Wednesday, March 23, 2022

ఫోన్ చార్జింగ్ 100 శాతం ఉండటం మంచిది కాదా…?

ఫోన్ చార్జింగ్ 100 శాతం ఉండటం మంచిది కాదా…?

Courtesy by : తొలివెలుగు మీడియా website

స్మార్ట్ ఫోన్ వాడకం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాం. చార్జింగ్ అయిపోతుందనే భయం మనను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. సోషల్ మీడియా సహా యూట్యూబ్ వీడియోలు అలాగే సినిమాలు చూడటానికి వాడే యాప్స్ తో ఫోన్ చార్జింగ్ ఆగడం లేదు. అయితే ఫోన్ కి ఎప్పుడూ వంద శాతం చార్జింగ్ ఉండాలి అనుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది.

ఫోన్ లో 80 శాతం చార్జింగ్ ఉన్నా సరే వంద శాతం ఉండాలని పిన్ పెట్టేస్తూ ఉంటారు. సరే అసలు ఫోన్ కి వంద శాతం చార్జింగ్ పెట్టడం ఎంత వరకు మంచిది…?మొబైల్ ఫోన్ కి పూర్తిగా చార్జింగ్ పెట్టడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. 95 శాతం దాటాక ఆపడం ఫోన్ కి చాలా మంచిది. దానికి కారణం వేరే ఉంది. ఫోన్ పూర్తిగా చార్జింగ్ చేస్తే ఎక్కువగా హీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఎక్కువగా హీట్ అవ్వడంతో దీనివల్ల బ్యాటరీ తొందరగా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మొబైల్ ఫోన్ ను 95 శాతం కంటే ఎక్కువ చార్జింగ్ పెట్టడం మంచిది కాదు. అలాగే 20 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉన్నప్పుడు వెంటనే పెట్టడం కూడా మంచిది.20 కంటే ఎక్కువ 95 కంటే తక్కువ చార్జింగ్ మొబైల్ ఫోన్ ఉంటే బ్యాటరీకి లైఫ్ ఎక్కువగా ఉంటుంది.

అలా చేస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతాం

అలా చేస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతాం

Courtesy by : తొలివెలుగు మీడియా website

మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయడంపై బీజేపీని ఢిల్లీ ముఖ్య మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తీవ్రంగా విమర్శించారు.

aravind kejriwal

మున్సిపల్ ఎన్నికలను సమయానికి నిర్వహించి అందులో గెలిచి చూపించాలని బీజేపీకి ఆయన సవాల్ విసిరారు. అలా చేస్తే రాజకీయాల నుంచి తమ పార్టీ తప్పుకుంటుందని అన్నారు.
ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనానికి సంబంధించిన బిల్లుకు కేంద్రం మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలను బీజేపీ సమయానికి నిర్వహించి, అందులో బీజేపీ గెలిచి సత్తా చూపిస్తే రాజకీయాల నుంచి మా పార్టీ తప్పుకుంటుంది’ అని ప్రకటించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ తనకు తాను గొప్పలు చెప్పుకుంటోందని, కానీ ఇప్పుడు ఒక చిన్న పార్టీకి బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు.

ఎన్నికలను వాయిదావేయడం అంటే బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టి దేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి త్యాగం చేసిన అమరవీరులను అవమానించడమే’ అని ట్వీట్ చేశారు

షర్మిల పాదయాత్రలో తేనెటీగలు.. పరుగో పరుగు..!

షర్మిల పాదయాత్రలో తేనెటీగలు.. పరుగో పరుగు..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

స్థానికులతో షర్మిల మాట్లాడుతుండగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో కార్యకర్తలు పరుగులు తీశారు. షర్మిలను అనుచరులు అక్కడి నుంచి తీసుకెళ్లారు. తర్వాత ఆమె యాత్రను కొనసాగించారు.

షర్మిల చుట్టూ ఉన్నవారు తేనేటీగలను కండువాలతో తరిమారు. వారి అప్రమత్తతతో ఆమె వాటి నుంచి తప్పించుకున్నారు. అయితే.. తేనెటీగల దాడిలో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలు అయ్యాయి.

ష‌ర్మిల ప్రజా ప్రస్థానం పాద‌యాత్ర 400 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఆలేరు నియోజ‌క‌వ‌ర్గం మోట‌కొండూరు మండ‌లం చండేప‌ల్లి గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు షర్మిల.


Tuesday, March 22, 2022

ఏసీబీ కీ చిక్కిన ట్రాన్స్ కో డీఈ!

*ఏసీబీ కీ చిక్కిన ట్రాన్స్ కో డీఈ!*
నల్లగొండ : రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్‌కో డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడలోని విద్యుత్ డీఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో డీఈ మురళీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం .. లైన్‌మెన్‌గా పనిచేస్తున్న గుంటూరు శ్రీనివాస్ తన సెలవుల క్రమబద్ధీకరణ చేయాలని డీఈ మురళీధర్ రెడ్డిని కోరారు.

అందుకు గాను డీఈ రూ.2.50 లక్షలు డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పినా డీఈ ససేమిరా అన్నారు. విసిగిపోయిన లైన్ మెన్ శ్రీనివాస్ నల్లగొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు మంగళవారం రూ.2 లక్షలు తీసుకుంటుండగా డీఈ మురళీధర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అదేవిధంగా డీఈ మురళీధర్‌కు చెందిన హైదరాబాద్‌లో ఒక ఇల్లు, నల్లగొండలో రెండు ఇండ్లపై దాడులు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో 40 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*link Media ప్రజల పక్షం🖋️*   prajasankalpam1.blogspot.com

Monday, March 21, 2022

విచ్చలవిడిగా కబ్జాలు.. పట్టించుకునేది ఎవరు..?

