*50 స్థానాల్లో పోటీ.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం: అసదుద్దీన్*
హైదరాబాద్: తెలంగాణలో ఎంఐఎం పార్టీ 50 స్థానాల్లో పోటీ చేయడంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఇష్టాగోష్ఠిలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. సీఎం కేసీఆర్ తాజ్ మహల్ లాగే సచివాలయాన్ని చాలా బాగా నిర్మించారని కొనియాడారు. సచివాలయ ప్రారంభం అధికారిక కార్యక్రమం అని.. దానికి తప్పకుండా హాజరవుతానని చెప్పారు. పరేడ్ గ్రౌండ్‌లో జరిగే భారాస సభతో మాత్రం తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని అసదుద్దీన్ అన్నారు. తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారని, దేశమంతా వస్తే మంచిదేనని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఎంఐఎంను భాజపా బీ టీం అని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భాజపాను ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో జేపీసీ కోసం అడిగితే ప్రధాని మోదీ అంగీకరించడం లేదన్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment