తమిళనాడులో స్కూలు పిల్లలకు ఉచితంగా టిఫిన్ - సిఎం స్టాలిన్
తమిళనాడులో ప్రభుత్వ ప్రాధమిక స్కూళ్ల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని సిఎం ఎంకె స్టాలిన్ గురువారం ప్రారంభించారు.ఈ పథకం పరిధిలో 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు టిఫిన్లు అందుతాయి.మధురైలో పథకం ఆరంభించిన స్టాలిన్ అక్కడి చిన్నారులకు ఆహారం అందించడమే కాకుండా వారితో కలిసి కూర్చుని తాను కూడా ఆరగించారు. పేదల జీవనస్థితిగతులలో మార్పు దిశగా ఈ పథకం దోహదం చేస్తుందని పిల్లల్లో అధ్యయన శక్తి పెరిగేందుకు,పిల్లలను క్రమం తప్పకుండా బడులకు రప్పించేందుకు ఈ స్కీం దోహదపడుతుందని చరిత్రలో దీనికి ప్రత్యేకత ఉంటుందని తెలిపారు.పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ స్కీంలు అమెరికా, యూరప్‌లలో ఉన్నాయని, అక్కడ విద్యార్థులలో వికాసానికి ఈ తోడ్పాటు ఎంతగానో ఉపకరించినట్లు వెల్లడైందని,దీనిని పరిగణనలోకి తీసుకున్నామని స్టాలిన్ తెలిపారు. స్కీం తొలిదశలో రాష్ట్రంలోని 1545 స్కూళ్లలో అమలు అవుతుంది.రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి నేపథ్యంలో మధురైలో దీనిని ఆరంభించారు.ఈ అల్పాహార పథకంలో భాగంగా విద్యార్థులకు వడ్డించే వాటిలో సాంబార్‌తో సేమియా ఉప్మా, రవ్వ ఉప్మా, సేమియా కిచిడి, రవ్వ పొంగలి వుంటుంది..
Courtesy by link Media
No comments:
Post a Comment