Tuesday, December 6, 2022

కమలం'తో 'గులాబీ' రాజీకి విఫల ప్రయత్నాలు...!!

*_నో కాంప్రమైజ్_*
 _● ఆంధ్రజ్యోతి కథనం నిజమేనా..?_
_● 'కమలం'తో 'గులాబీ' రాజీకి విఫల ప్రయత్నాలు...!!_
_●  కెలికితే.. ఇలాగే ఉంటుంది..:_
●  సయోధ్య అసాధ్యం
_● అరెస్ట్ కన్ఫాం.!_
_● ఢిల్లీ కేసు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళోచ్చు సుమీ..!_
_●  ఫ్రస్ట్రేషన్‌లో పడేయడమే మైండ్ గేమ్..!_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్ 'కు ప్రత్యేకం)_*

*_రేపు: స్వాతంత్ర్య సమరయోధుల భూముల కబ్జా.. కహాని.. సంచలన పరిశోధన కథనం_*

*_కల్వకుంట్ల కుటుంబానికి సంక్లిష్టమైన సంకట స్థితి. గతంలో కరుణానిధి కుమార్తెకు ఎదురైన సందర్భంలాగే ఉంది. ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి. తెలంగాణలో వందలాది మందిని జైళ్ళల్లో పెట్టి.. పైశాచిక ఆనందం పొందినోళ్ళు అంతా పరార్. "ఎవడ్రా బయటకు వచ్చి కాపాడేది.? ఒక్కడూ మాట్లాడడేంట్రా..? దమ్ము పవర్ లో ఉండదురా..! మనిషిలో ఉంటుంది..! వాడి 'జీన్స్'లో ఉంటుంది.! వాళ్ళు తాగిన 'అమ్మ' పాలల్లో ఉంటుంది..! అది మాకుంది..! మరి మీకుందా.?" అంటూ భాజపా వర్గాల ఘీంకారాలు._*

*_అసలేం జరిగిందంటే..?_*
_‘‘ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవితను విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో గ్రానైట్‌ వ్యాపారాలకు సంబంధించి మంత్రి గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ఢిల్లీలో సీబీఐ విచారించింది. మరో మంత్రి మల్లారెడ్డి ఐటీ విచారణను ఎదుర్కొంటున్నారు. కేంద్రంతో సంధి కోసం ఇటీవల కేసీఆర్‌ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆ మధ్య కవితను వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్లి వారం రోజులపాటు మకాం వేసిన కేసీఆర్‌.. రాజీ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన కేంద్రంపై పోరాటానికి దిగారు. ఈ దశలోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగుచూసింది. దీంతో బీజేపీ పెద్దలను రెచ్చగొట్టినట్టు అయింది..’’_

.... ఇదీ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకొచ్చిన స్కూప్... బీజేపీ హైకమాండ్‌తో రాజీ కోసం కేసీయార్ ప్రయత్నాలు చేశాడనీ, కానీ ఫలించలేదనీ, ఆ తరువాతే కేసీయార్ కేంద్రంపై పోరాటానికి దిగాడు అనేది ఆయన పరిశీలన... ‘‘అమాయకత్వంతో గానీ, అత్యాశతో గానీ కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో చిక్కుకున్నారు. వైసీపీకి చెందిన విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఉన్నందున కవిత ముందూ వెనుకా ఆలోచించకుండా వారితో చేతులు కలిపినట్టున్నారు.’’ అని కూడా రాస్తూ, ఢిల్లీ స్కాంలో కవిత ప్రమేయాన్ని రాధాకృష్ణ నిర్ధారిస్తున్నాడు… ఆమె ఏం చేసిందనేది పక్కన పెడితే... ఢిల్లీ స్పందించకపోతేనే కేసీయార్ యుద్ధం స్టార్ట్ చేశాడనే సూత్రీకరణ ఎందుకో కరెక్టు కాదనిపిస్తోంది.. గవర్నర్ తమిళిసై పట్ల త‌ృణీకార ధోరణి దగ్గర్నుంచి బీజేపీ నాయకులపై పరుష వ్యాఖ్యలు, ప్రధాని పర్యటనల్ని అవాయిడ్ చేయడం, మీడియా మీట్లలో తిట్లు ఇప్పుడు కొత్తేమీ కాదు... చాన్నాళ్లుగా కేసీయార్ కొనసాగిస్తున్నదే..!

*_కెలికితే.. ఇలాగే ఉంటుంది.._*
అమిత్ షా, మోడీ, నడ్డా సహా బీజేపీ ముఖ్యనేతలందరినీ బజారుకు లాగడానికి కేసీయార్ ఆడియోలు, వీడియోలు అని ఓ స్కెచ్ వేశాక... ఎప్పుడైతే బీజేపీ జాతీయ కార్యదర్శి సంతోష్‌ను బజారుకు లాగుతున్నాడో.. ఇక కేంద్రం కూడా కవితపై ఉచ్చు బిగిస్తోంది.. 

*_సయోధ్య అసాధ్యం_*
ఇక్కడి దాకా తీసుకొచ్చింది ఎవరు అంటే...అన్ని వేళ్లూ కేసీయార్ వైపే చూపిస్తాయి. గతంలో ఏమో గానీ, ఇక సయోధ్య అసాధ్యం.! కవితను అరెస్టు చేస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎలాంటి శాంతిభద్రతల సమస్య సృష్టిస్తుందో కూడా కేంద్రం అంచనా వేస్తోందనీ, ఇటీవలి అజిత్ ధోవల్ రహస్య పర్యటన కూడా ఆ కోణంలో సాగిందేననీ ప్రచారం ఉంది.!

*_అరెస్ట్ కన్ఫాం_*
గుజరాత్ ఫలితాల తరువాత ఆమెను అరెస్టు చేస్తారని మరో ప్రచారం. ఆల్‌రెడీ బేస్ ప్రిపేరవుతోంది. ముందుగా ఆమెకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. మొదట మా ఇంట్లోనే మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను అన్న కవిత తరువాత ప్రగతిభవన్ వెళ్లి, తండ్రితో భేటీ వేసి, న్యాయనిపుణులనూ అక్కడికే రప్పించుకుని, యూటర్న్ తీసుకుని.. అసలు ఫిర్యాదు ఏమిటో, ఎఫ్ఐఆర్‌లో ఏముందో తనకు కాపీలు పంపిస్తే, తరువాత స్పందిస్తానని సీబీఐకి లేఖ రాసింది... సో, ఈ ఆరో తేదీన విచారణ ఉండకపోవచ్చు.! సీబీఐ ఒకసారి ఉచ్చు బిగించాలని ఫిక్సయ్యాక వెనక్కి తగ్గదు కదా..! దటీజ్ డిఫరెంట్ స్టోరీ..!

*_ఢిల్లీ కేసు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళోచ్చు సుమీ..:_*
సో, వాళ్లే అరెస్టు చేయడానికి వీలుగా, లేదా ఆమె విచారణకు వచ్చేలా 41 సీఆర్పీసీ సెక్షన్‌ను ఉపయోగిస్తారా తెలియదు. అయితే సీబీఐకి స్టేట్‌ జూరిస్‌డిక్షన్ లేదు కాబట్టి ఇంకా ముందుకు పోలేక ఈడీకే బాధ్యత ఇస్తారేమోననే సందేహాలు కొందరిలో ఉన్నాయి. కానీ ఇది ఆల్‌రెడీ ఢిల్లీలో నమోదైన కేసు.. దర్యాప్తు కోసం ఎక్కడికైనా వెళ్లొచ్చు.. కాదంటే సంబంధిత కోర్టు నుంచి తగిన ఆదేశాలు తీసుకునే అవకాశాలున్నాయి. అప్పుడు కవితకు మరింత కష్టం తప్పదు. ఎటొచ్చీ ఇప్పుడు ప్రశ్న, కేంద్రం ఏం సందేహిస్తోంది అనేదే..! రాజకీయ కోణంలో, శాంతిభద్రతల కోణంలో కేసీయార్ రియాక్షన్ ఎలా ఉంటుందనే స్టడీలో మునిగింది బీజేపీ.

*_ఫ్రస్ట్రేషన్‌లో పడేయడమే మైండ్ గేమ్..!:_*
ఇంకొందరు పార్టీ ముఖ్యులపై ఐటీ, ఈడీ దాడులు జరపడం, కవితను పదే పదే విచారణకు పిలవడం ద్వారా మరింత ఫ్రస్ట్రేషన్‌లో పడేయడం వంటి మైండ్ గేమ్ ఉండవచ్చుననే ప్రచారం కూడా ఉంది. వేచి చూడాల్సిందే.!

No comments:

Post a Comment