Monday, December 5, 2022

అంబేద్కర్ సారుకు నివాళులు 🙏

*భారత రాజ్యాంగ రచనా కమిటీ ఛైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్ మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగడించి 1956 డిసెంబరు 6 న మహాపరి నిర్వాణం చెందాడు....ఆ మహానుభావునికి #ప్రజాసంకల్పం & link Media నివాళులు అర్పిస్తుంది🙏..... Bplkm 🪶*       
                                     
  *NOTE* : *తెలంగాణ లో #అంబేద్కర్ సారు గారి ఆశయాలను ఈ ప్రభుత్వం నెరవేర్చడం లేదు ఇది వాస్తవం.... రాజ్యాంగంను గౌరవించని #తెరాస ప్రభుత్వం....#ప్రజాస్వామ్యంను అపహాస్యం చేస్తున్న #తెరాస ప్రభుత్వం..... #బహుజనులారా మేలుకోండి ఇంకెన్నాళ్లు మౌనంగా వుంటారు?? అంబేద్కర్ సారు విగ్రహాలకు & ఫోటోలకు దండలు వేయడం కాదు అంబేద్కర్ సారు మనందరికోసం ముందుచూపుతో రచించిన రాజ్యాంగంకు అనుగుణంగా నడుచుకుందాం*

జలమండలి ఎండి దాన కిషోర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చిన కార్పొరేటర్:-శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు గారు

*జలమండలి ఎండి దాన కిషోర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చిన కార్పొరేటర్:-శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు గారు*

రామంతపూర్ డివిజన్లోని శ్రీనగర్ కాలనీలో సివరేజి లైన్, మరియు *భరత్ నగర్*, సత్య నగర్, సాబేర కాలనీలలో మంచినీటి పైప్ లైన్ కోసం ఈరోజు రామంతపూర్ కార్పొరేటర్ *శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు గారు* జలమండలి ఎండి *దాన కిషోర్ గారిని* కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.

దాన కిషోర్ గారు స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగినది.

కార్పొరేటర్ తో పాటు రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకటరావుగారు పాల్గొన్నారు.

https://www.instagram.com/p/Clym87Mv9YB/?igshid=YmRhOGE0MWQ=

Sunday, December 4, 2022

@MC_Peerzadiguda plz respond

https://twitter.com/Praja_Snklpm/status/1599422693916692480?t=FQFVjNbaADp-b3TC2i8iVA&s=08                                         *@MC_Peerzadiguda  plz respond*
*@JakkaVenkat2020*
*#AskKTR*

@BplplH

*Bplkm🪶*

Friday, December 2, 2022

అంబేద్కర్ విగ్రహాన్ని వేడుకున్నాడు

హైదరాబాద్ వెళ్లిన శ్రీకాంతచారి తొలుత బీజేపీ లో ఆ తరువాత టీఆర్‌ఎస్‌ లో క్రీయాశీలక కార్యకర్తగా, విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్రను పోషించాడు. తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలను ముందుండి నడిపేవాడు. సెలవుల్లో ఇంటికి వెళ్లినా.. తెలంగాణ ధ్యాసే. అదే పాటలు పాడుతూ తెలంగాణ నినాదాలు చేస్తూ కవితలు రాస్తూ ఉండేవాడు. తెలంగాణ అతడి ఊతపదమైంది. ఈ క్రమంలో తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ అధినేత కె.సి.ఆర్ చేపట్టిన అమరణదీక్ష శ్రీకాంత్‌లో ఉద్యమావేశాన్ని నింపింది.

