Monday, February 14, 2022

ఆగేదే, లే! ముందుకెళ్ళాల్సిందే.... మంత్రి కేటీఆర్ ఆదేశం.....!

*ఆగేదే, లే! ముందుకెళ్ళాల్సిందే.... మంత్రి కేటీఆర్ ఆదేశం.....!*

హైదరాబాద్‌: నగరంలో వాన సమస్యలకు ప్రధాన కారణమైన నాలా పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వానొలొచ్చినప్పుడు ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించేందుకు వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్‌ఎన్‌డీపీ) కింద పనులు చేసేందుకు రూ.858 కోట్లు మంజూరు చేసింది.
వివిధ కారణాలతో ఇటీవలి కాలం వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. వర్షాకాలంలోగా ఆ పనుల్ని పూర్తి చేయాల్సి ఉంది. అంటే నాలుగు నెలల్లోగా పనులు జరగాలి. అన్నీ అసాధ్యం కావడంతో అత్యంత సమస్యాత్మక, కీలక ప్రాంతాల్లోని పనులు ప్రాధాన్యతతో చేపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనులకు టెండర్లు ఖరారయ్యాక అంగీకార పత్రం (ఎల్‌ఓఏ) కోసం కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌కు (సీఓటీ) పంపించాల్సి ఉంటుందని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు.

అక్కడి నుంచి ఎల్‌ఓఏ వచ్చాకే కాంట్రాక్టర్లు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ తతంగమంతా జరగడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనుండటం, వర్షాకాలానికి ఇక ఎంతో సమయం లేకపోవడంతో, ఎల్‌ఓఏలు వచ్చేంతదాకా ఆగకుండా టెండర్లు ఖరారైన కాంట్రాక్టర్లతో పనులు చేయించాలని అధికారులకు మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ సూచించారు. నాలా పనుల పురోగతిపై తరచూ సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి దృష్టికి ఈ అంశం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌ఓఏ రాకముందే డీమ్డ్‌ అప్రూవల్‌గా భావించి పనులు చేయించాల్సిందిగా అధికారులకు సూచించినట్లు తెలిసింది. వేసవి కాలంలోగా వీలైనన్ని పనుల్ని పూర్తిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.దీంతోపాటు పనుల్ని త్వరితంగా చేసేందుకు టెండర్ల సమయాన్ని సైతం రెండు వారాల బదులు ఒకవారం గడువుతో పిలవాలని సూచించినట్లు సమాచారం. ఇంజినీరింగ్‌ నిబంధనల మేరకు అత్యవసర పనులకు వారం రోజుల వ్యవధితో స్వల్పకాలిక టెండర్లు పిలవవచ్చు. నాలా పనులు సైతం అత్యవసరమైనవే అయినందున వారం గడువుతో స్వల్పకాలిక టెండర్లు పిలవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఎస్‌ఎన్‌డీపీ ద్వారా చేపట్టేందుకు 55 ప్యాకేజీలుగా పనుల్ని ఖరారు చేయగా, వాటిల్లో 27 ప్యాకేజీల అంచనా వ్యయం రూ.10 కోట్లకు పైగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

HYD : ఫ్లైట్‌లో వచ్చి.. సైకిల్‌పై రెక్కీ.. ఇళ్లను గుల్ల చేసి రైల్లో పరారీ

HYD : ఫ్లైట్‌లో వచ్చి.. సైకిల్‌పై రెక్కీ.. ఇళ్లను గుల్ల చేసి రైల్లో పరారీ


Courtesy by : ABN ఆంధ్రజ్యోతి మీడియా ట్విట్టర్ 

  • 14 నేరాలు చేసిన పశ్చిమబెంగాల్‌ ముఠా
  • ఇద్దరు దొంగల అరెస్టు
  • 27.16లక్షల సొత్తు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ : ఫ్లైట్లో నగరానికి వచ్చి సైకిల్‌పై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను రెక్కీ చేస్తారు. ఆ తర్వాత ఇంటిని గుల్ల చేసి రైల్లో పారిపోతారు. ఇలా రాచకొండ, సైబరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో ఇళ్లను దోచేస్తున్న పశ్చిమ బెంగాల్‌ దొంగల ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఇద్దరు దొంగలను, ఒక రిసీవర్‌ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి సైకిల్‌, 520గ్రా. బంగారం, 500గ్రా. వెండి, రూ.91వేలు నగదు సహా మొత్తం రూ.27.16లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనర్‌ సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన రిటైర్డ్‌ వీఆర్వో లక్ష్మీనర్సింహారావు గతేడాది డిసెంబర్‌ 18న కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్లి వచ్చే సరికి దుండగులు ఇంటిని దోచేశారు. ఇంటి వెనకాల ఉన్న డోర్‌ తాళం, అల్మారా, బీరువా తాళాలు పగులగొట్టి 30 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితుడి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


సైకిల్‌పై రెక్కి.. 

సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు కాలనీల్లో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వారు హయత్‌నగర్‌లోని సాహెబ్‌నగర్‌లో రూమ్‌ను అద్దెకు తీసుకున్నట్లు తేల్చారు. దొరికిన టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను బట్టి వాళ్లే ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానించారు. అదే దొంగల ముఠా సూర్యాపేటలో సైతం చోరీలకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టారు. ఈనెల 4న మళ్లీ చోరీ చేసేందుకు వచ్చిన దొంగలను పోలీ సులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం ముషీరాబాద్‌ జిల్లా కోల్‌కతాకు చెందిన రఫికుల్‌ ఖాన్‌, షేక్‌ సూరజ్‌లుగా గుర్తించి రిమాండుకు తరలించారు.

తెలంగాణలో 14 కేసులు 

దోచుకున్న సొత్తును నిందితులు ముషీరాబాద్‌ జిల్లాకు చెందిన అనిల్‌ సీతారాం బండగర్‌, నోబిన్‌, అనే రిసీవర్స్‌కు అమ్మేస్తారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ చోరీల కోసం బయలుదేరుతారని పోలీసుల విచారణలో తేలింది. ఇలా వారిపై కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులున్నాయి. తెలంగాణాలో ఇప్పటి వరకు 14 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. రాచకొండలో 11, సైబరాబాద్‌ లో-1, సూర్యాపేటలో 2 కేసులున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీస్‌ బృందాలను సీపీ అభినందించి రివార్డులు అందజేశారు. 

టార్గెట్ ఢిల్లీ....జాతీయ రాజకీయలే లక్షంగా కేసీఆర్ కార్యాచరణ.....కాంగ్రెసేతర ప్రతిపక్షం

*టార్గెట్ ఢిల్లీ....జాతీయ రాజకీయలే లక్షంగా కేసీఆర్ కార్యాచరణ.....!*

*కాంగ్రెసేతర ప్రతిపక్షం ఏర్పాటులో క్రియాశీల పాత్రపై దృష్టి*

*బీజేపీయేతర సీఎంలు, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు*

*త్వరలో హస్తినలో సమావేశం కానున్న నాయకులు*

*మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై నివేదికలు విడుదల చేసే అవకాశం*

హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తున్నారు.రాష్ట్ర సమస్యలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ సీఎం కేసీఆర్‌ గత కొన్నా ళ్లుగా నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీని బంగాళాఖాతంలో కలపాలని, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిస్తున్న ముఖ్యమంత్రి ఆ దిశగా కార్యాచరణ కూడా ప్రారంభించారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులు, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతూ జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రతిపక్షాన్ని బలంగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషించేలా అడుగులు ముందుకు వేస్తున్నారు.

త్వరలో ముంబయికి వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేతో భేటీ కానున్నట్టు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో హైదరాబాద్‌కు వస్తారని ప్రకటించారు. గతంలో మమతా బెనర్జీతో పాటు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులతో భేటీ అయిన కేసీఆర్‌.. ఇటీవలి కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, ఎ.రాజాతో, అలాగే ఆర్‌జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్‌తోనూ సమావేశమైన విషయం తెలిసిందే.

త్వరలో ఢిల్లీలో బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించగా, ఇటీవల తాను తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడిన విషయాన్ని మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరిగే బీజేపీయేతర సీఎంల సమావేశం ఎజెండా అంశాలను రూపొందించే పనిలో కేసీఆర్‌ ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి.

మరోవైపు బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై ఈ భేటీలో పలు నివేదికలు విడుదల చేసేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షతో పాటు నిరుద్యోగం, విద్యుత్‌ సంస్కరణలు, పారిశ్రామిక వృద్ధి తిరోగమనం, రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి వంటి అంశాలు ఈ నివేదికల్లో పొందుపరిచే అవకాశముందని తెలుస్తోంది.

*వైఫల్యాలు, అవినీతి ఆరోపణలపై అధ్యయనం*
ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై జాతీయ స్థాయిలో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కేసీఆర్‌ నిరంతరం సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుమారు ఏడాదికాలంగా ఆయన జాతీయ అంశాలు, రాజకీయాలపై ఈ తరహా కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ అనుసరిస్తున్న విదేశాంగ, ఆర్థిక, అభివృద్ధి, సంక్షేమ విధానాలు, వాటి వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని కేసీఆర్‌ అధ్యయనం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ రాష్ట్రాల హక్కులు హరించి వేస్తుందనే విమర్శలను సాక్ష్యాధారాలతో వివరించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో విడుదల చేసిన నివేదికలపై దృష్టి పెట్టారు.

ఇటీవలి కాలంలో రాష్ట్రాల పాలన వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకుంటున్న తీరు తదితరాలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అందుతున్న వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ అధ్యయనంలో తేలిన అంశాల మేరకే ఇటీవలి జనగామ, భువనగిరి బహిరంగ సభలతో పాటు రెండురోజుల క్రితం మీడియా సమావేశంలో కేసీఆర్‌ పలు వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై జాతీయ స్థాయిలో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కేసీఆర్‌ నిరంతరం సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుమారు ఏడాదికాలంగా ఆయన జాతీయ అంశాలు, రాజకీయాలపై ఈ తరహా కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ అనుసరిస్తున్న విదేశాంగ, ఆర్థిక, అభివృద్ధి, సంక్షేమ విధానాలు, వాటి వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని కేసీఆర్‌ అధ్యయనం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ రాష్ట్రాల హక్కులు హరించి వేస్తుందనే విమర్శలను సాక్ష్యాధారాలతో వివరించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో విడుదల చేసిన నివేదికలపై దృష్టి పెట్టారు.

ఇటీవలి కాలంలో రాష్ట్రాల పాలన వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకుంటున్న తీరు తదితరాలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అందుతున్న వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ అధ్యయనంలో తేలిన అంశాల మేరకే ఇటీవలి జనగామ, భువనగిరి బహిరంగ సభలతో పాటు రెండురోజుల క్రితం మీడియా సమావేశంలో కేసీఆర్‌ పలు వ్యాఖ్యలు చేశారని పా
ర్టీ వర్గాలు వివరిస్తున్నాయి.

*కాంగ్రెసేతర కూటమి లేదా ప్రత్యేక పార్టీ..*

దశాబ్దాలుగా సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడంలో కాంగ్రెస్, బీజేపీది ఒకే తరహా విధానమని ఆరోపిస్తున్న బీజేపీయేతర పార్టీలు జాతీయ స్థాయిలో కొత్త కూటమి లేదా పార్టీగా ఏర్పడే అవకాశాలున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రాల్లో ఎవరికి వారుగా ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే జాతీయ స్థాయిలో ఏకం కావాల్సిన తీరు, విధి విధానాలు, అందుకు అడ్డంకిగా ఉండే అంశాలపై ఇప్పటికే టీఆర్‌ఎస్, టీఎంసీ, ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ తదితర పార్టీల మధ్య చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. సమాఖ్య వ్యవస్థను కాపాడేందుకు ప్రాంతీయ పార్టీలు అవగాహనకు రావాలని మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్‌తో నిమిత్తం లేకుండా, తమ దారిలో తాము వెళ్లాలనే అభిప్రాయం బీజేపీయేతర పార్టీల్లో వ్యక్తమవుతోందని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

మరోసారి.... ప్రజల్లోకి!!...పాదయాత్ర దిశగా రేవంత్

*మరోసారి.... ప్రజల్లోకి!*

*పాదయాత్ర దిశగా రేవంత్*

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్‌ ప్రణాళిక

*సభ్యత్వ నమోదు పూర్తి కాగానే కార్యాచరణ షురూ*

*రాహుల్‌ ముఖ్యఅతిథిగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిరుద్యోగ సభ!*

హైదరాబాద్‌: బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ మరోమారు ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మూడు ముఖ్య అంశాలను ఎంచుకుని ప్రజల వద్దకు వెళ్లాలని ఆ పార్టీ ముఖ్య నేతలు యోచిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని రైతు రుణమాఫీ, ఉద్యోగాల కల్పన-నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టే యోచనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉన్నట్టు గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ మూడు అంశాలపై పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయికి పంపడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపేలా భారీ బహిరంగ సభలను నిర్వహించే దిశలో కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రైతులు, నిరుద్యోగ యువతతో పాటు పేద, మధ్య తరగతి ప్రజల పక్షాన చేపట్టే ఆందోళనలు పార్టీ ఇమేజ్‌ను మరింత పెంచుతాయని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌-బీజేపీలు పరస్పరం నిందించుకోవడం మినహా ప్రభుత్వాల నిర్వాకాలపై ఆ పార్టీలు ఆందోళనలు చేసే పరిస్థితుల్లో లేనందున కాంగ్రెస్‌కున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేవంత్‌ శిబిరం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

అందులో భాగంగా నిరుద్యోగుల పక్షాన భారీ ఎత్తున బహిరంగ సభను సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించి, ఆ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ఆహ్వానించేందుకు.. గతంలోనే ఉన్న ప్రతిపాదనను అమల్లోకి తేవాలని రేవంత్‌ యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ సభ తర్వాత ఏఐసీసీ ఆమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశముందని, అయితే ఎన్నికలకు సమయం లేకుంటే మాత్రం ఈ ఆలోచనను విరమించుకునే అవకాశముందని చెబుతున్నారు
*సభ్యత్వంతో* *జోష్‌....*
డిజిటల్‌ సభ్యత్వ నమోదు ప్రక్రియ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంలో ఉత్సాహాన్ని పెంచుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలను చేయిస్తామని ఏఐసీసీకి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్‌ 9 నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదట్లో కొంత మందకొడిగానే నడిచింది. ఆ తర్వాత పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీ కోఆర్డినేటర్ల నియామకంతో పాటు డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమీక్షలు చేసిన తర్వాత వేగం పుంజుకుంది.

కేవలం రెండు నెలల కాలంలోనే 34 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయి. ఒక్క నల్లగొండ పార్లమెంటు పరిధిలోనే 4.5 లక్షల సభ్యత్వం నమోదయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నియోజకవర్గాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 20-30 వేల వరకు సభ్యత్వాలు పూర్తయ్యాయి. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరింత క్రియాశీలంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించిన టీపీసీసీ.. సభ్యత్వ టార్గెట్‌ను 50 లక్షలకు పెంచడం గమనార్హం.

link Media ప్రజల పక్షం🖋️

Electrification Efforts in India - Ambedkar

Electrification Efforts in India - Ambedkar

Courtesy by : https://t.co/NuFv9kgy0M.
November 28, 2018

What is the issue?

  • Recently, Indian PM announced the completion of electrification of all census villages.
  • In this context, a look at the efforts of electrification process in India becomes imperative.

How did electrification process evolve in India?

  • The vision and blueprint for electrifying the country was formulated by BR Ambedkar in early 1940s.
  • He was then the chairman of the Policy Committee on Public Works and Electric Power, established in 1943.
  • By 1945, Dr Ambedkar and his team had studied the problems and opportunities for electricity development in India.
  • They pursued provinces and states to impart a national perspective to electricity development.
  • Ambedkar's belief was that cheap and abundant electricity can only be provided through a centralised system.
  • He felt this was essential to ensure the success of industrialisation and bring about socio-economic development.
  • Electricity was dominated by the private sector and followed a decentralised model during pre-Independence era.
  • But the committee favoured the state enterprise in development of electricity supply using the best technology of the time.
  • Accordingly, the Electricity Supply Act got enacted in 1948.
  • India started carrying out electrification according to the plan formulated by the Ambedkar committee.
  • How did village electrification go?

    • During plan periods in the 1950s, there was focus on village electrification, primarily to support rural industries.
    • From mid-1960s to late-1980s, the focus shifted to pump-set energisation.
    • But not much progress could be achieved in electrifying villages and households.
    • Rural electrification increased to only 6% in 1973, 30% in 1991 and 43% in 2001.
    • Also, electric utilities were suffering from huge losses.
    • With over half the population without electricity access in 2001, the government launched the Rural Electricity Supply Technology Mission.
    • This aimed at enhancing electricity access in a targeted manner, using both grid and off-grid technologies.
    • It was followed by major policy reforms with the passage of Electricity Act, 2003.
    • What is the present scenario?

