Friday, December 9, 2022

మానవ హక్కుల దినోత్సవం

https://www.instagram.com/p/Cl-TdTNv_rg/?igshid=N2ZiY2E3YmU=                              
*ప్రతి మనిషి మనిషిగా జీవించడానికి కొన్ని హక్కులు ఉండాలి. ఇందులో జాతి, భాష, కుల, మతాలకతీతంగా మనిషిగా జీవించే హక్కు కలిగి ఉండడమే ప్రధాన ఉద్దేశ్యం.*

*అలాంటి మానవ హక్కుల దినాన్ని 10.12.1948న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటినుండి ప్రతిసంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 10వ తేదీ ని అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమే ఈ అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యం..... (WD)...... Bplkm🪶(బాపట్ల కృష్ణమోహన్)*

దళితుడిని చెప్పుతో కొట్టిన సర్పంచ్ ను అరెస్ట్ చేయాలి.... RS ప్రవీణ్ కుమార్....!

*దళితుడిని చెప్పుతో కొట్టిన సర్పంచ్ ను అరెస్ట్ చేయాలి.... RS ప్రవీణ్ కుమార్....!*

నార్కట్‌పల్లి: ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి లో ఓ మహిళా సర్పంచ్ రెచ్చిపోయారు.కారణం ఏమో తెలియదు కానీ ఓ దళితుడిని చెప్పుతో కొట్టింది. ఆమె చెప్పుతో కొడుతున్నప్పుడు ఒకరిద్దరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పక్కన ఉన్నవాళ్లు అడ్డుకుంటున్న వారిని వారించారు. చివాలెత్తిన సర్పంచ్..

ఈ ఘటనను ఎవరో సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుంటే అతడిని కూడా చెప్పుతో కొట్టింది. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్  తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) ను ఉద్దేశించి ప్రవీణ్ ట్వీట్ చేశారు.

మీరేమో దళిత బందని మోసం చేస్తున్నారు. మీ అగ్ర వర్ణ సర్పంచులేమో పేద దళితులపై నార్కట్‌పల్లిలో ఎట్ల దాడి చేస్తున్నారో చూడండి. ఇక మీ పోలీసులేమో ఫిర్యాదు ఇచ్చిన రెండు రోజులకు కూడా మీ అండ చూసుకుని స్పందించడం లేదు. ఈ సర్పంచ్‌ని వెంటనే అరెస్టు చేసి, ఎస్సైని వెంటనే విధులనుండి తొలగించాలి'' అని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

ప్రశ్నిస్తే ఎన్కౌంటర్ చేస్తారా??

https://www.instagram.com/p/Cl8Fdn-vb76/?igshid=N2ZiY2E3YmU=  https://twitter.com/Praja_Snklpm/status/1601115190778810368?t=IhT6IRgW6ZhfQzQh4EzrLg&s=08  
                                                                           *#తెలంగాణ లో ఏమిజరుగుతుంది  ??*

*#ప్రజాస్వామ్యమా లేకపోతే #రజాకార్ల పాలననా?*

*భారత రాజ్యాంగం కల్పించిన న్యాయమైన హక్కులకు అనుగుణంగా ప్రశ్నిస్తే #ఎన్కౌంటర్ చేస్తారా @TelanganaDGP సారూ మీ అధికారులు??*

*@Collector_SRD* @spsangareddy @dr_mvreddy @India_NHRC @RSPraveenSwaero #Askktr
*Bplkm🪶*         

*****---*****---*****  

*@spsangareddy Are we in a Democracy or in a Police State?Can you please investigate on priority? Otherwise, people will loose the faith on the system....@RaviVattem*                                                                     
@KTRoffice
@AmeenpurPs
#Ameenpur #Telangana

Thursday, December 8, 2022

రాత్రికి రాత్రి చెరువుని పూడ్చివేసే యత్నం!