ఆత్మాహుతి

తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం దమనకాండ, అరెస్టులను చూసి శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. ఆ ఉద్వేగంతో, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తన చావైనా ఈ మొండి ప్రభుత్వంలో చలనం తీసుకురావాలని కోరుతూ ఆత్మాహుతికి యత్నించాడు. 2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఉద్యమజ్వాలను రగిల్చి అగ్నికి ఆహుతి అవుతూ జై తెలంగాణ అంటూ నినదించాడు. నీవైనా న్యాయం చేయమంటూ అంబేద్కర్ విగ్రహాన్ని వేడుకున్నాడు. కాలిన గాయాలతో కామినేని, యశోద, ఉస్మానియాతో పాటు చివరకు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 32009 న రాత్రి 10.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచాడు. ఐదు రోజుల పాటు మత్యువుతో పోరాడుతూ కూడా తెలంగాణ స్మరణ చేశాడు. బతికితే తెలంగాణ కోసం మళ్లీ చావడానికైనా సిద్ధమన్నాడు. తెలంగాణ బిడ్డ ఎగిసే మంటల్లో బూడిదవుతుంటే టీవీల్లో చూసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెలు రగిలాయి. ప్రతి ఒక్కరూ ఉద్యమానికి ఉద్యుక్తులయ్యేలా శ్రీకాంతచారి ఉద్యమజ్వాల రగిలించాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడైన శ్రీకాంతచారి తెలంగాణ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయాడు.

Courtesy by : వీకీపిడియా 

కార్పొరేట్ గుప్పెట్లోకి ఓ ఛానెల్

*_మరో 'రవిప్రకాష్'.!_*
_● కార్పొరేట్ గుప్పెట్లోకి ఓ ఛానెల్_
_● ఎన్డీటీవీకి ప్రణయ్ రాయ్ గుడ్‌బై..!_
_● ఇక ఎన్డీటీవీకి అదానీ మాటే శాసనం..!_

*ప్రకటన:*
*_నెలసరి జీతంతో 'తెలంగాణ వాచ్'లో పనిచేయుటకు... పరిశోధన జర్నలిజంపై ఆసక్తి ఉన్న జర్నలిస్టులు తమ వివరాలను anamchinniexclusive@gmail.com కు పంపగలరు._*

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, 9440000009)_*

*_పైకి ప్రజాస్వామ్య దేశం. జరుగుతున్న వైనాలు మాత్రం డబ్బు, పవర్ ఉన్నోడిదే రాజ్యం. సరిగ్గా 2019లో జరిగిన 'సీన్' ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. టివి9 అనగానే గుర్తుకు వచ్చేది రవిప్రకాష్ పేరు. అలాగే ఎన్డీటీవీ అనగానే ఎలక్ట్రానిక్ మీడియా గురించి అవగాహన ఉన్నవారికి ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రణయ్ రాయ్. ఎన్డీటీవీ ఛానల్ ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ తాజాగా ఆ ఛానల్ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ప్రణయ్ రాయ్ భార్య రాధికా రాయ్ కూడా డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. బోర్డ్ ఆఫ్ ఆర్.ఆర్.పి.ఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఎన్డీటివీ ఛానల్ ప్రమోటర్ గ్రూప్ నుంచి ఈ ఇద్దరూ నిష్క్రమించారు._*

*_అసలేం జరిగిందంటే...?:_*
ఎన్డీటీవీలో మెజార్టీ షేర్లు ఇప్పటికే అదానీ గ్రూప్ దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. దీంతో.. ఎన్డీటీవీ అదానీ గ్రూప్ సొంతమైంది. ఎన్‌డీటీవీ ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను అదానీ కొనుగోలు చేశారు.

*_ఇదీ వాటాల కథ:_*
తద్వారా ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్‌ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీంతో.. మొత్తంగా ఎన్డీటీవీలో ప్రస్తుతం అదానీ గ్రూప్‌ 55.18 శాతం వాటా దక్కించుకుంది. ఎన్డీటీవీ యాజమాన్యపు హక్కు సొంతం చేసుకునేందుకు ఈ మాత్రం వాటా సరిపోతుంది. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేయడంతో నవంబర్ 29న జరిగిన సమావేశంలో ఆర్.ఆర్.పి.ఆర్.హెచ్ ప్రమోటర్ గ్రూప్ వారి రాజీనామాలను ఆమోదించింది. సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నియ చెంగల్వరాయన్‌లను కొత్త డైరెక్టర్లుగా ఆర్.ఆర్.పి.ఆర్.హెచ్ నియమించింది.

*_ఎన్డీటీవీ‌ని అదానీ గ్రూప్ ఎలా సొంతం చేసుకుందంటే..:_*
అదానీ గ్రూప్‌ తాజాగా వార్తా ప్రసార మాధ్యమ రంగంలోకీ ప్రవేశించింది. ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ చానల్‌ ‘న్యూ ఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌’లో (ఎన్‌డీటీవీ) మెజారిటీ వాటాను చేజిక్కించుకుంది. అయితే తమ సమ్మతి లేకుండానే అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చర్యలు చేపట్టిందని ఎన్‌డీటీవి చెబుతోంది. లిస్టెడ్‌ కంపెనీ అయిన ఎన్‌డీటీవీలో గౌతమ్‌ అదానీ తొలుత పరోక్షంగా వాటా దక్కించుకున్నారు. ఇందుకోసం ఎన్‌డీటీవీ ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేశారు. తద్వారా ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్‌ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది.

*_అంబానీతో పోటీగా అదానీ:_*
అదానీ మీడియా నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌, విశ్వప్రధాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కలిసి ఈ ఆఫర్‌ను ప్రకటించాయి. ఇందుకోసం రూ.493 కోట్లు వెచ్చించనున్నాయి. ఎన్‌డీటీవీకి చెందిన 1,67,62,530 షేర్లను ఒక్కొక్కటీ రూ.294 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపాయి. బీఎస్‌ఈలో ఎన్‌డీటీవీ షేరు ధర గత ఆగస్ట్ 23న 2.61 శాతం పెరిగి రూ.366.20 వద్ద ముగిసింది. ఈ ముగింపు ధరతో పోలిస్తే ఓపెన్‌ ఆఫర్‌ రేటు 19.71 శాతం తక్కువ. సెబీ నిబంధనల ప్రకారం.. ఏదైనా లిస్టెడ్‌ కంపెనీలో 25 శాతం, అంతకు పైగా వాటా కొనుగోలు చేసినప్పుడు తప్పక ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. ఎన్‌డీటీవీ కొనుగోలుతో తన ప్రధాన వ్యాపార ప్రత్యర్థి ముకేశ్‌ అంబానీతో పోటీని అదానీ మరో మెట్టెక్కించారు. అంబానీ చాలాకాలంగా న్యూస్‌ చానళ్ల విభాగంలో ఉన్నారు. ఆయన యాజమాన్యంలోని నెట్‌వర్క్‌ 18 సంస్థ సీఎన్‌ఎన్‌-న్యూ్‌స 18, సీఎన్‌బీసీ-టీవీ 18 వంటి వార్తా చానళ్లను నిర్వహిస్తోంది.

*_కొసమెరుపు:_*
రవిప్రకాష్ ఓ భాగస్వామిగా హక్కుల కోసం ఇంకా పోరాడుతుండగా...ప్రణయ్ రాయ్ కి మాత్రం ఆ అవకాశం లేదు.

బాక్స్:

*_కేటీఆర్ అన్ ఫాలో..:_*
ఇదిలా ఉండగా.. బోర్డు డైరెక్టర్లుగా ప్రణయ్ రాయ్, ఆయన భార్య తప్పుకోగానే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్డీటీవీని ట్విట్టర్‌లో అన్‌ఫాలో చేశారు. ఇప్పటివరకూ ఎన్డీటీవీ నిష్పాక్షిక సమాచారాన్ని ఇచ్చి బాగా పనిచేసిందని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి అదానీ 'బినామీ' అని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కూడా అదానీ విషయంలో ఇదే వైఖరితో ఉంది. దీంతో.. ఇకపై బీజేపీ ప్రో ఛానల్‌గా ఎన్డీటీవీ మారిందన్న సంకేతానిచ్చేలా కేటీఆర్ ఆ ఛానల్‌ను అన్‌ఫాలో చేయడం గమనార్హం.

బాక్స్:
*_ఆమె ఇమడగలదా..?_*
పాల్కీ శర్మ ఉపాధ్యాయ్… వయస్సు 40… వృత్తి టీవీ ప్రజెంటర్… ఈమె పేరు ఇప్పుడు జర్నలిస్టు సర్కిళ్లలోనే గాకుండా భిన్నవర్గాల ప్రముఖుల చర్చల్లోనూ నానుతోంది… ప్రస్తుతానికి అధికారికంగా ఏ ప్రకటనా లేదు… కానీ ఈమె ఎన్డీటీవీ ఎడిటోరియల్ చీఫ్‌గా చేరబోతుందనేది ఈ చర్చల సారాంశం… అసలు ఎవరీమె..? మూడు ప్రధాన మీడియా సంస్థలు ఎందుకు ఆమె సారథ్యం కావాలని బలంగా కోరుకుంటున్నాయి..?