విచ్చలవిడిగా కబ్జాలు.. పట్టించుకునేది ఎవరు..?

Courtesy by : తొలివెలుగు మీడియా website

నారగోని ప్రవీణ్‌ కుమార్‌, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సాయి ప్రియ నగర్ పరిధిలోని రోడ్ నెంబర్ 6లో 1,200 గజాల పార్క్ స్థలం కబ్జాకు గురైంది. దాని విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుంది. కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినా అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా ఇళ్ల మధ్య కంపెనీ ఏర్పాటు చేశారు. దానికి పర్మిషన్‌ ఇచ్చిన అధికారి ఎవరో తెలియాలి.

రోడ్ నెంబర్ 3లో 1,200 గజాల పార్క్ స్థలంలో మున్సిపల్ కార్పొరేషన్ బోర్డు లేదు. కనీసం ఫెన్సింగ్‌ వేయలేదు. దాన్ని కూడా మింగేసేందుకు భూ బకాసురులు సిద్ధంగా ఉన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. గతంలో రోడ్ నెంబర్ 2లో 2,400 గజాల పార్క్ స్థలం కబ్జా అయితే.. దానిపై ఫిర్యాదు చేయగా ఇంతకుముందున్న కమిషనర్ ఇచ్చిన పర్మిషన్ ను రద్దు చేశారు.అయితే.. ఆ పార్క్ కు బదులు మరోచోట 1,200 గజాల స్థలాలు కబ్జాదారుడికి అధికారులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.10 కోట్ల విలువైన పార్క్ లను కాపాడాల్సిన అధికారులే కాసులకు కక్కుర్తిపడితే పట్టించుకునేది ఎవరు. ఇందులో సాయి ప్రియ నగర్ అసోసియేషన్ పాత్రపై అనుమానాలు ఉన్నాయి.ప్రభుత్వం పార్క్‌ స్థలం లేని కారణంగా ఎల్‌ఆర్‌ఎస్‌ లో అదనంగా ప్రతి ప్లాట్ ఓనర్ దగ్గర చార్జీ వసూలు చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలు బాధితులను పీడించేలా ఉంటాయి కానీ.. కబ్జాదారుడిపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఉండవు. ఎందుకంటే ఎక్కువ భూములు కబ్జా చేసే బ్యాచ్ లో రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఉంటున్నారు.

సాలార్ జoగ్ సర్వే నెంబర్ 1లో 6 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా అయింది. మేడిపల్లి సేజ్ స్కూల్ వెనుక 3 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా పెట్టారు. పీర్జాదిగూడలో కబ్జాలపై ఏ ఒక్కరూ మాట్లాడరు. పట్టించుకోవాల్సిన కలెక్టర్‌ కు తీరిక ఉండదు. అధికారులందరిపై ఏసీబీ రైడ్ చేస్తే పాపాల పుట్టలు కదులుతాయి.



Citizens angry as GHMC delays granting birth-death certificates

Citizens angry as GHMC delays granting birth-death certificates

Saturday, March 19, 2022

మంత్రులతో కేసీఆర్‌ భేటీ.. ఐటీ రెయిడ్స్ ఎఫెక్టేనా..?

మంత్రులతో కేసీఆర్‌ భేటీ.. ఐటీ రెయిడ్స్ ఎఫెక్టేనా..?

Courtesy by : తొలివెలుగు మీడియా website

తెలంగాణపై బీజేపీ ఆపరేషన్‌ ప్రారంభమైందని రెండు రోజులుగా రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ. హైదరాబాద్‌ తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో ఈ విషయాన్ని చెబుతున్నారు విశ్లేషకులు. ఐటీ రెయిడ్స్ జరిగిన కేఎన్‌ఆర్ కన్‌ స్ట్రక్షన్స్ అనే సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులకు పని చేస్తోంది. కాళేశ్వరం కింద దాదాపుగా రూ.10వేల కోట్ల వరకు ఈ కంపెనీ పలు ప్యాకేజీల పనులు నిర్వహిస్తోంది.

సాధారణంగా తాము టార్గెట్ చేసిన పార్టీ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం బీజేపీకి అలవాటే అనే అభిప్రాయం ఉంది. కేంద్ర సంస్థల ద్వారా దాడులు చేయించి కోలుకోలేని దెబ్బ కొడుతుందనే విమర్శలు ఉన్నాయి. కేఎన్‌ఆర్ సంస్థ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. టీఆర్‌ఎస్‌ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఐటీ దాడులు జరగడంతో.. టీఆర్‌ఎస్‌ పై బీజేపీ ఫోకస్‌ చేసిందనే వార్తలు వస్తున్నాయి.

అటు ఐటీ దాడులపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుండగా… సీఎం కేసీఆర్‌ మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఎర్రవల్లి ఫాంహౌస్ కు రావాలంటూ మంత్రులకు ఫోన్స్‌ వెళ్లడంతో ముగ్గురు మినహా మిగిలినవారంతా వెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కూడా చేరుకున్నారు. దీంతో ఈ అత్యవసర సమావేశంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

ఇంత అర్జెంట్‌ గా మంత్రులను కేసీఆర్‌ కలవడానికి గల కారణం ఏంటని దానిపై చర్చిస్తూ.. అనేక అనుమానాలు తెరపైకి తెస్తున్నారు విశ్లేషకులు. కేంద్రంపై యుద్ధం.. జాతీయ రాజకీయాలు అని తిరుగుతున్న కేసీఆర్‌.. మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన చేశారని అంటున్నారు. అదీగాక ఐటీ దాడులు జరగడంతో కేంద్రం తమపై సైలెంట్‌ యుద్ధం మొదలు పెట్టిందా? అనే అనుమానంతో కేసీఆర్‌ మంత్రులతో భేటీ అయ్యారా? అనే సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.