"చెరువు కబ్జా"

రాత్రికి రాత్రి చెరువుని పూడ్చివేసే యత్నం!
అమీన్పూర్లో బరితెగించిన కబ్జామాఫియా!
సంగారెడ్డిజిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ శంభునికుంట చెరువులో లారీలతో మట్టిని తీసుకొచ్చి నింపుతున్నారు.
Can someone respond?
This is a very serious issue.
Who gave then such lenience & freehand to openly grab a lake overnight without any fear of Law? Looks like there is no fear of Law?
Or Land /Lakes grabbing, encroachments, illegal layout & double regs been legalized by the Govt?  I as a responsible citizen reported this crime a 1:30 a.m. once I got the info from my reporter friend, but unfortunately, NO official from the Govt has shown any interest to act immediately including Police, Revenue and irrigation department. Culprits used fake number plates.Please remember, silence will only reflects your inability to act on culprits.
Why do you hold a position when you cannot perform?
Do you guys have Moral and ethical values?
Remember, your salaries comes from the Public's hard-earned money.
Step down if you cannot perform.

Courtesy by : @RaviVattem (Twitter)

@spsangareddy @AmeenpurPs @AmeenpurM @Collector_SRD @RajarshiShahIAS @cdmatelangana
#Telangana #Sangareddy #Ameenpur @Collector_SRD @cdmatelangana @HMDA_Gov @RajarshiShahIAS #LakesEncroachments #Landgrabbers



సమరయోధుల భూకబ్జాలపై కేసులు ఎందుకు పెట్టడం లేదు

*_రోడ్డును కుమ్మేశారు_*
_సమరయోధుల భూ కుంభకోణం -2_
_● ఆ స్థలంలోకి వెళ్ళకండి_
_● ఖమ్మం రెండవ అదనపు మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఆదేశాలు_
_● సమరయోధుల భూకబ్జాలపై కేసులు ఎందుకు పెట్టడం లేదు_
_● కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వాస్తవమే - అయితగాని జనార్దన్, న్యాయవాది_

Courtesy by : (ఖమ్మం నుంచి పరమాత్మ)_*

*_ఎట్టకేలకు స్వాతంత్ర్య సమరయోధుల ఇళ్ళ స్థలం విషయంలో కబ్జారాయుళ్ళకు ఎదురుదెబ్బ తగిలింది. ఇక జరగాల్సిన తంతులు క్రిమినల్ కేసులు, గ్రీన్ బెల్ట్. విషయం వెలుగులోకి రాగా.. రోడ్డు ఆక్రమించిన వైనం వెలుగులోకి వచ్చింది. వీటిపై హైకోర్టును ఆశ్రయించే దిశలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇది అటు కలక్టరేట్ అధికారులను, ఇటు పోలీసు అధికారులకు పెద్ద చిక్కులు తెచ్చి పెట్టే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెపుతున్నారు._*

*_భయ్యా..రోడ్డును కుమ్మేశారు:_*
సమరయోధులకు కేటాయించిన ఇళ్ళ స్థలం 1వ నెంబర్ ప్లాటు నుంచి వెళ్ళే దారిని కొందరు కబ్జా చేశారు. ఇందులో ఖమ్మం పట్టణ కాంగ్రెస్ నాయకుడికి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. దారి ఆక్రమణకు సంబంధించి ఒకొక్క బ్రోకర్ కు మూడు లక్షల వరకు సదరు నాయకుడు ముట్టచెప్పనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఓ కళాశాల పేరుతో ఉన్న టిఆర్ఎస్ నాయకుడి తమ్ముడు కూడా ఈ సమరయోధుల ప్లాట్ల కొనుగోలులో ప్రమేయం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

*_కేసుల నమోదుపై మీనమేషాలు:_*
భూ ఆక్రమణదారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూ కుంభకోణంలో తెరాస నాయకుడి తమ్ముడి పాత్రకు సంబంధించిన ఆడియో రికార్డులు బయటకు వచ్చాయి. ఇప్పటికైనా ఖమ్మం పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించాలని బాధితులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని అమరవీరుల స్థూపం వద్ద 'శాంతియుత మెరుపు నిరసన కార్యక్రమం' కోసం బాధిత కుటుంబాలు డిజిపిని కోరే అవకాశం ఉంది.