*_కొంచెం అగ్రసీవ్:_*
విషయం ఎక్కడిదాకా వెళ్లిందంటే కోర్టుకు కూడా ఎక్కింది. వివరాల్లోకి వెళ్దాం. ఆమె పుట్టింది రాజస్థాన్‌లోని పిలానీ. మొదట్లో దూరదర్శన్‌లో చేసేది. తరువాత సీఎన్ఎన్-ఐబీఎన్‌లో చేరి చాన్నాళ్లు పనిచేసింది.. భర్త సంకేత్ ఉపాధ్యాయ్...తను కూడా జర్నలిస్టే. పాల్కీకి గుడ్ ప్రజెంటర్‌గా పేరుంది. సరైన గణాంకాలతో, ఒక పర్సనల్ లైన్ తీసుకోకుండా, స్పష్టంగా, సరళంగా ప్రేక్షకులకు సబ్జెక్టును ప్రజెంట్ చేస్తుందనే పేరు. దేశంలోకెల్లా టాప్ టీవీ ప్రజెంటర్ ఆమె ఇప్పుడు...

సీఎన్ఎన్-ఐబీఎన్ తరువాత వియాన్‌లో చేరింది. అది ఎస్సెల్ గ్రూపు, అంటే జీమీడియాకు చెందిన ప్లాట్‌ఫామ్.. అంటే బీజేపీ మాజీ ఎంపీ.. అనేక చానెళ్లు, మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో ఓ బలమైన ఇన్‌ఫ్లుయెన్స్ సంస్థ… అందులో మేనేజింగ్ ఎడిటర్‌గా చేరిన పాల్కీ గ్రావిటాస్ అనే ప్రోగ్రాంతో విస్తృతంగా జనంలోకి వెళ్లింది. ఆర్నబ్‌కూ ఆమెకూ తేడా ఏమిటంటే... ఆర్నబ్ అరుస్తాడు, కరుస్తాడు, ఎగురుతాడు, ఆవేశపడతాడు, తన సొంత భావాల్ని రుద్దే ప్రయత్నం చేస్తాడు. కానీ పాల్కీ అలా కాదు. కూల్.. తను ఎమోషనల్ అయిపోదు. విషయం ఏమిటో అర్థమయ్యేట్టుగా వివరిద్దాం, ప్రేక్షకులకే సొంత అభిప్రాయం ఏర్పరుచుకునే అవకాశం ఇద్దాం అనేది ఆమె సూత్రం.

ఏవో కారణాలు, ఆమె వియాన్‌ను వదిలేసింది. 'నో, మేం ఎలా ఒప్పుకుంటాం' అని జీగ్రూపు ఆమెను రిలీవ్ చేయడానికి మొరాయించింది. కోర్టుకు ఎక్కింది. అదేమంటే..? ఆమె నెట్‌వర్క్18లో చేరబోతోందనీ, వియాన్ సంబంధ కాన్ఫిడెన్షియల్ సమాచారం అక్కడికి చేరితే తమకు నష్టమనీ వాదించింది. ఒప్పందాలకు భిన్నంగా మధ్యలోనే వదిలేస్తున్నందుకు కోట్ల పరిహారం కట్టాలని ఉరిమింది. నెట్‌వర్క్18 తెలుసు కదా.! ఆదానీ ఢీకొడుతున్న అంబానీది.

ఇప్పుడు ఆదానీ ఎన్డీటీవీ పగ్గాలను పూర్తిగా చేజిక్కించుకున్నాడు. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ దంపతులతోపాటు ఎడిటోరియల్ విభాగాన్ని లీడ్ చేస్తున్న రవీష్ కుమార్ కూడా రాజీనామా చేశాడు. ఎలాగూ ప్రణయ్ విధేయ టీంను ఆదానీ అక్కడ కొనసాగనివ్వడు. ఈలోపు తనే రాజీనామా చేశాడు. ఆదానీ ఆల్రెడీ పాల్కీ శర్మకు మేనేజింగ్ ఎడిటర్ పోస్టు ఆఫర్ చేశాడనీ, ఆమె చేరబోతోందనీ వెబ్ వార్తల్లో బలంగా వినిపిస్తోంది. నిన్న మొత్తం నెట్‌లో ఇదే డిస్కషన్. ఆమె కోణంలో నిజానికి ఇది మంచి ఆఫరే, ఎన్డీటీవీ కోణంలోనూ మంచి ఆఫరే. ఆమె భర్త ఆల్రెడీ ఎన్డీటీవీలోనే కన్సల్టింగ్ ఎడిటర్‌గా ఉన్నాడు.

Thursday, December 1, 2022

CM Sri KCR distributed cheques

It has been wrongly reported in a section of the media that, the cheques CM Sri KCR distributed to the families of deceased farmers who lost their lives during the farmers’ agitation, could not be encashed when presented in the banks.On 22nd May, 2022 Hon’ble CM distributed 1,010 Cheques to 709 families of deceased farmers from Punjab and Haryana. When the matter was enquired into it was learnt that 814 cheques have already been encashed by the families of the deceased farmers.Other beneficiaries have not presented the cheques in their respective banks within the stipulated period of 3 months. Telangana Govt. instructed the banks to revalidate all such cheques.Mr Ram Singh, Jt. Secretary, Revenue Dept. may be contacted on 9581992577 for any further assistance. The Govt. of Telangana firmly stands by the families of the departed farmers in this moment of grief and is committed that this measure of support reaches the concerned families.

Courtesy by : https://twitter.com/TelanganaCMO/status/1598338047057494016?t=HkTZdlhezG20B03VcMzlAw&s=19

గారాలపట్టి కటికనేల నిద్ర__తండ్రి తట్టుకోగలడా ??

*_అరెస్టులు ఎప్పుడు.?_*
_● గారాలపట్టి కటికనేల నిద్ర_
_● తండ్రి తట్టుకోగలడా.?_
_● గులాబీ దండుకు ఇబ్బందులే.!_
_● ఎదుర్కొనే పనిలో బిగ్ బాస్_
_● హీనమైన ఎత్తుగడ -కల్వకుంట్ల కవిత_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)_*

*_ఎంత కష్టం వచ్చిపడింది. చూస్తుండగానే 'లిక్కర్ స్కాం' బద్దలయింది. రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు. ఈమధ్య కాలంలో ఆ కుటుంబం ఎదుర్కొంటున్న అతి పెద్ద గంభీరమైన సమస్య ఇదే.! పార్టీ శ్రేణులన్నీ ఒక్కసారిగా మూగనోము పట్టడం. ఎలా ఎదుర్కోవాలనే విషయంలో గందరగోళం. ఇక జరగబోయే న్యాయ ప్రక్రియ అంతా లాంఛనమే.! అదే ఎప్పుడు..? ఏ విధంగా జరగబోతుందనేదే ఆసక్తికరం._* 

*_అసలేం జరిగింది.?_*
లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ  కవిత పేరును ఈడీ  అధికారులు ప్రస్తావించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు.  ఆమ్​ ఆద్మీ పార్టీకి కమీషన్ల కోసమే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అత్యధికంగా మార్జిన్ పెట్టారని అందులో ఆరోపించారు. ఆమ్​ ఆద్మీ పార్టీ తరఫున విజయ్ నాయర్ వందకోట్ల ముడుపులు తీసుకున్నట్లు చెప్పారు.

*_సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు_*
విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు అందాయని, సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కవిత, ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, శరత్ రెడ్డి ఉన్నారని ఈడీ తెలిపింది. 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కవిత 10 ఫోన్లు మార్చారని..ఆ 10 ఫోన్ల ఈఎంఐఈ నెంబర్లను అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ప్రస్తావించారు.

*_ఆధారాలు దొరకకుండా 153 ఫోన్లు ధ్వంసం:_*
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 36 మంది నిందితులు/అనుమానితులు ఉన్నారని అమిత్​ అరోరా రిమాండ్​ రిపోర్టులో ఈడీ పేర్కొంది. వారందరూ దాదాపు 170 ఫోన్లను వినియోగించారని.. అయితే వాటిలో కేవలం 17 ఫోన్లే తమకు దొరికాయని ఈడీ తెలిపింది.  అమిత్​ అరోరా వాడిన 11 ఫోన్లను, ఎమ్మెల్సీ కవిత వాడిన 10 ఫోన్లను ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ కేసులో ధ్వంసమైన  153 ఫోన్ల విలువ దాదాపు రూ.1.38 కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేసింది. 

*_ఎవరీ అమిత్​ అరోరా ?_*
గురుగ్రామ్ కు చెందిన అమిత్ అరోరా బడ్డీ రిటైల్ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుల్లో అమిత్ ఒకరు.ఇవాళ ఉదయం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అరెస్ట్ చేసింది. సిసోడియాకు అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరా అత్యంత సన్నిహితులు కాగా.. వీరిలో దినేశ్ అరోరా సీబీఐ కేసులో అప్రూవర్గా మారాడు. అధికారులు అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.   

*_సీబీఐ  ఛార్జ్షీట్ లో ఏముంది ?_*
మరోవైపు ఈ కేసులో సీబీఐ తొలి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. సుమారు 10 వేల పేజీల ఛార్జ్షీట్ ను రౌస్‌ అవెన్యూ కోర్టులో అధికారులు దాఖలు చేశారు. ఛార్జ్షీట్ లో ఎ1 గా కుల్దీప్ సింగ్, ఎ2 గా నరేంద్ర సింగ్, ఎ3గా విజయ్ నాయర్, ఎ4 గా అభిషేక్ బోయిన పల్లి ఉన్నారు. ఈ కేసులో మొదట సీబీఐ విచారణ జరపగా.. తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. విజయ్ నాయర్, అభిషేక్ రావుకు ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  దానిపై  స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

*_అరెస్టులు ఎప్పుడు.?_*
కొన్ని కేసులలో రిమాండ్ రిపోర్టు ఆధారంగా అరెస్టులు జరుగుతాయి. ఇక్కడ మాత్రం లావాదేవీలు కీలకంగా మారనున్నాయి. వందకోట్ల ముడుపుల పంచాయతీలో ఎవరికి.? ఎంత.? ఏవిధంగా..? అన్నదే ముఖ్యం. మొత్తం 36మంది చుట్టూ తిరుగుతున్న ఈ లిక్కర్ స్కాంలో మరికొద్ది రోజుల్లో మరికొన్ని అరెస్టులు ఉండవచ్చు. అందులో కవిత ఉంటుందా.? లేదా.? అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది.

బాక్స్:

*ప్లాష్.. ప్లాష్.. ప్లాష్..*

*_హీనమైన ఎత్తుగడ -కల్వకుంట్ల కవిత_*
తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐలు కేసులు పెట్టడం భాజపా హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దిల్లీ మద్యం కేసు రిమాండ్‌ రిపోర్టులో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొంత మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని నివాసం వద్ద గురువారం ఉదయం మీడియాతో ఆమె మాట్లాడారు. 

‘‘దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతోంది. 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో భాజపా అధికారంలోకి వచ్చిన విషయాన్ని గమనిస్తున్నాం. మోదీ కంటే ముందు ఈడీ ఆయా రాష్ట్రాలకు వెళ్లడాన్ని చూస్తున్నాం. వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ఉన్నందున మోదీ కంటే ముందు ఈడీ ఇక్కడికి వచ్చింది. అది నార్మల్‌. నాపై కావొచ్చు.. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు హీనమైన ఎత్తుగడ. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి విచారణకైనా మేం సిద్ధం. 

ఆయా ఏజెన్సీలు వచ్చి అడిగితే తప్పకుండా జవాబు ఇస్తాం. అంతేకానీ మీడియాలో లీకులు ఇచ్చి నేతలకు ఉన్న మంచి పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు తిప్పికొడతారనే విషయాన్ని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పంథాని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మనమేం చేస్తామో చెప్పుకొని గెలవాలి తప్ప.. ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాదు. అత్యంత చైతన్యవంతమైన ప్రజలు ఉన్న తెలంగాణలో మీకు అది సాధ్యపడదు. కాదు కూడదు అని జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. ఏమౌతుంది.. భయపడేదేముంది. ప్రజలు మా వెంట ఉన్నంతకాలం.. ప్రజల కోసం తెరాస చిత్తశుద్ధితో పనిచేస్తున్నంతకాలం ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ రాదు’’ అని కవిత వ్యాఖ్యానించారు.