Friday, December 2, 2022

కార్పొరేట్ గుప్పెట్లోకి ఓ ఛానెల్

*_మరో 'రవిప్రకాష్'.!_*
_● కార్పొరేట్ గుప్పెట్లోకి ఓ ఛానెల్_
_● ఎన్డీటీవీకి ప్రణయ్ రాయ్ గుడ్‌బై..!_
_● ఇక ఎన్డీటీవీకి అదానీ మాటే శాసనం..!_

*ప్రకటన:*
*_నెలసరి జీతంతో 'తెలంగాణ వాచ్'లో పనిచేయుటకు... పరిశోధన జర్నలిజంపై ఆసక్తి ఉన్న జర్నలిస్టులు తమ వివరాలను anamchinniexclusive@gmail.com కు పంపగలరు._*

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, 9440000009)_*

*_పైకి ప్రజాస్వామ్య దేశం. జరుగుతున్న వైనాలు మాత్రం డబ్బు, పవర్ ఉన్నోడిదే రాజ్యం. సరిగ్గా 2019లో జరిగిన 'సీన్' ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. టివి9 అనగానే గుర్తుకు వచ్చేది రవిప్రకాష్ పేరు. అలాగే ఎన్డీటీవీ అనగానే ఎలక్ట్రానిక్ మీడియా గురించి అవగాహన ఉన్నవారికి ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రణయ్ రాయ్. ఎన్డీటీవీ ఛానల్ ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ తాజాగా ఆ ఛానల్ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ప్రణయ్ రాయ్ భార్య రాధికా రాయ్ కూడా డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. బోర్డ్ ఆఫ్ ఆర్.ఆర్.పి.ఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఎన్డీటివీ ఛానల్ ప్రమోటర్ గ్రూప్ నుంచి ఈ ఇద్దరూ నిష్క్రమించారు._*

*_అసలేం జరిగిందంటే...?:_*
ఎన్డీటీవీలో మెజార్టీ షేర్లు ఇప్పటికే అదానీ గ్రూప్ దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. దీంతో.. ఎన్డీటీవీ అదానీ గ్రూప్ సొంతమైంది. ఎన్‌డీటీవీ ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను అదానీ కొనుగోలు చేశారు.

*_ఇదీ వాటాల కథ:_*
తద్వారా ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్‌ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీంతో.. మొత్తంగా ఎన్డీటీవీలో ప్రస్తుతం అదానీ గ్రూప్‌ 55.18 శాతం వాటా దక్కించుకుంది. ఎన్డీటీవీ యాజమాన్యపు హక్కు సొంతం చేసుకునేందుకు ఈ మాత్రం వాటా సరిపోతుంది. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేయడంతో నవంబర్ 29న జరిగిన సమావేశంలో ఆర్.ఆర్.పి.ఆర్.హెచ్ ప్రమోటర్ గ్రూప్ వారి రాజీనామాలను ఆమోదించింది. సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నియ చెంగల్వరాయన్‌లను కొత్త డైరెక్టర్లుగా ఆర్.ఆర్.పి.ఆర్.హెచ్ నియమించింది.

*_ఎన్డీటీవీ‌ని అదానీ గ్రూప్ ఎలా సొంతం చేసుకుందంటే..:_*
అదానీ గ్రూప్‌ తాజాగా వార్తా ప్రసార మాధ్యమ రంగంలోకీ ప్రవేశించింది. ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ చానల్‌ ‘న్యూ ఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌’లో (ఎన్‌డీటీవీ) మెజారిటీ వాటాను చేజిక్కించుకుంది. అయితే తమ సమ్మతి లేకుండానే అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చర్యలు చేపట్టిందని ఎన్‌డీటీవి చెబుతోంది. లిస్టెడ్‌ కంపెనీ అయిన ఎన్‌డీటీవీలో గౌతమ్‌ అదానీ తొలుత పరోక్షంగా వాటా దక్కించుకున్నారు. ఇందుకోసం ఎన్‌డీటీవీ ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేశారు. తద్వారా ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్‌ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది.

*_అంబానీతో పోటీగా అదానీ:_*
అదానీ మీడియా నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌, విశ్వప్రధాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కలిసి ఈ ఆఫర్‌ను ప్రకటించాయి. ఇందుకోసం రూ.493 కోట్లు వెచ్చించనున్నాయి. ఎన్‌డీటీవీకి చెందిన 1,67,62,530 షేర్లను ఒక్కొక్కటీ రూ.294 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపాయి. బీఎస్‌ఈలో ఎన్‌డీటీవీ షేరు ధర గత ఆగస్ట్ 23న 2.61 శాతం పెరిగి రూ.366.20 వద్ద ముగిసింది. ఈ ముగింపు ధరతో పోలిస్తే ఓపెన్‌ ఆఫర్‌ రేటు 19.71 శాతం తక్కువ. సెబీ నిబంధనల ప్రకారం.. ఏదైనా లిస్టెడ్‌ కంపెనీలో 25 శాతం, అంతకు పైగా వాటా కొనుగోలు చేసినప్పుడు తప్పక ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. ఎన్‌డీటీవీ కొనుగోలుతో తన ప్రధాన వ్యాపార ప్రత్యర్థి ముకేశ్‌ అంబానీతో పోటీని అదానీ మరో మెట్టెక్కించారు. అంబానీ చాలాకాలంగా న్యూస్‌ చానళ్ల విభాగంలో ఉన్నారు. ఆయన యాజమాన్యంలోని నెట్‌వర్క్‌ 18 సంస్థ సీఎన్‌ఎన్‌-న్యూ్‌స 18, సీఎన్‌బీసీ-టీవీ 18 వంటి వార్తా చానళ్లను నిర్వహిస్తోంది.

*_కొసమెరుపు:_*
రవిప్రకాష్ ఓ భాగస్వామిగా హక్కుల కోసం ఇంకా పోరాడుతుండగా...ప్రణయ్ రాయ్ కి మాత్రం ఆ అవకాశం లేదు.

బాక్స్:

*_కేటీఆర్ అన్ ఫాలో..:_*
ఇదిలా ఉండగా.. బోర్డు డైరెక్టర్లుగా ప్రణయ్ రాయ్, ఆయన భార్య తప్పుకోగానే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్డీటీవీని ట్విట్టర్‌లో అన్‌ఫాలో చేశారు. ఇప్పటివరకూ ఎన్డీటీవీ నిష్పాక్షిక సమాచారాన్ని ఇచ్చి బాగా పనిచేసిందని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి అదానీ 'బినామీ' అని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ కూడా అదానీ విషయంలో ఇదే వైఖరితో ఉంది. దీంతో.. ఇకపై బీజేపీ ప్రో ఛానల్‌గా ఎన్డీటీవీ మారిందన్న సంకేతానిచ్చేలా కేటీఆర్ ఆ ఛానల్‌ను అన్‌ఫాలో చేయడం గమనార్హం.

బాక్స్:
*_ఆమె ఇమడగలదా..?_*
పాల్కీ శర్మ ఉపాధ్యాయ్… వయస్సు 40… వృత్తి టీవీ ప్రజెంటర్… ఈమె పేరు ఇప్పుడు జర్నలిస్టు సర్కిళ్లలోనే గాకుండా భిన్నవర్గాల ప్రముఖుల చర్చల్లోనూ నానుతోంది… ప్రస్తుతానికి అధికారికంగా ఏ ప్రకటనా లేదు… కానీ ఈమె ఎన్డీటీవీ ఎడిటోరియల్ చీఫ్‌గా చేరబోతుందనేది ఈ చర్చల సారాంశం… అసలు ఎవరీమె..? మూడు ప్రధాన మీడియా సంస్థలు ఎందుకు ఆమె సారథ్యం కావాలని బలంగా కోరుకుంటున్నాయి..?

*_కొంచెం అగ్రసీవ్:_*
విషయం ఎక్కడిదాకా వెళ్లిందంటే కోర్టుకు కూడా ఎక్కింది. వివరాల్లోకి వెళ్దాం. ఆమె పుట్టింది రాజస్థాన్‌లోని పిలానీ. మొదట్లో దూరదర్శన్‌లో చేసేది. తరువాత సీఎన్ఎన్-ఐబీఎన్‌లో చేరి చాన్నాళ్లు పనిచేసింది.. భర్త సంకేత్ ఉపాధ్యాయ్...తను కూడా జర్నలిస్టే. పాల్కీకి గుడ్ ప్రజెంటర్‌గా పేరుంది. సరైన గణాంకాలతో, ఒక పర్సనల్ లైన్ తీసుకోకుండా, స్పష్టంగా, సరళంగా ప్రేక్షకులకు సబ్జెక్టును ప్రజెంట్ చేస్తుందనే పేరు. దేశంలోకెల్లా టాప్ టీవీ ప్రజెంటర్ ఆమె ఇప్పుడు...

సీఎన్ఎన్-ఐబీఎన్ తరువాత వియాన్‌లో చేరింది. అది ఎస్సెల్ గ్రూపు, అంటే జీమీడియాకు చెందిన ప్లాట్‌ఫామ్.. అంటే బీజేపీ మాజీ ఎంపీ.. అనేక చానెళ్లు, మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో ఓ బలమైన ఇన్‌ఫ్లుయెన్స్ సంస్థ… అందులో మేనేజింగ్ ఎడిటర్‌గా చేరిన పాల్కీ గ్రావిటాస్ అనే ప్రోగ్రాంతో విస్తృతంగా జనంలోకి వెళ్లింది. ఆర్నబ్‌కూ ఆమెకూ తేడా ఏమిటంటే... ఆర్నబ్ అరుస్తాడు, కరుస్తాడు, ఎగురుతాడు, ఆవేశపడతాడు, తన సొంత భావాల్ని రుద్దే ప్రయత్నం చేస్తాడు. కానీ పాల్కీ అలా కాదు. కూల్.. తను ఎమోషనల్ అయిపోదు. విషయం ఏమిటో అర్థమయ్యేట్టుగా వివరిద్దాం, ప్రేక్షకులకే సొంత అభిప్రాయం ఏర్పరుచుకునే అవకాశం ఇద్దాం అనేది ఆమె సూత్రం.

ఏవో కారణాలు, ఆమె వియాన్‌ను వదిలేసింది. 'నో, మేం ఎలా ఒప్పుకుంటాం' అని జీగ్రూపు ఆమెను రిలీవ్ చేయడానికి మొరాయించింది. కోర్టుకు ఎక్కింది. అదేమంటే..? ఆమె నెట్‌వర్క్18లో చేరబోతోందనీ, వియాన్ సంబంధ కాన్ఫిడెన్షియల్ సమాచారం అక్కడికి చేరితే తమకు నష్టమనీ వాదించింది. ఒప్పందాలకు భిన్నంగా మధ్యలోనే వదిలేస్తున్నందుకు కోట్ల పరిహారం కట్టాలని ఉరిమింది. నెట్‌వర్క్18 తెలుసు కదా.! ఆదానీ ఢీకొడుతున్న అంబానీది.

ఇప్పుడు ఆదానీ ఎన్డీటీవీ పగ్గాలను పూర్తిగా చేజిక్కించుకున్నాడు. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ దంపతులతోపాటు ఎడిటోరియల్ విభాగాన్ని లీడ్ చేస్తున్న రవీష్ కుమార్ కూడా రాజీనామా చేశాడు. ఎలాగూ ప్రణయ్ విధేయ టీంను ఆదానీ అక్కడ కొనసాగనివ్వడు. ఈలోపు తనే రాజీనామా చేశాడు. ఆదానీ ఆల్రెడీ పాల్కీ శర్మకు మేనేజింగ్ ఎడిటర్ పోస్టు ఆఫర్ చేశాడనీ, ఆమె చేరబోతోందనీ వెబ్ వార్తల్లో బలంగా వినిపిస్తోంది. నిన్న మొత్తం నెట్‌లో ఇదే డిస్కషన్. ఆమె కోణంలో నిజానికి ఇది మంచి ఆఫరే, ఎన్డీటీవీ కోణంలోనూ మంచి ఆఫరే. ఆమె భర్త ఆల్రెడీ ఎన్డీటీవీలోనే కన్సల్టింగ్ ఎడిటర్‌గా ఉన్నాడు.

No comments:

Post a Comment