హైదరాబాద్ : 16/07/2020
*నిర్లక్ష్యం..వైఫల్యం!*
తెలంగాణ మంత్రివర్యులు గౌరవనీయులైన కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏.
సర్ మీరు చెరువులు పర్యావరణ పరిరక్షణ మరియు కబ్జాల నుండి కాపాడుకోవాలి అని ఎన్నోసార్లు చెప్పారు అలాగే కొన్ని చెరువులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు కూడా.మరి మీరు అధికారులకు సూచనలు కూడా చేయడం జరిగింది గతంలోనే, మరి ఎందుకు సర్ ప్రభుత్వ యంత్రాంగం శాఖల మధ్య సమన్వయ లోపంతో చెరువులను పట్టించుకోవడం వదిలేసారు ??.
సర్ ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ *చిన్న చెరువు**విషయంలో మీరు చెప్పిన విధంగా అధికారులు పని చేయడం లేదు.
*అధికారులు ప్రజల సమస్యల పరిష్కారం చేయక అలసత్వం ప్రదర్శిస్తుండడం కరెక్ట్ కాదు సర్*.
గతంలోనే *జీహెచ్‌ఎంసీలో భవన నిర్మాణాల్లో అక్రమాల నుంచి చెరువుల పరిరక్షణ, ఆస్తిపన్ను వసూళ్లు, ఘనవ్యర్థాల నిర్వహణల్లో జీహెచ్‌ంఎసీ విఫలమైందని ‘కాగ్’ (కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ )కడిగి పారేసింది.*
ఈ అంశాల్లో వేటిల్లోనూ సమర్థంగా పనిచేయలేదని విమర్శించింది. అడ్డగోలు నిర్మాణాలను అడ్డుకోనందున విచ్చలవిడిగా *అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయని తూర్పారబట్టింది.క్షేత్రస్థాయి తనిఖీలు లేవని తప్పుబట్టింది*
ఇక మై జీహెచ్‌ఎంసీ యాప్, ప్రజావాణి, ఎమర్జెన్సీ డయల్ 1100 తదితర కార్యక్రమాలను కాగ్ ప్రశంసించింది.
*అక్రమ నిర్మాణాలున్నాయని ఒప్పుకున్న జీహెచ్‌ఎంసీ కోర్టు కేసుల వల్ల, ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ల వల్ల తగిన చర్యలు చేపట్టడంలో అశక్తతను వెల్లడించారని కుండబద్దలు కొట్టింది*.
*టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడాన్ని ప్రస్తావించింది*.
*చెరువులు మాయమవుతున్నా పట్టదా..?*
*చెరువుల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు స్పష్టం చేసింది.*
*17 సరస్సులు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోలేకపోయారని తప్పు పట్టింది. 9 సరస్సులు పూర్తిగా దురాక్రమణ పాలయ్యాయని నిగ్గు తేల్చింది.*
కొన్ని పద్ధతులకు ప్రశంసలు
వివిధ అంశాల్లో జీహెచ్‌ఎంసీని తప్పుపట్టిన కాగ్.. కొన్ని అంశాల్లో మంచి పద్ధతులు ప్రవేశపెట్టారని కితాబిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్, ‘ప్రజావాణి’ కాల్‌సెంటర్,
ఎమర్జెన్సీ డయల్ 1100, ఆన్‌లైన్ సేవల(జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్, ట్విట్టర్)ను ప్రస్తావించింది.
*సర్ GHMC పరిధిలో మీరు చేపట్టిన ఉద్యమం చెరువులను కాపాడాలి అని కావున రామంతాపూర్ చిన్న చెరువు విషయంలో విచారణ చేసి న్యాయం చేయగలరు 🙏*.
COPY TO :
@KTRTRS
@KTR_News
@KTRoffice & Group link Media.
Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment