Sunday, February 12, 2023
డాక్టర్ కందాల శోభారాణి గారు కొద్దిసేపటి క్రితం తీవ్ర అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.
నేను చెప్పేవి అబ్బద్ధం అవుతే రాజీనామా చేస్తా..... సీఎం కేసీఆర్
Saturday, February 11, 2023
తొమ్మిదో నిజాం ఎంపికపై వివాదం
*తొమ్మిదో నిజాం ఎంపికపై వివాదం*
*హైదరాబాద్.....!*
ఇటీవల కన్నుమూసిన నిజాం ముకర్రం జా కుమారుడు అజ్మత్‌జాను తొమ్మిదో నిజాంగా ప్రకటించడం సరికాదని అస్‌ఫజాహీ వంశస్థులు, మజ్లి్‌స-ఎ-సాహెబ్ జాదాగన్ సొసైటీ సభ్యులు, నిజాం కుటుంబీకులు స్పష్టం చేశారు.హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలపై కనీస అవగాహన లేని అజ్మత్‌కు వారసత్వ బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిజాం ట్రస్టీల్లో ఒక్కరినీ సంప్రదించకుండా, ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. శనివారం ఓ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ లండన్‌లో పుట్టిపెరిగిన అజ్మత్‌కు నిజాం కుటుంబీకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. '16 ట్రస్టుల్లోని 4,500 మంది సభ్యులంతా కలిసి..
నవాబ్ రౌనఖ్‌యార్‌ఖాన్‌ను తొమ్మిదో నిజాంగా ఎంపిక చేశాం. రౌనఖ్ ప్రమాణస్వీకార తేదీని త్వరలో ప్రకటిస్తాం. మా నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిసి, వారికి పరిస్థితులను వివరించాం' అని తెలిపారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Friday, February 10, 2023
జబర్దస్త్ జోకులు చేస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా
◾ *|| తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా ||* ◾
▪️ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వాయిదా పడిన సచివాలయ ప్రారంభోత్సవం.
▪️రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవంకు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.
▪️17న సచివాలయం ప్రారంభం వాయిదా.
*సుజీవన్ వావిలాల🖋️*
50 స్థానాల్లో పోటీ.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం: అసదుద్దీన్
*50 స్థానాల్లో పోటీ.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం: అసదుద్దీన్*
హైదరాబాద్: తెలంగాణలో ఎంఐఎం పార్టీ 50 స్థానాల్లో పోటీ చేయడంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఇష్టాగోష్ఠిలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. సీఎం కేసీఆర్ తాజ్ మహల్ లాగే సచివాలయాన్ని చాలా బాగా నిర్మించారని కొనియాడారు. సచివాలయ ప్రారంభం అధికారిక కార్యక్రమం అని.. దానికి తప్పకుండా హాజరవుతానని చెప్పారు. పరేడ్ గ్రౌండ్‌లో జరిగే భారాస సభతో మాత్రం తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని అసదుద్దీన్ అన్నారు. తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారని, దేశమంతా వస్తే మంచిదేనని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఎంఐఎంను భాజపా బీ టీం అని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భాజపాను ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో జేపీసీ కోసం అడిగితే ప్రధాని మోదీ అంగీకరించడం లేదన్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
చెడి పోయిన బుల్లెట్ ప్రూఫ్ కారుతో ప్రగతి భవన్ కు.....రాజాసింగ్ అరెస్ట్
*చెడి పోయిన బుల్లెట్ ప్రూఫ్ కారుతో ప్రగతి భవన్ కు.....రాజాసింగ్ అరెస్ట్....*
హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే, రాజాసింగ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.చెడిపోయిన తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని తీసుకొని ఎమ్మెల్యే శుక్రవారం ప్రగతి భవన్ వద్దకు వెళ్లారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ మార్చాలని, లేదంటే ఆ వాహనం మీరు తీసుకోవాలంటూ ప్రగతిభవన్ వద్ద వదిలేసి రాజాసింగ్ వెళుతున్నారు.
ఇది గమనించిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మీడియా కంట పడకుండా పూర్తిగా మూసేసిన పోలీస్ డీసీఎంలో అసెంబ్లీకి తీసుకొచ్చారు. కాగా గతంలో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆయనను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
*సుజీవన్ వావిలాల*🖋️