Thursday, September 7, 2023

కారు దిల్లీ వెళ్లి కమలంగా మారుతోంది

*కారు దిల్లీ వెళ్లి కమలంగా మారుతోంది.... రేవంత్ రెడ్డి....!*

హైదరాబాద్‌: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో దళితులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా..సోమాజిగూడ నుంచి నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మేక్‌ ఇన్‌ ఇండియా అన్న మోదీ ఇండియా పేరు మారుస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే దేశం పేరు మారుస్తామంటున్నారని ధ్వజమెత్తారు.

'' పెరిగిన ధరలు, మణిపూర్‌ అంశాలపై మోదీ పార్లమెంట్‌లో చర్చించడం లేదు. కేవలం కాంగ్రెస్‌ను తిట్టడానికే ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందన్నమోదీ.. గుజరాత్‌లో మోదీ తిరుగుతున్న ఎయిర్‌పోర్టు కాంగ్రెస్‌ నిర్మించిందని గుర్తు తెచ్చుకోవాలి. నిజాం నవాబుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది కాంగ్రెస్‌ కాదా? తెలంగాణకు స్వాతంత్ర్యం కల్పించింది కాంగ్రెస్‌ కదా? మా పార్టీ అధ్యక్షుడు వల్లభాయ్‌ పటేల్‌ కాదా?పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భారత దేశం అభివృద్ధిని లెక్క కడదామా? విభజించు, పాలించు అనే విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర భాజపా చేస్తోంది. దేశ సమగ్రతను కాపాడేందుకే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. కారు దిల్లీకి వెళ్లి కమలంగా మారుతోంది'' రేవంత్‌రెడ్డి విమర్శించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Wednesday, September 6, 2023

AirportServiceQuality Award

Honoured to get the 2022 #AirportServiceQuality Award for ‘Best Airport of 15 to 25 Million Passengers Per Annum' in Asia-Pacific. #HYDAirport has received this accolade from the Airports Council International highlighting its dedication towards enhancing passenger experience and making every journey memorable.

#FlyHYD #ASQAwards #BestAirport #PassengerIsPrime #PassengerExperience

@HiHyderabad @parisaeroport @icao

https://twitter.com/RGIAHyd/status/1699658162675265716?t=bBGVXZPUY6qsj1LuRVUrEg&s=19

*****---*****---*****---*****---*****

Congratulations to @RGIAHyd

Team 👍

Bapatla Krishnamohan
Bplkm🪶

https://twitter.com/Praja_Snklpm/status/1699671287831101758?t=pJOamMYO4kkRAAmsCJSFcw&s=19

తెలంగాణ నిర్మాణ పార్టీ... 'ఈసీఐ'కి దరఖాస్తు

*తీన్మార్ మల్లన్న అధ్యక్షతన.... తెలంగాణ నిర్మాణ పార్టీ....!*
దిల్లీ: తన అధ్యక్షతన తెలంగాణ నిర్మాణ పార్టీ పేరును రిజిస్టర్‌ చేయాలని తీన్మార్‌ మల్లన్న (మాదాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా) భారత ఎన్నికల సంఘాని (ఈసీఐ)కి దరఖాస్తు చేసుకున్నారు.పార్టీ పేరు, ఇతర అంశాలపై అభ్యంతరాలుంటే ఈ నెల 30వ తేదీలోపు తెలియజేయాలని ఈసీఐ వెబ్‌సైట్‌లో పేర్కొంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాదం రజినీ కుమార్‌ (వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌), కోశాధికారిగా ఆర్‌.భావన (చంపాపేట్‌, సరూర్‌నగర్‌, హైదరాబాద్‌) ఉంటారని దరఖాస్తులో పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల🖋️*

ఈ నెల 16 న పాలమూరు - రంగారెడ్డి.... ప్రారంభం

*ఈ నెల 16 న పాలమూరు - రంగారెడ్డి.... ప్రారంభం*

*కృష్ణమ్మకు ప్రత్యేక పూజలతో వెట్‌ రన్‌కు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రిఅదే రోజు భారీ బహిరంగ సభ*
*17న కృష్ణా జలాలతో రెండు జిల్లాల్లోని ఆలయాల్లో దేవుళ్లకు పాదాభిషేకాలు*

*నీటిని ఎత్తిపోసే రోజు..దక్షిణ తెలంగాణకు పండగ రోజు*
*పథకంపై సమీక్షలో సీఎం కేసీఆర్‌*

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మరో భారీ ఎత్తిపోతల పథకం పాలమూరు-రంగారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 16న ప్రారంభించనున్నారు. శ్రీశైలం వెనక భాగం నుంచి నీటిని ఎత్తిపోసే మొదటి పంపుహౌస్‌ నార్లాపూర్‌ ఇన్‌టేక్‌వెల్‌ వద్ద స్విచ్‌ ఆన్‌ చేసి వెట్‌ రన్‌ ప్రారంభిస్తారు. ఇప్పటికే మొదటి పంపుహౌస్‌లోని మోటార్లకు డ్రై రన్‌ పూర్తి చేయగా.. 16న వెట్‌ రన్‌ (నీటిని ఎత్తిపోయడం) ద్వారా నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్నారు. పథకం ప్రారంభం సందర్భంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అదే రోజు జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని గ్రామాల సర్పంచులను, ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నారు. ఉమ్మడి పాలకుల
నిర్లక్ష్యం, వివక్షతో తాగునీరు, సాగునీటికి నోచుకోక దశాబ్దాల కాలంపాటు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులను మొదలుపెట్టడం, ఆదిలోనే ఆపేయడం.. ఇదీ నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి అని విమర్శించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాగునీరూ అందించలేని పరిస్థితి ఉండేదన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు, వెట్‌ రన్‌ ప్రారంభంపై సీఎం బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్వయం పాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. నాటి ఉమ్మడి పాలకులు మొదలుపెట్టి పెండింగులో పెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంతో పాలమూరు జిల్లా పచ్చగా మారి వలసలు ఆగిపోయాయని చెప్పారు. అదే దృఢ సంకల్పంతో ఎత్తిపోతల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే అనేక అడ్డంకులు ఎదురయ్యాయని, పాలమూరు జిల్లా రాజకీయ నాయకులే వందల కేసులు పెట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు.అడ్డంకులను అధిగమించి కేంద్రం నుంచి పర్యావరణ అనుమతి సాధించడంతోపాటు నీటిని ఎత్తిపోసే రోజు దక్షిణ తెలంగాణకు పండగ రోజు అని కేసీఆర్‌ అన్నారు. దక్షిణ తెలంగాణ ప్రజలకు ఇంతకన్నా మరో గొప్ప వేడుక ఉంటుందని అనుకోనని వ్యాఖ్యానించారు. ఇందుకు కృషి చేసిన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, సలహాదారు పెంటారెడ్డి, చీఫ్‌ ఇంజినీర్లు హమీద్‌ఖాన్‌, రమణారెడ్డిలను అభినందించారు. ఈ నెల 16న నిర్వహించే పాలమూరు ఎత్తిపోతల ప్రారంభ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రారంభోత్సవంతో పాటు బహిరంగ సభ నిర్వహణ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రజల తరలింపునకు రవాణా, భోజన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణలోని పల్లెపల్లెకు తాగునీరు, సాగునీరు అందనుందని.. బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుందని ఆయన చెప్పారు. పథకానికి అడ్డంకులు తొలగి కొలిక్కివచ్చినందున ఈ నెల 17న ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి గ్రామంలో దేవాలయాల్లో దేవుళ్ల పాదాలను పాలమూరుజలాలతో అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుందామని సీఎం సూచించారు. ఇదిలా ఉండగా మొదటి రిజర్వాయర్‌ నార్లాపూర్‌ నిల్వ సామర్థ్యం 6.4 టీఎంసీలు కాగా, మొదట 2.2 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నట్లు ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి.

*సుజీవన్ వావిలాల*🖋️

సీఎం కేసీఆర్ కు... రేవంత్ బహిరంగ లేఖ

*సీఎం కేసీఆర్ కు... రేవంత్ బహిరంగ లేఖ*

హైదరాబాద్: కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనాలు చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.లేఖలో ఏముందంటే.. ''తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు కీలక భూమిక పోషించారు. తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవని చెప్పి మాట తప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా..

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల వెతలు తీరలేదు. క్రమబద్ధీకరణ జరగకపోగా జీతాలివ్వండి మహాప్రభో అని అర్ధించాల్సిన పరిస్థితి. మే నెలలో రెగ్యులర్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లకూ ఏప్రిల్ నెల జీతం ఇంకా రాలేదు. డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకూ కొన్ని జిల్లాల్లో జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి.విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నా.. సకాలంలో నెలలుగా జీతాలు లేక వందలాది మంది అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందేవి.

కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏ రోజు జీతం పడుతుందో కూడా తెలియని దుస్థితి. ఐదారు నెలలుగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదేనా ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే? ధనిక రాష్ట్రమని చెప్పుకోవడమే తప్ప కాంట్రాక్ట్ లెక్చరర్స్‌కు వేతనాలు చెల్లించలేని దుస్థితి మీ ప్రభుత్వంలో దాపురించింది. కాంట్రాక్ట్ లెక్చరర్లకు సకాలంలో జీతాలు చెల్లించాలి. లేనిపక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడమే కాక... వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతాం.'' అని రేవంత్‌ లేఖలో హెచ్చరించారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Tuesday, September 5, 2023

MLC కవిత కు మాణిక్యం ఠాకూర్ కౌంటర్....!

*MLC కవిత కు మాణిక్యం ఠాకూర్ కౌంటర్....!*
డీల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పెద్ద మెజార్టీతో గెలవబోతుందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ జోస్యం చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు  మాణిక్యం ఠాగూర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందన్నారు. బీఆర్ఎస్ ఓడిపోతుందనే కవిత మహిళా రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తుతున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌ను తెలంగాణ మహిళలు ఓడించబోతున్నారని పేర్కొన్నారు.సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎప్పటి నుంచో గళం వినిపిస్తున్నారని.. యూపీఏ ప్రభుత్వం హయాంలో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. సరైన సంఖ్య బలం లేకనే యూపీఏ హయాంలో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయలేకపోయామన్నారు. బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి కూడా సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

తెలంగాణ ప్రజలతో భాజాపా ఎందుకు మమేకం కావడం లేదు...?

*తెలంగాణ ప్రజలతో భాజాపా ఎందుకు మమేకం కావడం లేదు...?*

 *మాజీ MLA* *మన్నే శ్రీనివాస్ రెడ్డి*
హైదరాబాద్‌: తనకు సస్పెన్షన్‌లు కొత్తకాదని మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తాను ఏనాడూ భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు.తెలంగాణ ప్రజల కోసం ఎన్నిసార్లయినా సస్పెన్షన్‌కు గురవుతానని వ్యాఖ్యానించారు. ఇటీవల భాజపా ఆయన్ను సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలతో భాజపా ఎందుకు మమేకం కావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడినా భారాస, భాజపా కలిసిపోయాయని అనుకుంటున్నారని.. మొయినాబాద్‌ ఫాంహౌస్‌ ఘటన తర్వాత ఏం జరిగిందో అర్థం కావడం లేదని శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

*సుజీవన్ వావిలాల🖋️*