బాక్స్:
*_ఆ స్థలం జోలికి వెళ్ళకుండా కోర్టు ఆదేశాలు:_*
కబ్జాల విషయంపై ఒక స్వాతంత్ర్య సమరయోధుడి వారసుడు ఖమ్మం కోర్టు గుమ్మం ఎక్కాడు. దీంతో బుధవారం ఖమ్మం రెండవ అదనపు మేజిస్ట్రేట్ న్యాయస్థానం కబ్జారాయుళ్ళకు స్పష్టంమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థలం అమ్మటం, కొనటం వంటి  లావాదేవీలు జరిగే అవకాశం లేన్నప్పుడు భూక్య శ్రీను, భూక్యా బాషా, పంతంగి నాగరాజు, పరిమళ రాము, కుర్నవెల్లి శ్రీను @ క్యాప్ శ్రీనులకు ఎలాంటి హక్కులు ఉండవని, భూ కబ్జా చేస్తున్న దృశ్యాలను, ఇతర ఒరిజినల్ డాక్యుమెంట్లను సంబంధిత బాధితులు న్యాయస్థానానికి సమర్పించారు. దీంతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆ స్థలంలోకి 'నాట్ టు ఇంటర్ ఫియర్' ఉత్తర్వులను వెలువరించింది.

బాక్స్:

*_కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వాస్తవమే - అయితగాని జనార్దన్, న్యాయవాది._*
సమరయోధులకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ళ స్థలాలలో 279 ప్లాట్ విషయంలో  కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వాస్తవమే. స్వాతంత్ర్య సమరయోధుల ఇళ్ళ స్థలాల విషయంలో జరుగుతున్న భూ కుంభకోణంపై ఫిర్యాదులు వచ్చినప్పటికి స్పందించని అధికారులపై చట్టపరంగా క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చును. ఇలాంటి అన్యాయాలపై ఎవరైనా ఈ నెంబర్ 9705005658 ద్వారా సంప్రదించవచ్చును.

Tuesday, December 6, 2022

ఖమ్మంలో "సమరయోధుల" ప్లాట్ల కబ్జా బాగోతం

*కలెక్టరేట్, కమీషనర్ సార్లూ...*
*_మీరేం చేస్తారు.?_*
_● సమరయోధుల ప్లాట్ల కబ్జా బాగోతం_
_● అమ్ముకునే హక్కు లేకున్నా..!_
_● కొనుగోళ్ళు చెల్లవు..అయినా.!_
_● గ్రీన్ బెల్ట్ కబ్జా.!_
_● ఖమ్మంలో వెలుగుచూసిన భూ బాగోతం_
_● ఫిర్యాదులపై స్పందన ఏది.?_
_● విచారణ జరిపేది ఎప్పుడు.?_

Courtesy by : ( అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009 )_*

*_200 ఏండ్ల బ్రిటిష్‌ దాస్యశృంఖలాల నుంచి విముక్తి కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వీరులు ఎందరో.. ఎందరెందరో... స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్న యావత్త్ భారతావని ఏం ఇచ్చి ఆ మహానుభావుల రుణం తీర్చుకోగలదు.? ఏం చేసినా..? ఎంత చేసినా తక్కువే.! అయితే రాను రాను ఆర్థిక అవసరాలు మారాయి. సమరయోధుల ఆర్థిక పరిస్థితి గురించి దేశవ్యాప్తంగా పెన్షన్ సౌకర్యంతో పాటు, వ్యవసాయ భూములు, ఇళ్ళస్థలాలను ప్రభుత్వం కేటాయించింది. ఇంత వరకు ఓకే.! ఈ ఇళ్ళ స్థలాలను ప్రభుత్వ అనుమతి లేకుండా అమ్మటం, కొనటం చేయరాదు. ఖమ్మంలో జరిగిన స్వాతంత్ర్య సమరయోధుల ఇళ్ళ స్థలాల విషయంలో కొత్త కోణం వెలుగుచూసింది. కోట్లాది రూపాయల ఈ 'భూ భూ కుంభకోణం'పై ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, శాంతి భద్రతలను పర్యవేక్షించే పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్  చట్టపరంగా చర్యలు చేపడతారా..? లేక మీనమేషాలు లెక్కిస్తూ ఉపేక్షిస్తారా.?_*

