Wednesday, June 1, 2022

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై!

*తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై!*

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.ఆరు దశాబ్దాలకు పైగా సాగిన అవిశ్రాంత పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం యువత చేసిన త్యాగాలతో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఉత్సాహంతో, గర్వంతో చేసుకునే వేడుక అన్నారు. రాష్ట్ర అస్థిత్వ పరిరక్షణ, వనరులు, అవకాశాల్లో న్యాయమైన వాటాను విధాన నిర్ణేతలు, నాయకులు, కష్టపడి పనిచేసే ప్రజలు గుర్తించారని అనుకుంటున్నట్టు తెలిపారు.

రాష్ట్ర సాధన తర్వాత ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి, పురోగతి దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తోందని చెప్పారు. అలుపెరుగని స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి కొనసాగుతూ ఓ శక్తిగా ఎదుగుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి ఈ సందర్భంగా గవర్నర్‌ నివాళులర్పించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

మూడు రోజుల పాటు హైదరాబాద్ లో మోడీ.. అమిత్ షా!!

*మూడు రోజుల పాటు హైదరాబాద్ లో..... ఉండనున్న  మోడీ....అమిత్ షా*

న్యూఢిల్లీ, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. జులై 3 వ వారంలో 15వ తేదీ తర్వాత ఈ సమావేశాలు ఉండవచ్చని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా కూడా పాల్గొంటారు. మూడు రోజుల పాటు మోదీ, షా హైదరాబాద్‌లోనే మకాం వేస్తారని తెలిసింది. 300 నుంచి 500 మంది వరకూ బీజేపీ సీనియర్ నేతలు ఈ సమావేశాలకు హాజరౌతారని భావిస్తున్నారు. హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌లో ఈ సమావేశాలు జరగవచ్చని భావిస్తున్నారు. తాజ్‌కృష్ణాను కూడా బీజేపీ నాయకులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బీజేపీ నేతలు తరుణ్‌చుగ్, బీఎల్ సంతోష్ సమావేశాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని తెలిసింది.

link Media ప్రజల పక్షం🖋️

Monday, May 30, 2022

పాలనలో కేంద్ర సర్కార్ విఫలం.....MLC కవిత.....!మోదీకి 8 ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్సీ కవిత

*పాలనలో కేంద్ర సర్కార్ విఫలం..... MLC కవిత.....!*

*మోదీకి 8 ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్సీ కవిత*

*హైదరాబాద్‌,....!*
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనలో విఫలం అయిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.ఈ మేరకు బీజేపీ పాలనా వైఫల్యాలపై సోమవారం ప్రధాని మోదీకి ట్విటర్‌ వేదికగా 8 ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. ''తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ పక్షపాతానికి ముగింపు ఎప్పుడు? రాష్ట్రానికి రావాల్సిన రూ.7000 కోట్ల పెండింగ్‌ నిధులను కేంద్రం ఎప్పుడు విడుదల చేస్తుంది?

''మెహంగై ముక్త్‌ భారత్‌'' అని ప్రకటించుకున్న మీరు అసలు అలాంటి ''అచ్ఛే దిన్‌'' ఎప్పుడు తెస్తారు? విఫలమైన లా అండ్‌ ఆర్డర్‌, విఫలమైన వ్యవస్థలు.. భారతదేశ ప్రజలకు కృత్రిమ ప్రచారాలు లేని నిజమైన ''అమృత్‌ కాల్‌'' ఎప్పుడు వస్తుంది? దేశ జీడీపీ పడిపోతున్నా..

గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయి. విచిత్రంగా అవి దేశ ప్రభుత్వ నియంత్రణలో ఎందుకు లేవు? పీఎం కేర్స్‌ నిధుల గురించిన నిజమైన సమాచారాన్ని దేశ ప్రజలకు తెలియజేసే రోజు వస్తుందా? మహిళా సాధికారత, వారి శక్తికి సమాన ప్రాధాన్యం కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఎప్పుడు అమలులోకి తెస్తారు? తెలంగాణలోని వరి, పసుపు రైతులు తమ కష్టానికి కనీస గుర్తింపు కోరినందుకు బీజేపీ చేతిలో నష్టపోతున్నారు. వారికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది?'' అంటూ కవిత ప్రశ్నలు సంధించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

డాక్టర్....... K. లక్ష్మణ్ కు..... రాజ్యసభ!

*డాక్టర్....... K. లక్ష్మణ్ కు..... రాజ్యసభ!*

*హైదరాబాద్.....*
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు లభించింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆయనకు ప్రాతినిధ్యం కల్పిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.సోమవారం రాత్రి విడుదల చేసిన నలుగురు రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరుంది. సుమిత్ర వాల్మికి మధ్యప్రదేశ్‌ నుంచి, లహర్‌సింగ్‌ సిరోయ కర్ణాటక నుంచి, మిథిలేశ్‌ కుమార్‌ ఉత్తరప్రదేశ్‌ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం నామినేషన్‌ వేసేందుకు లక్ష్మణ్‌ లఖ్‌నవూకు వెళుతున్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతల్లో ఒకరికి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం ఇస్తుందని మొదటి నుంచీ అనుకుంటున్నారు.

లక్ష్మణ్‌తో పాటుగా తెలంగాణకు చెందిన మాజీ ఎంపీలు విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డిల పేర్లను అధిష్ఠానం పరిశీలించింది. చివరికి ఓబీసీ నేత లక్ష్మణ్‌కే మొగ్గు చూపించింది. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు. లక్ష్మణ్‌ 1999లో, 2014లో ముషీరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016 నుంచి 2020 దాకా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా పని చేశారు.

link Media ప్రజల పక్షం🖋️

Sunday, May 29, 2022

నాపై జరిగిన దాడి వెనుక..... రేవంత్ రెడ్డి కుట్ర.....!

*నాపై జరిగిన దాడి వెనుక..... రేవంత్ రెడ్డి కుట్ర.....!*

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో నిర్వహించిన రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే!తొలుత ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు వ్యతిరేక నినాదాలతో గందరగోళం సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉందని, సీఎం కేసీఆర్ అనేక పథకాల్ని అమలు చేస్తున్నారని మల్లారెడ్డి ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో సభికుల నుంచి ఒక్కసారిగా వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. దీంతో ఆయన తన ప్రసంగం ముగించుకొని కాన్వాయ్‌లో వెళుతుండగా.. నిరసనకారులు కుర్చీలు, చెప్పులు, రాళ్ళతో దాడి చేశారు. వారిని అదుపు చేస్తూ.. మంత్రి వాహనాల్ని పోలీసులు ఎలాగోలా సురక్షితంగా బయటకు పంపించారు.

ఈ దాడి విషయమై ప్రముఖ మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి.. ఇదంతా రేవంత్ రెడ్డి కుట్రేనని ఆరోపించారు. ఆయన ప్రజావ్యతిరేక చర్యల్ని ప్రశ్నిస్తున్నాననే అక్కసుతోనే తన అనుచరుల్ని సభకు పంపించి, రేవంత్ దాడి చేయించాడని అన్నారు. ఇలాంటి చర్యలకు తాను భయపడే ప్రసక్తే లేదని, దేనికైనా సిద్ధమేనని మల్లారెడ్డి చెప్పారు. అన్ని సామాజిక వర్గాల్ని న్యాయం చేసేందుకు కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారని, మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్టు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, కరోనా కారణంగా ఆలస్యమైందని తాను వివరిస్తున్న తరుణంలోనే నినాదాలు చేశారంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Saturday, May 28, 2022

Job fair in Hyderabad: Over 20 companies to recruit 3K candidates on May 30

Job fair in Hyderabad: Over 20 companies to recruit 3K candidates on May 30

Both freshers and experienced candidates are invited

మంచి డిజైన్ చెప్పండి ప్రైజ్ మనీ పొందండి.. సజ్జనార్

మంచి డిజైన్ చెప్పండి ప్రైజ్ మనీ పొందండి.. సజ్జనార్

Courtesy by Disha Web  28 May 2022 6:45 PM దిశ,వెబ్‌డెస్క్: ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పనుండి ప్రయాణికులకు ఆఫర్స్ ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆర్టీసీని లాభాల బాటల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాణీకుల కోసం 500 ml, 1 లీటర్ వాటర్ బాటిళ్లను ఆర్టీసీ అమ్మకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. అయితే ఆ వాటర్ బాటిళ్ల డిజైన్, నేమ్ సూచించాలని సజ్జనార్ ప్రయాణిలను కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. Also Read - ఈమెను కలెక్టర్ అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ, అసలు విషయం తెలిస్తే గొప్పగా ఫీలవుతారు యాణీకుల కోసం 500 ml & 1 లీటర్ వాటర్ బాటిళ్లను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం. సీసాల కోసం టైటిల్, డిజైన్‌ను సూచించడానికి మీకు స్వాగతం. ఉత్తమ సూచనకు బహుమతి లభిస్తుంది. మీ సూచనను WhatsApp 9440970000 నంబర్‌కు మాకు పంపండి. టీఎస్‌ ఆర్టీసీ చేసే చరిత్రాత్మక మార్పునకు మీ తోడ్పాటు ఇవ్వండి. చరిత్రలో నిలిచిపోండి. వాటర్ బాటిల్‌కు మంచి పేరు డిజైన్ చెప్పండి.. రివార్డ్స్ పొందండి అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.