Saturday, February 11, 2023

తొమ్మిదో నిజాం ఎంపికపై వివాదం

*తొమ్మిదో నిజాం ఎంపికపై వివాదం*

*హైదరాబాద్.....!*
ఇటీవల కన్నుమూసిన నిజాం ముకర్రం జా కుమారుడు అజ్మత్‌జాను తొమ్మిదో నిజాంగా ప్రకటించడం సరికాదని అస్‌ఫజాహీ వంశస్థులు, మజ్లి్‌స-ఎ-సాహెబ్‌ జాదాగన్‌ సొసైటీ సభ్యులు, నిజాం కుటుంబీకులు స్పష్టం చేశారు.హైదరాబాద్‌ సంస్కృతి, సంప్రదాయాలపై కనీస అవగాహన లేని అజ్మత్‌కు వారసత్వ బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిజాం ట్రస్టీల్లో ఒక్కరినీ సంప్రదించకుండా, ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. శనివారం ఓ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ లండన్‌లో పుట్టిపెరిగిన అజ్మత్‌కు నిజాం కుటుంబీకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. '16 ట్రస్టుల్లోని 4,500 మంది సభ్యులంతా కలిసి..

నవాబ్‌ రౌనఖ్‌యార్‌ఖాన్‌ను తొమ్మిదో నిజాంగా ఎంపిక చేశాం. రౌనఖ్‌ ప్రమాణస్వీకార తేదీని త్వరలో ప్రకటిస్తాం. మా నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిసి, వారికి పరిస్థితులను వివరించాం' అని తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment