Tuesday, May 24, 2022
మంత్రి పువ్వాడ కు సామాజిక కార్యకర్త కోయిని వెంకన్న భహిరంగ లేఖ
Monday, May 23, 2022
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ.... తహసిల్దార్!
*లంచం తీసుకుంటూ పట్టుబడ్డ.... తహసిల్దార్!*
పెద్దపల్లి : భూమి సర్వే కోసం ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటూ జిల్లాలోని అంతర్గాం తహసీల్దార్ సంపత్, ఆర్‌ఐ అజీం, ప్రైవేట్ ఉద్యోగి లింగస్వామి రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.అంతర్గాం మండలంలోని అకినపల్లి గ్రామానికి చెందిన రైతు పెద్దంపేట్ శంకర్ తన భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
కాగా, భూమి సర్వే చేయాలంటే మూడు లక్షల వరకు అవుతుందని ఆర్‌ఐ అజీమ్ శంకర్‌కు చెప్పగా.. లక్ష రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు లక్ష రూపాయలను మధ్యవర్తికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తాసిల్దార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.
link Media ప్రజల పక్షం🖋️
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన....10ఏళ్ల చిన్నారి....!
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన....10ఏళ్ల చిన్నారి....!*
ముంబైకి చెందిన రిథమ్ మమానియా అనే 10 ఏళ్ల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.ఈ నెల ప్రారంభంలో ఉత్కంఠభరితమైన ఫీట్ సాధించిన భారతీయ పర్వతారోహకులలో ఒకరిగా ఆ బాలిక నిలిచింది. ఆమె సబర్బన్ బాంద్రాలోని ఎంఈటీ రిషికుల్ విద్యాలయంలో ఐదవ తరగతి చదువుతోంది. రిథమ్ మే 6న సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న నేపాల్‌లోని సౌత్ బేస్ క్యాంప్‌కు చేరుకుంది.
11 రోజుల పాటు సాగిన యాత్ర బేస్‌క్యాంప్‌కు చేరుకోవడంతో విజయవంతంగా పూర్తయింది. అత్యంత కష్టతరమైన దుర్భేద్యమైన పర్వతమే కాకుండా కఠినతరమైన వాతవరణ పరిస్థితులు తట్టుకుని అధిరోహించే సాహసయాత్ర అయినప్పటికీ ఇవేమి ఆమె లక్ష్యాన్ని నిలువరించలేకపోయాయి. ఐతే రిథమ్ బేస్‌క్యాంప్‌కి చేరుకున్న తర్వాత ఆమెతోపాటు పాల్గొన్న ఇతర సభ్యలు విమానంలో తిరిగి వెళ్లేలని నిర్ణయించుకుంటే ఆమె మాత్రం నడచే వెళ్తానని పట్టుబట్టడం విశేషం.
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ... "తొలిసారిగా కాలినడకన దూద్ సాగర్ ట్రెక్కింగ్‌ని విజయవంతం పూర్తి చేశాను. తదనంతరం సహ్యాద్రి పర్వత శ్రేణులలో కర్నాలా, లోహగడ్, మహులి కోటలతో సహా కొన్ని శిఖరాలను అధిరోహించాను. అంతేకాదు ఈ ట్రెక్కింగ్ బాధ్యయుతమైన ట్రెక్కర్‌గా పర్వత వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడం ఎంత ముఖ్యమో నేర్పింది" అంటూ చెప్పుకొచ్చింది.
link Media ప్రజల పక్షం🖋️
Saturday, May 21, 2022
Friday, May 20, 2022
To stand tall &to serve selflessly- ‘Parma Shri’Daripalli Ramaiah
నేటి నుంచి కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం....!
*నేటి నుంచి కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం....!*
ఇవాళ్టి నుండి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం ప్రారంభం కానుంది. రైతు డిక్లరేషన్ పై పల్లె పల్లెకు కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలోనే.. నేడు ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో రచ్చబండలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
link Media ప్రజల పక్షం🖋️