*దళితుడిని చెప్పుతో కొట్టిన సర్పంచ్ ను అరెస్ట్ చేయాలి.... RS ప్రవీణ్ కుమార్....!*
నార్కట్‌పల్లి: ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి లో ఓ మహిళా సర్పంచ్ రెచ్చిపోయారు.కారణం ఏమో తెలియదు కానీ ఓ దళితుడిని చెప్పుతో కొట్టింది. ఆమె చెప్పుతో కొడుతున్నప్పుడు ఒకరిద్దరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పక్కన ఉన్నవాళ్లు అడ్డుకుంటున్న వారిని వారించారు. చివాలెత్తిన సర్పంచ్..
ఈ ఘటనను ఎవరో సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుంటే అతడిని కూడా చెప్పుతో కొట్టింది. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ (CM KCR) ను ఉద్దేశించి ప్రవీణ్ ట్వీట్ చేశారు.
మీరేమో దళిత బందని మోసం చేస్తున్నారు. మీ అగ్ర వర్ణ సర్పంచులేమో పేద దళితులపై నార్కట్‌పల్లిలో ఎట్ల దాడి చేస్తున్నారో చూడండి. ఇక మీ పోలీసులేమో ఫిర్యాదు ఇచ్చిన రెండు రోజులకు కూడా మీ అండ చూసుకుని స్పందించడం లేదు. ఈ సర్పంచ్‌ని వెంటనే అరెస్టు చేసి, ఎస్సైని వెంటనే విధులనుండి తొలగించాలి'' అని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment