Friday, September 16, 2022

తమిళనాడులో స్కూలు పిల్లలకు ఉచితంగా టిఫిన్ - సిఎం స్టాలిన్

తమిళనాడులో స్కూలు పిల్లలకు ఉచితంగా టిఫిన్ - సిఎం స్టాలిన్

తమిళనాడులో ప్రభుత్వ ప్రాధమిక స్కూళ్ల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని సిఎం ఎంకె స్టాలిన్ గురువారం ప్రారంభించారు.ఈ పథకం పరిధిలో 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు టిఫిన్లు అందుతాయి.మధురైలో పథకం ఆరంభించిన స్టాలిన్ అక్కడి చిన్నారులకు ఆహారం అందించడమే కాకుండా వారితో కలిసి కూర్చుని తాను కూడా ఆరగించారు. పేదల జీవనస్థితిగతులలో మార్పు దిశగా ఈ పథకం దోహదం చేస్తుందని పిల్లల్లో అధ్యయన శక్తి పెరిగేందుకు,పిల్లలను క్రమం తప్పకుండా బడులకు రప్పించేందుకు ఈ స్కీం దోహదపడుతుందని చరిత్రలో దీనికి ప్రత్యేకత ఉంటుందని తెలిపారు.పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ స్కీంలు అమెరికా, యూరప్‌లలో ఉన్నాయని, అక్కడ విద్యార్థులలో వికాసానికి ఈ తోడ్పాటు ఎంతగానో ఉపకరించినట్లు వెల్లడైందని,దీనిని పరిగణనలోకి తీసుకున్నామని స్టాలిన్ తెలిపారు. స్కీం తొలిదశలో రాష్ట్రంలోని 1545 స్కూళ్లలో అమలు అవుతుంది.రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి నేపథ్యంలో మధురైలో దీనిని ఆరంభించారు.ఈ అల్పాహార పథకంలో భాగంగా విద్యార్థులకు వడ్డించే వాటిలో సాంబార్‌తో సేమియా ఉప్మా, రవ్వ ఉప్మా, సేమియా కిచిడి, రవ్వ పొంగలి వుంటుంది..

Courtesy by link Media 

Thursday, September 15, 2022

పేరు పెట్టడం ఓకే.... దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది... RS ప్రవీణ్ కుమార్

*పేరు పెట్టడం ఓకే.... దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది... RS ప్రవీణ్ కుమార్*

తెలంగాణ సెక్రటేరియెట్ కు అంబేడ్కర్ పేరు పెట్టడం మంచిదే అని బీఎస్పీ స్టేట్ ఛీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కానీ భవనాలకు, రోడ్లకు, పేరు పెట్టి, పెద్ద విగ్రహాలను నిర్మించి, ఆ మహనీయుల ఆశయాలను తెలివిగా తుంగలో తొక్కే ప్రయత్నం అనాదిగా జరుగుతున్నదే అని గుర్తు చేశారు.అధికారం కోసం ఏమైనా చేస్తారు..మీకు చిత్తశుద్ది ఉంటే మీ అక్రమ ఆస్తులను పేదలకు పంచి సామాజిక అసమానతలను తగ్గించాలని డిమాండ్ చేశాడు. 2014కు ముందు దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. బహుజనుల ఓట్ల కోసం ఆధిపత్య వర్గాలు ఏమైనా చేస్తారని దుయ్యబట్టారు. బహుజనుల లక్ష్యం కుర్చీ తప్ప మరొటి కాదని మాన్యవర్ కాన్సిరాం గారు ఏనాడో చెప్పారని తెలిపారు.

ఫాం హౌస్‌లను పేదలకు రాసివ్వండి..అంబేడ్కర్ పై అభిమానం ఉంటే ముందు మీ ఫాం హౌస్‌లను పేదలకు రాసివ్వండని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా మీ బినామీ కంపెనీలను పేదలకు పంచి, ఇన్ని రోజులు తెలంగాణల చేసిన దోపిడీకి ట్యాంక్ బండ్ దగ్గర క్షమాపణ చెప్పాలన్నారు.

అధికారమే బహుజనుల లక్ష్యం..

మనం అడగకపోయినా సచివాలయానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాడు. కానీ ఆయన వెయ్యి సార్లు ప్రతిజ్ఞ చేసి చెప్పిన దళిత ముఖ్యమంత్రి పదవి మాత్రం ఇవ్వడని చెప్పారు. తన తర్వాత కూడా కొడుకునే ముఖ్యమంత్రి చేసే పనిలో ఉన్నాడని వివరించారు. "బహుజనులారా సచివాలయానికి బాబాసాహెబ్ పేరు చూసి సంకలు గుద్దుకుందామా? బహుజనులను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించే కాన్సిరాం బాటలో నడుద్దామా?" ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

CI కుటుంబానికి రూ.25 లక్షలు సాయం....!

*CI  కుటుంబానికి రూ.25 లక్షలు  సాయం....!*

గుండె పోటుతో మృతిచెందిన ఓ సీఐ కుటుంబానికి ఆయన బ్యాచ్‌కు చెందిన సీఐలు, డీఎస్పీలు 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం చిన్నబీరవెల్లికి చెందిన వై. రమేష్‎బాబు 1996 బ్యాచ్‌లో ఎస్‌ఐగా ఎపింకయ్యారు. కుటుంబంతో హైదరాబాద్‌ ఉప్పల్‌లో స్థిరపడ్డారు. గత ఏడాదినుంచి ఆదిలాబాద్‌ జిల్లా, ఇచ్చోడ పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన కొంతకాలంగా జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్నారు. వారం రోజులక్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో ఉండగానే గుండెపోటుకు గురైన ఆయన మంగళవారం మృతిచెందారు.ఉప్పల్‌లో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాల్లో సీఐలు, డీఎస్పీలుగా పనిచేస్తున్న రమేష్‎బాబు బ్యాచ్‌కు చెందిన పోలీసు అధికారులు రూ. 25,00,116 చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందజేసి ఏ అవసరం వచ్చినా తామున్నామంటూ ధైర్యం చెప్పారు.

*సుజీవన్ వావిలాల🖋️*
ప్రజల పక్షం 

బ్యాడ్జ్ పెట్టుకో లేదా అవినీతిపరులుగానే ప్రభుత్వ అధికారులు

https://twitter.com/SrinivasRTIA/status/1570048789158973440?t=ONFA-PjMr8kfq2macdFk-w&s=08                                                                                                                                                

*తెలంగాణలో ఇంత ధైర్యం ఉన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఉంటే వెంటనే వీరి ఆదర్శంగా బ్యాడ్జ్ ధరించండి, బ్యాడ్జ్ పెట్టుకోలేదా అవినీతిపరులుగానే ప్రజలు భావించాల్సి ఉంటుంది, సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి విస్తృతంగా tag #NOBRIBE తీసుకువెళదాము 🌹😊🙏.                                                                                          G. శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్




ఓట్ల స్కాం లో పువ్వాడను అరెస్ట్ చేయాలి

https://twitter.com/RSPraveenSwaero/status/1570266537709412353?t=B-cQfuqkqIvMrlMmf06spQ&s=08                   

*పువ్వాడ అడ్రస్‌ మీద 532 ఓట్లా? మరి ఎలక్షన్ కమీషన్ నిద్రపోయిందా? ఆధిపత్య వర్గాలు అధికారం  తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ⁦@SpokespersonECI⁩ మీకు ధమ్ముంటే ఈ ఓట్ల స్కాం లో పువ్వాడను అరెస్ట్ చేయాలి*.                                                                                                                                                          *This is a scam on democracy. The accused Min must go to jail*

Wednesday, September 14, 2022

నమ్మిన సిద్ధాంతాన్ని వదలను.... చావుకు భయపడను.... MLA ఈటల....!

*నమ్మిన సిద్ధాంతాన్ని వదలను.... చావుకు భయపడను.... MLA ఈటల....!*

హైదరాబాద్: స్పీకర్‌ను ఉద్దేశించి 'మరమనిషి' అంటే సీఎం కేసీఆర్‌కు అంత కోపం ఎందుకని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు.కేసీఆర్‌ అనేక మాటలు అన్నారని.. వాటి సంగతేంటని నిలదీశారు. ఆయన తిట్లే తెలంగాణలో మాట్లాడే భాషనా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ చెప్పే ప్రతి మాటా అబద్ధమేనని ఈటల వ్యాఖ్యానించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

''బీఏసీ సమావేశానికి భాజపా ఎమ్మెల్యేలను పిలవలేదు. ఆ విషయంపై ఎమ్మెల్యే రఘునందన్‌ అడిగితే సభాపతి సమాధానం చెప్పలేదు. భాజపా సభ్యుల హక్కులను సభాపతి కాలరాశారు. ప్రజల సమస్యలపై సభలో ఎవరూ మాట్లాడకూడదా? బీఏసీలో సీఎం ఇచ్చిన అజెండానే సభలో అమలు చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం ఇవ్వాలని కోరా. ఈ ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతుల సమస్యలపై తెరాస, కాంగ్రెస్‌, ఎంఐఎం సభలో చర్చించలేదు. నిరుద్యోగ సమస్యపై సభలో ఒక్కరూ మాట్లాడలేదు. గొల్లకురుమలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అన్ని పార్టీలు, సభ్యుల హక్కులను సభాపతి కాపాడాలి. సభలో తప్పు ఎవరిదో ప్రజలందరికీ తెలుసు.

గతంలో రెక్కీ నిర్వహించి నన్ను చంపుతానని బెదిరించినప్పుడే నేను భయపడలేదు. నాకు, నా కుటుంబసభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌ వహించాల్సిందే. నాపై దాడి జరిగితే అది యావత్ తెలంగాణపై జరిగిన దాడిగా భావిస్తాం. 24 గంటలూ స్వేచ్ఛగా, ఒంటరిగా తిరగగలిగే శక్తి ఉన్నవాడిని నేను. చావుకు భయపడేది లేదు. ఎన్ని బెదిరింపులు వచ్చినా.. ఎంత ఒత్తిడి చేసినా.. నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా సాగుతున్నాను'' అని ఈటల అన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం 

Monday, September 12, 2022

సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం....ఏడుగురి సజీవ దహనం

*సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.... ఏడుగురు మృతి!*

*ఏడుగురి సజీవ దహనం*

*మరో నలుగురి పరిస్థితి* *విషమంసికింద్రాబాద్‌ రూబీ ఎలక్ట్రిక్‌ షోరూంలో ఘటనషోరూంపైన రూబీ హోటల్‌కూ* *మంటలుఆ సమయంలో లాడ్జిలో పలువురి బసదట్టమైన పొగ.....*
మంటలతో ఉక్కిరిబిక్కిరికాలిన గాయాలతో కిందకు దూకిన పలువురుగాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు8 వాహనాలతో రంగంలోకి అగ్నిమాపక శాఖప్రాణాలకు తెగించి, పలువురిని కాపాడిన సిబ్బందిసెల్లార్‌లో బ్యాటరీల చార్జింగ్‌తోనే ప్రమాదం!భవనంలో అగ్నిమాపక పరికరాల లేమి?

హైదరాబాద్‌  సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో.. ఆ ప్రాంతంలో భారీ శబ్దాలువచ్చాయి. చూస్తుండగానే దట్టమైన పొగ, మంటలు షోరూం పైన ఉన్న రూబీ హోటల్‌కు వ్యాపించాయి. హోటల్‌లో దిగిన పలువురు పొగలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే కొందరు సజీవ దహనం అయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకారు. తీవ్రగాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కడపటి వార్తలందేసరికి ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బం ది, స్థానికుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదురు రోడ్డులో.. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ ఎలక్ట్రికల్‌ షోరూం కొనసాగుతోంది. సెల్లార్‌లో ఆ షోరూం వాహనాల గోదాము ఉంది. రాత్రి 8.45 సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఈ-స్కూటర్‌ పేలిపోయింది. చూస్తుండగానే మంటలు ఇతర వాహనాలకు వ్యాపిం చి, ఒక్కొక్కటిగా పలు వాహనాలు భారీ శబ్దంతో పేలిపోయాయి. రాత్రి కడపటి వార్తలందేసరికి కూడా ఈ-స్కూటర్ల బ్యాటరీల పేలుళ్లు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో గోదాములో ఎవరూ లేకున్నా.. పై అంతస్తుల్లో ఉన్న రూబీ హోటల్‌ గదులకు మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో హోటల్‌లో 25 మంది బసచేసినట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. దట్టమైన పొగ, మంటలతో ఉక్కిరిబిక్కిరైన మరో ఐదుగురు ప్రాణభయంతో కిందకు దూకారు.

ఆలోగానే వారికి మంటలంటుకున్నాయి. ఓ మహిళ సహా.. మరో ఆరుగురు కిందకు దూకలేక.. మెట్ల వైపు పరుగులు తీశారు. ఆ ప్రయత్నంలో వారికీ మంటలు అంటుకున్నాయి. ఐదుగురిని వేర్వేరు ఆస్పత్రులకు తరలించగా, ఆ మహిళ మృతిచెందినట్లు తెలిసింది. మరో ముగ్గురికి గాంధీ ఆస్పత్రి బర్నింగ్‌ వార్డ్‌లో చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుంది. అయితే.. అప్పటికే షోరూం, గోదాము అగ్నికి ఆహుతయ్యాయి. హోటల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 54 మీటర్ల నిచ్చెన ఉండే వాహనంతోపాటు.. 5 ఫైరింజన్లు, స్మోక్‌ ఇస్టింగ్విషర్‌ వాహనాలు, రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. పైఅంతస్తుల్లోని హోటల్‌ గదుల్లో చిక్కుకుపోయిన 10 మందిని ఫైర్‌ ఆఫీసర్లు మోహన్‌రావు, ముస్తఫా, ప్రవీణ్‌ తమ బృందాలతో కలిసి ప్రాణాలకు తెగించి కాపాడారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌కుమార్‌ జైన్‌, ప్రాంతీయ అగ్నిమాక అధికారి వి.పాపయ్య, జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూధన్‌, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సంఘటనాస్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ''మొత్తం ఏడుగురు మృతిచెందారు. దట్టమైన పొగలతో ఊపిరి ఆడకే మరణాలు సంభవించాయి'' అని సీవీ ఆనంద్‌ వివరించారు.

ఒకవైపే

దారిరూబీ ఎలక్ట్రిక్‌ షోరూం, హోటల్‌ మొత్తం ఐదంతస్తుల్లో కొనసాగుతున్నాయి. అయితే.. ఆ హోటల్‌ భవనం నుంచి లోనికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే దారి ఉంది. భవనానికి సెట్‌ బ్యాక్స్‌లేవు. దీంతో.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బంది పడ్డారు. సరిపడా అగ్నిమాపక వాహనాలు వచ్చినా.. ఒకవైపు నుంచే మంటలను ఆర్పాల్సి వచ్చింది. హోటల్‌ గదుల్లో ఏసీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని ఫైర్‌ సిబ్బంది చెబుతున్నారు.

బ్యాటరీల చార్జింగ్‌ వల్లేనా?

షోరూం గోదాములో ఈ-స్కూటర్లను పార్క్‌ చేస్తారు. ఒక భాగంలో ఈ-స్కూటర్ల బ్యాటరీలను చార్జింగ్‌ చేస్తుంటారు. అక్కడే షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి.. ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

స్థానికుల చొరవ

ప్రమాదం జరిగిన దాదాపు 45 నిమిషాలకు గానీ ఫైరింజన్లు సంఘటన రాలేదని స్థానికులు చెబుతున్నారు. దాంతో సూర్య, సతీశ్‌ అనే యువకులు నిచ్చెనల సాయంతో హోటల్‌లో చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేశారు. చూస్తుండగానే.. మరికొందరు యువకులు, పోలీసులు వారికి తోడయ్యారు. తుకారంగేట్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ అంబటి ఆంజనేయులు కూడా ప్రాణాలకు తెగించి, రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అలా కొందరిని కిందకు తీసుకొచ్చామని, ప్రాణనష్టం తగ్గిందని మార్కెట్‌ పోలీసులు 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. అంబటి ఆంజనేయులును హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ప్రత్యేకంగా అభినందించారు.

మంటలార్పేందుకు ప్రయత్నించినా..

షోరూం గోదాములో మంటలంటుకోగానే.. స్థానికులు షోరూంలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాంతో వారు షోరూంలో అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే.. కాసేపటికే వారి పరికరాల్లో మంటలను ఆర్పే వాయువు అయిపోవడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. చూస్తుండగానే బ్యాటరీలు పేలిపోతూ.. మంటలు వేగంగా వ్యాప్తిచెందాయి.

ఏసీ గదులతో మంటల వ్యాప్తి

లాడ్జిలోని గదుల్లో దిగిన వారు ఏసీలు వేసుకోవడం కూడా మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమై ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. నాలుగంతస్తుల హోటల్‌ల్లో మొత్తం 23 గదులు ఉన్నాయని, రాత్రి 12 గంటలకల్లా.. అన్ని గదులను పరిశీలించామని పేర్కొన్నారు. ఐదు మృతదేహాలను వెలికి తీశామని, పలువురు కిందికి దూకగా.. పైన చిక్కుకున్న 10 మందిని కాపాడామని పేర్కొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️
ప్రజల పక్షం