*_అసలేం జరుగుతుంది..?:_*
ఈ ఇళ్ళ స్థలాలపై అక్రమార్కులు కన్నేశారు. ఒక నిబంధన లేదు.. నియమం లేదు.. పద్ధతి లేదు.. చట్టం లేదు. అసలు రికార్డులు పట్టించుకునే తీరిక లేదు. ఒరిజనల్‌ పట్టాల స్థానంలో ఫోర్జరీ పట్టాలు వచ్చాయి. అవి 'నకిలీ పట్టాలు మొర్రో' అంటూ జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు నివేదికలు పంపినా వాటికీ దిక్కు లేదు.

*_అమ్ముకునే హక్కు లేదు:_*
ఈ స్థలాల కేటాయింపు సందర్భంగా ప్రభుత్వం 21 నిబంధనలను ఏర్పాటు చేసింది. ఈ నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా ఈ భూమి లేదా ఇంటి స్థలం అమ్మకం చేయరాదు. చేసేటట్లయితే అందరి  కుటుంబ సభ్యుల నిరంభ్యంతర అనుమతి తప్పనిసరి. అందులో ఏ ఒక్కరు 'నో' చెప్పినా దానికి కలెక్టర్ అనుమతి నిరాకరిస్తారు. ఒకవేళ ఆ స్థలాలపై ఎవరు ఎలాంటి లావాదేవీలు జరిపినా.. ఆ స్థల యాజమాన్య హక్కులను జిల్లా కలెక్టర్ రద్దు చేసే  అవకాశం ఉంటుంది.

*_ఖమ్మంలో ఏం జరుగుతోంది:_*
స్వాతంత్ర్య సమరయోధులకు దేశవ్యాప్తంగా కేటాయించినట్లుగానే ఖమ్మంలో కూడా  మూడు ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాల కేటాయింపు జరిగింది. ఇందులో వైఎస్సార్ నగర్ సమీపంలో ఒక్కొక్కరికి 146 గజాల చొప్పున 323 మందికి ప్రొసీడింగ్ నెం.10995/06 ద్వారా ఇళ్ళ స్థలాలు కేటాయించారు. 'రియల్ ఎస్టేట్'కు రెక్కలు రావడంతో ఈ ఇళ్ళ స్థలాలపై కబ్జారాయిళ్ళ కన్ను పడింది. రౌడీ షీటర్లు మీసాలు తిప్పటం మొదలెట్టారు. నకిలీ పట్టాలు సృష్టించి... ఆక్రమణలకు 'తెర' దీశారు. 

*_ఫిర్యాదులు వస్తే..:_*
ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే ప్రభుత్వ యంత్రాంగం ఖమ్మంలో ఆ వైపు దృష్టి సారించటం.లేదు. ఇలాంటి ఆగడాలకు హైదరాబాద్ నగరంలో పిడి ఆక్ట్ రుచి చూపిస్తుంటే ఖమ్మం నగరంలో సంబంధిత అధికారులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

*_సంప్రదింపులు ఎందుకు..?_*
భూ కబ్జాల విషయంలో సమరయోధుల వారసులు పలువురు పోలీస్టేషన్ గుమ్మాలు ఎక్కటం కనిపిస్తోంది. నిబంధనల మేరకు అమ్మకం చేయరాదంటూనే... కబ్జారాయుళ్ళకు 'బయట మాట్లాడుకోగలరు..' అంటూ వెసులుబాటు ఇవ్వటం ఈ కబ్జా 'నాటు' నాయాళ్ళకు వరంగా మారింది.

