మొదట అధికారులు మరియు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు (గతంలో వున్న ప్రజాప్రతినిధులు కూడా) జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది.*
*చెరువు అభివృద్ధికి ప్రజలు అందరు సహకరిస్తారు అలాగని చెరువును కాపాడడంలో నిర్లక్ష్యం చేస్తే స్వచంద సంస్థలు వున్నాయి అని మరిచిపోవద్దు.*
*ప్రస్తుతం లోకాయుక్త, హైదరాబాద్, తెలంగాణ కోర్ట్ లో రామంతాపూర్ చిన్న చెరువు గురించి పిటిషన్ వేయబడింది మరియు EVDM (ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ) లో కంప్లైంట్ చేయబడింది.*
చెరువులను కాపాడాలి అనే ఉద్యమంలో *ప్రముఖ సామాజిక కార్యకర్త *Save Our Urban Lakes ( SOUL ) మాజీ కన్వీనర్ గౌరవనీయులు *డా . సర్వత్* మేడం గారు
*ప్రజా సంకల్పం మరియు link Media* మరియు *గంగపుత్ర సంఘము ** ఎప్పుడూ ముందు వుంటారు.
*ఈ ఉద్యమంలో దాదాపు అన్ని మీడియా సంస్థలు చిన్న చెరువు గురించి విశ్లేషణ లు ఇచ్చారు అందరికి *ప్రజా సంకల్పం & link Media* ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాము 🙏.
*We fight for Social Justice*
Bapatla Krishnamohan
bplkmCS
ప్రజా సంకల్పం
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
ప్రజా సంకల్పం (యూట్యూబ్ )
No comments:
Post a Comment