*_రోడ్డును కుమ్మేశారు_*
_సమరయోధుల భూ కుంభకోణం -2_
_● ఆ స్థలంలోకి వెళ్ళకండి_
_● ఖమ్మం రెండవ అదనపు మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఆదేశాలు_
_● సమరయోధుల భూకబ్జాలపై కేసులు ఎందుకు పెట్టడం లేదు_
_● కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వాస్తవమే - అయితగాని జనార్దన్, న్యాయవాది_
Courtesy by : (ఖమ్మం నుంచి పరమాత్మ)_*
*_ఎట్టకేలకు స్వాతంత్ర్య సమరయోధుల ఇళ్ళ స్థలం విషయంలో కబ్జారాయుళ్ళకు ఎదురుదెబ్బ తగిలింది. ఇక జరగాల్సిన తంతులు క్రిమినల్ కేసులు, గ్రీన్ బెల్ట్. విషయం వెలుగులోకి రాగా.. రోడ్డు ఆక్రమించిన వైనం వెలుగులోకి వచ్చింది. వీటిపై హైకోర్టును ఆశ్రయించే దిశలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇది అటు కలక్టరేట్ అధికారులను, ఇటు పోలీసు అధికారులకు పెద్ద చిక్కులు తెచ్చి పెట్టే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెపుతున్నారు._*
*_భయ్యా..రోడ్డును కుమ్మేశారు:_*
సమరయోధులకు కేటాయించిన ఇళ్ళ స్థలం 1వ నెంబర్ ప్లాటు నుంచి వెళ్ళే దారిని కొందరు కబ్జా చేశారు. ఇందులో ఖమ్మం పట్టణ కాంగ్రెస్ నాయకుడికి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. దారి ఆక్రమణకు సంబంధించి ఒకొక్క బ్రోకర్ కు మూడు లక్షల వరకు సదరు నాయకుడు ముట్టచెప్పనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఓ కళాశాల పేరుతో ఉన్న టిఆర్ఎస్ నాయకుడి తమ్ముడు కూడా ఈ సమరయోధుల ప్లాట్ల కొనుగోలులో ప్రమేయం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
*_కేసుల నమోదుపై మీనమేషాలు:_*
భూ ఆక్రమణదారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూ కుంభకోణంలో తెరాస నాయకుడి తమ్ముడి పాత్రకు సంబంధించిన ఆడియో రికార్డులు బయటకు వచ్చాయి. ఇప్పటికైనా ఖమ్మం పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించాలని బాధితులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని అమరవీరుల స్థూపం వద్ద 'శాంతియుత మెరుపు నిరసన కార్యక్రమం' కోసం బాధిత కుటుంబాలు డిజిపిని కోరే అవకాశం ఉంది.
బాక్స్:
*_ఆ స్థలం జోలికి వెళ్ళకుండా కోర్టు ఆదేశాలు:_*
కబ్జాల విషయంపై ఒక స్వాతంత్ర్య సమరయోధుడి వారసుడు ఖమ్మం కోర్టు గుమ్మం ఎక్కాడు. దీంతో బుధవారం ఖమ్మం రెండవ అదనపు మేజిస్ట్రేట్ న్యాయస్థానం కబ్జారాయుళ్ళకు స్పష్టంమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థలం అమ్మటం, కొనటం వంటి లావాదేవీలు జరిగే అవకాశం లేన్నప్పుడు భూక్య శ్రీను, భూక్యా బాషా, పంతంగి నాగరాజు, పరిమళ రాము, కుర్నవెల్లి శ్రీను @ క్యాప్ శ్రీనులకు ఎలాంటి హక్కులు ఉండవని, భూ కబ్జా చేస్తున్న దృశ్యాలను, ఇతర ఒరిజినల్ డాక్యుమెంట్లను సంబంధిత బాధితులు న్యాయస్థానానికి సమర్పించారు. దీంతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆ స్థలంలోకి 'నాట్ టు ఇంటర్ ఫియర్' ఉత్తర్వులను వెలువరించింది.
బాక్స్:
*_కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వాస్తవమే - అయితగాని జనార్దన్, న్యాయవాది._*
సమరయోధులకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ళ స్థలాలలో 279 ప్లాట్ విషయంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వాస్తవమే. స్వాతంత్ర్య సమరయోధుల ఇళ్ళ స్థలాల విషయంలో జరుగుతున్న భూ కుంభకోణంపై ఫిర్యాదులు వచ్చినప్పటికి స్పందించని అధికారులపై చట్టపరంగా క్రిమినల్ చర్యలకు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చును. ఇలాంటి అన్యాయాలపై ఎవరైనా ఈ నెంబర్ 9705005658 ద్వారా సంప్రదించవచ్చును.
No comments:
Post a Comment