*_అంతా ఒకటే సిండికేట్_*
స్వాతంత్ర్య సమరయోధులకు ఇళ్ళ స్థలాల కేటాయింపు వ్యవహారం ప్రభుత్వం బహిరంగ ప్రకటించకపోవడం ఈ కబ్జా రాయుళ్ళకు వరంలా మారింది. వీరంతా ఒకటే సిండికేట్. ఒకరు మరొకరికి అమ్మినట్లు.. వారు మరొకరికి అమ్మనట్లు ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు బయటకు వస్తారు. దీంతో సమరయోధులు లేదా వారి వారసులకు ఇదో 'పెద్ద వివాదం' ఉన్నట్లు 'సీన్ క్రియేట్' చేస్తారు. దీంతో ఎంతకో అంతకు ఈ ప్లాటును వదులుకోవడానికి సిద్దపడతారు. అయితే ఈ స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు చెందినవి అయితే ఈ కబ్జా రాయుళ్ళ ఆట ఒక విధంగా ఉంటుంది. ఇవి ప్రభుత్వం కేటాయించిన స్థలాలు కావడం వల్ల ఏ వారసుడు వచ్చి మళ్ళీ క్లైమ్ చేస్తే ... ఆ స్థలం కొనుగోలుదారులు వదులుకోవల్సిందే..! ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ స్థలాలు కొనటం, అమ్మటం నేరం. ఈ కబ్జా రాయుళ్ళకు ఓ కింద స్థాయి పోలీసు సిబ్బంది ఒకరు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

*_ప్రభుత్వం ఏం చేయాలి.?_*
ఇలాంటి సందర్భాలు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 47 జరిగాయి. పంజాబ్ రాష్ట్రంలోని పటియాల జిల్లాలో ఏకంగా కలెక్టర్ రంగంలోకి అసలు వారసులకు భూములు ఇప్పించపం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పలు భూములు కోర్టు గుమ్మాలు ఎక్కాయి. వారసులు 2008 నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. 28మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపల వేశారు. 7గురిపైన రౌడీషీట్లు ఓపెన్ చేశారు. ఖమ్మంలో కూడా సమరయోధుల కుటుంబాలకు సమగ్ర సమాచారం ఇవ్వాలి. ఒకవేళ సమరయోధులు మరణిస్తే వారి వారసులకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వం వెంటనే చేపట్టాలి.

*_'గ్రీన్ ఫీల్డ్' గాయబ్.!_*
స్వాతంత్ర్య సమరయోధులకు‌ కేటాయించిన స్థలాలలతో పాటు గ్రీన్ ఫీల్డ్ సైతం కబ్జాలు జరుగుతున్నాయి. వైఎస్సార్ నగర్ లో రోడ్డు పక్కనే ఉన్న గ్రీన్ ఫీల్డ్ కబ్జా చేసి ఏకంగా ఐదుగురికి అమ్మకం చేయటం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఆధారాలు, దిన పత్రికలలో వచ్చిన విషయాలను జోడిస్తూ...
గత నెల 18న కలెక్టర్ గౌతమ్ కు ఈమేరకు ఫిర్యాదు అందింది. కలెక్టర్ స్పందించని పక్షంలో హైకోర్టును ఆశ్రయించాలని ఔత్సాహికులు భావిస్తున్నారు.

బాక్స్:
*_తాజా ఫిర్యాదు_*
స్వాతంత్ర్య సమరయోధుల ఇళ్ళ స్థలాలకు సంబంధించి ఖమ్మంలో పలు ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి. సోమవారం ఖమ్మం జిల్లా, అర్భన్ పోలీస్టేషన్ లో ఓ ఫిర్యాదు (KMM/KNPH KMM/051222/00691) అందింది. పోలీస్ కమీషనర్ శ్రీ విష్ణు ఎస్ వారియర్ కు సైతం మొత్తం ఆధారాలతో కూడిన ఫిర్యాదు అందింది. బాధితుల కథనం ప్రకారం....స్వాతంత్ర్య సమరయోధుడు రామయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్ కాలనీకి సమీపంలో కేటాయించిన ఇంటి స్థలం ప్లాట్ నెంబర్ 279 ఆక్రమణకు గురైంది. భూక్యా శ్రీను, క్యాప్ శ్రీను అలియాస్ కుర్నవెల్లి శ్రీను, భూక్యా హరి, పరిమళ రాము అలియాస్ రామన్న, పంతంగి నాగరాజు అలియాస్ డాన్ నాగరాజులకు  అండగా నిలుస్తున్న మాజీ సర్పంచ్ బాషా పేరుపై ఏకంగా ఓ అగ్రిమెంట్ పుట్టుకొచ్చింది. ఇక్కడే అసలు దొంగలు దొరికారు. ఈ స్వాతంత్ర్య సమరయోధుడు స్పష్టంగా సంతకం పెడతారు. ఇక్కడ 'వేలిముద్ర'తో నకిలీ సృష్టించారు. ఇక్కడ చూపెడుతున్న పట్టా కూడా నకిలీ దే కావడం గమనార్హం.  అసలు ఈ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ పట్టాతో సహా 2015లోనే ఆయన తన రెండో వారసుడికి ఈ స్థలం అప్పగించటం జరిగింది.

*_వెరైటీగా..కేసు:_*
సమరయోధుల భూములు కబ్జాలకు గురవుతన్నాయంటే రెవెన్యూశాఖలో కొందరు ఉద్యోగుల చేతివాటం కనిపిస్తోంది. అలాగే పోలీసుశాఖ కూడా ఉపేక్షించాల్సిన పని లేదు. ఒకవేళ చర్యలకు శ్రీకారం చుట్టకపోయినా.. సెక్షన్లు సరిగ్గా పేర్కొనక పోయినా... 'సెక్షన్ల. ఆల్ట్రేషన్' కోసం హైకోర్టును ఆశ్రయించటం ఖాయం. ఇదిలా ఉండగా...ఒకవేళ రెవెన్యూ, పోలీసులు అస్సలు స్పందించకపోతే ఏం చేయాలనే విషయంలో ఓ ఔత్సాహికుడు ఏకంగా 'సంబంధిత అధికారులు సరిగ్గా విధులు నిర్వర్తించటం లేదు' అంటూ హైకోర్టులో ఓ కేసు దాఖలు చేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల మెడకు మరో హైకోర్టు కేసు ఉండటం అవసరమా.?

కమలం'తో 'గులాబీ' రాజీకి విఫల ప్రయత్నాలు...!!

*_నో కాంప్రమైజ్_*
 _● ఆంధ్రజ్యోతి కథనం నిజమేనా..?_
_● 'కమలం'తో 'గులాబీ' రాజీకి విఫల ప్రయత్నాలు...!!_
_●  కెలికితే.. ఇలాగే ఉంటుంది..:_
●  సయోధ్య అసాధ్యం
_● అరెస్ట్ కన్ఫాం.!_
_● ఢిల్లీ కేసు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళోచ్చు సుమీ..!_
_●  ఫ్రస్ట్రేషన్‌లో పడేయడమే మైండ్ గేమ్..!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్ 'కు ప్రత్యేకం)_*

*_రేపు: స్వాతంత్ర్య సమరయోధుల భూముల కబ్జా.. కహాని.. సంచలన పరిశోధన కథనం_*

*_కల్వకుంట్ల కుటుంబానికి సంక్లిష్టమైన సంకట స్థితి. గతంలో కరుణానిధి కుమార్తెకు ఎదురైన సందర్భంలాగే ఉంది. ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి. తెలంగాణలో వందలాది మందిని జైళ్ళల్లో పెట్టి.. పైశాచిక ఆనందం పొందినోళ్ళు అంతా పరార్. "ఎవడ్రా బయటకు వచ్చి కాపాడేది.? ఒక్కడూ మాట్లాడడేంట్రా..? దమ్ము పవర్ లో ఉండదురా..! మనిషిలో ఉంటుంది..! వాడి 'జీన్స్'లో ఉంటుంది.! వాళ్ళు తాగిన 'అమ్మ' పాలల్లో ఉంటుంది..! అది మాకుంది..! మరి మీకుందా.?" అంటూ భాజపా వర్గాల ఘీంకారాలు._*

*_అసలేం జరిగిందంటే..?_*
_‘‘ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవితను విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో గ్రానైట్‌ వ్యాపారాలకు సంబంధించి మంత్రి గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ఢిల్లీలో సీబీఐ విచారించింది. మరో మంత్రి మల్లారెడ్డి ఐటీ విచారణను ఎదుర్కొంటున్నారు. కేంద్రంతో సంధి కోసం ఇటీవల కేసీఆర్‌ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆ మధ్య కవితను వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్లి వారం రోజులపాటు మకాం వేసిన కేసీఆర్‌.. రాజీ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన కేంద్రంపై పోరాటానికి దిగారు. ఈ దశలోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగుచూసింది. దీంతో బీజేపీ పెద్దలను రెచ్చగొట్టినట్టు అయింది..’’_

.... ఇదీ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకొచ్చిన స్కూప్... బీజేపీ హైకమాండ్‌తో రాజీ కోసం కేసీయార్ ప్రయత్నాలు చేశాడనీ, కానీ ఫలించలేదనీ, ఆ తరువాతే కేసీయార్ కేంద్రంపై పోరాటానికి దిగాడు అనేది ఆయన పరిశీలన... ‘‘అమాయకత్వంతో గానీ, అత్యాశతో గానీ కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో చిక్కుకున్నారు. వైసీపీకి చెందిన విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఉన్నందున కవిత ముందూ వెనుకా ఆలోచించకుండా వారితో చేతులు కలిపినట్టున్నారు.’’ అని కూడా రాస్తూ, ఢిల్లీ స్కాంలో కవిత ప్రమేయాన్ని రాధాకృష్ణ నిర్ధారిస్తున్నాడు… ఆమె ఏం చేసిందనేది పక్కన పెడితే... ఢిల్లీ స్పందించకపోతేనే కేసీయార్ యుద్ధం స్టార్ట్ చేశాడనే సూత్రీకరణ ఎందుకో కరెక్టు కాదనిపిస్తోంది.. గవర్నర్ తమిళిసై పట్ల త‌ృణీకార ధోరణి దగ్గర్నుంచి బీజేపీ నాయకులపై పరుష వ్యాఖ్యలు, ప్రధాని పర్యటనల్ని అవాయిడ్ చేయడం, మీడియా మీట్లలో తిట్లు ఇప్పుడు కొత్తేమీ కాదు... చాన్నాళ్లుగా కేసీయార్ కొనసాగిస్తున్నదే..!

*_కెలికితే.. ఇలాగే ఉంటుంది.._*
అమిత్ షా, మోడీ, నడ్డా సహా బీజేపీ ముఖ్యనేతలందరినీ బజారుకు లాగడానికి కేసీయార్ ఆడియోలు, వీడియోలు అని ఓ స్కెచ్ వేశాక... ఎప్పుడైతే బీజేపీ జాతీయ కార్యదర్శి సంతోష్‌ను బజారుకు లాగుతున్నాడో.. ఇక కేంద్రం కూడా కవితపై ఉచ్చు బిగిస్తోంది.. 

*_సయోధ్య అసాధ్యం_*
ఇక్కడి దాకా తీసుకొచ్చింది ఎవరు అంటే...అన్ని వేళ్లూ కేసీయార్ వైపే చూపిస్తాయి. గతంలో ఏమో గానీ, ఇక సయోధ్య అసాధ్యం.! కవితను అరెస్టు చేస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎలాంటి శాంతిభద్రతల సమస్య సృష్టిస్తుందో కూడా కేంద్రం అంచనా వేస్తోందనీ, ఇటీవలి అజిత్ ధోవల్ రహస్య పర్యటన కూడా ఆ కోణంలో సాగిందేననీ ప్రచారం ఉంది.!

*_అరెస్ట్ కన్ఫాం_*
గుజరాత్ ఫలితాల తరువాత ఆమెను అరెస్టు చేస్తారని మరో ప్రచారం. ఆల్‌రెడీ బేస్ ప్రిపేరవుతోంది. ముందుగా ఆమెకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. మొదట మా ఇంట్లోనే మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను అన్న కవిత తరువాత ప్రగతిభవన్ వెళ్లి, తండ్రితో భేటీ వేసి, న్యాయనిపుణులనూ అక్కడికే రప్పించుకుని, యూటర్న్ తీసుకుని.. అసలు ఫిర్యాదు ఏమిటో, ఎఫ్ఐఆర్‌లో ఏముందో తనకు కాపీలు పంపిస్తే, తరువాత స్పందిస్తానని సీబీఐకి లేఖ రాసింది... సో, ఈ ఆరో తేదీన విచారణ ఉండకపోవచ్చు.! సీబీఐ ఒకసారి ఉచ్చు బిగించాలని ఫిక్సయ్యాక వెనక్కి తగ్గదు కదా..! దటీజ్ డిఫరెంట్ స్టోరీ..!

*_ఢిల్లీ కేసు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళోచ్చు సుమీ..:_*
సో, వాళ్లే అరెస్టు చేయడానికి వీలుగా, లేదా ఆమె విచారణకు వచ్చేలా 41 సీఆర్పీసీ సెక్షన్‌ను ఉపయోగిస్తారా తెలియదు. అయితే సీబీఐకి స్టేట్‌ జూరిస్‌డిక్షన్ లేదు కాబట్టి ఇంకా ముందుకు పోలేక ఈడీకే బాధ్యత ఇస్తారేమోననే సందేహాలు కొందరిలో ఉన్నాయి. కానీ ఇది ఆల్‌రెడీ ఢిల్లీలో నమోదైన కేసు.. దర్యాప్తు కోసం ఎక్కడికైనా వెళ్లొచ్చు.. కాదంటే సంబంధిత కోర్టు నుంచి తగిన ఆదేశాలు తీసుకునే అవకాశాలున్నాయి. అప్పుడు కవితకు మరింత కష్టం తప్పదు. ఎటొచ్చీ ఇప్పుడు ప్రశ్న, కేంద్రం ఏం సందేహిస్తోంది అనేదే..! రాజకీయ కోణంలో, శాంతిభద్రతల కోణంలో కేసీయార్ రియాక్షన్ ఎలా ఉంటుందనే స్టడీలో మునిగింది బీజేపీ.

*_ఫ్రస్ట్రేషన్‌లో పడేయడమే మైండ్ గేమ్..!:_*
ఇంకొందరు పార్టీ ముఖ్యులపై ఐటీ, ఈడీ దాడులు జరపడం, కవితను పదే పదే విచారణకు పిలవడం ద్వారా మరింత ఫ్రస్ట్రేషన్‌లో పడేయడం వంటి మైండ్ గేమ్ ఉండవచ్చుననే ప్రచారం కూడా ఉంది. వేచి చూడాల్సిందే.!