      • Rural electrification got the impetus since the enactment of Electricity Act, 2003, which obligated both Centre and states to enable electricity access.
      • It led to the launch of large-scale electrification effort in 2005 by the central government.
      • Efforts to create access to electricity for all households and provide free connections to all below poverty line households were taken up.
      • In its latest report, World Energy Outlook 2018, the International Energy Agency called India a “star performer”.
      • This was in terms of achieving the milestone of providing power to each village.
      • Around half a billion people have gained access to electricity in India since early 2000s.
      • What is the case with household electrification?

        • While villages were getting electrified during the last decade and a half, household electrification was lagging.
        • The government launched the Saubhagya Scheme, or the Pradhan Mantri Sahaj Bijli Har Ghar Yojana, in September 2017.
        • It aimed at connecting all non-electrified households by March 2019.
        • It’s a first-of-its-kind scheme focusing on household electrification, regardless of economic status.
        • It aims to cover 30 million households in rural areas, of which 20 million have been connected.

         

        Source: Financial Express

రెండు రాష్ట్రాలకు విద్యుత్ నిలిపేయండి..!

రెండు రాష్ట్రాలకు విద్యుత్ నిలిపేయండి..!

కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ

– రెండు రాష్ట్రాల సీఎస్‌ లకు లేఖ రాసిన బోర్డ్

–శ్రీశైలంలో భారీ తగ్గిన నీటిమట్టం

–రానున్న రోజుల్లో తప్పని తిప్పలు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశించింది. రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకోవద్దని రెండు రాష్ట్రాల సీఎస్‌ లకు లేఖ రాసింది. ఇప్పటి వరకు రాసిన లేఖలపై ఎలాంటి స్పందన రాకపోవడంతో రెండు రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది బోర్డు.

ఈ సంవ‌త్సరం మే నెల వ‌ర‌కు తెలంగాణ‌కు మూడు టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌ కు ఆరు టీఎంసీలు తాగునీటికి కోసం అవ‌స‌రం ఉంటుంద‌ని తెలిపింది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 34.24టీఎంసీలు మేర మాత్రమే నీరు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్టు కేఆర్ఎంబి స్పష్టం చేసింది.
215 టీఎంసీల సామర్థ్యం ఉండాల్సిన శ్రీశైలం జలాశయంలో.. 35 టీఎంసీల డెడ్‌ స్టోరేజీ స్థాయికి నీటి నిల్వలు అడుగంటిపోయాయి. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుత్‌ ఉత్పత్తిచేయడంతో ఈ దుస్థితి వచ్చిందటున్నారు ఇరిగేషన్ నిపుణులు. ఇరు రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న జలవిద్యుత్తులో శ్రీశైలం వాటానే చెరో 40 శాతంగా ఉండటంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని అన్నారు. అయితే.. పరిస్థితులను ముందే ఊహించి.. ఐదు నెలల క్రితమే ఇరు రాష్ట్రాలను హెచ్చరిస్తూ బోర్డు లేఖలు రాసింది.తాగు, సాగు నీటి అవసరాల కంటే ఎక్కువగా నీరు ఉంటేనే జలవిద్యుత్తు ఉత్పత్తి జరగుతోంది. కానీ.. విద్యుదుత్పత్తి కోసమే నీటిని వినియోగించి.. సముద్రంలోకి వృథాగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఇరు రాష్ట్రాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది ఇదే సమయానికి 129.78 టీఎంసీల నీరు ఉండేది. కానీ.. ఇప్పుడు నీటి నిల్వలు ఏకంగా 35.51 టీఎంసీలకు పడిపోయాయి. కేఆర్‌ఎంబీ లేఖ రాసిన తర్వాత ఇరు రాష్ట్రాలు జలవిద్యుదుత్పత్తి కోసం 59 టీఎంసీలను వినియోగించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఈ ఏడాది వెయ్యికి పైగా  టీఎంసీల మేర ఇన్‌ ఫ్లో వచ్చినప్పటికీ.. ప్రస్తుత నిల్వలు డెడ్‌ స్టోరేజీ స్థాయిలో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు మేల్కోకపోతే సమ్మర్‌ లో తాగునీటి సమస్యలు తప్పవని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Sunday, February 13, 2022

దమ్ముంటే నన్ను జైల్లో వేయండి..... సీయం కేసీఆర్!!

*దమ్ముంటే నన్ను జైల్లో వేయండి..... సీయం కేసీఆర్!*

హైదరాబాద్: దమ్ము ఉంటే తనను జైల్లో వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‎కు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. బండిసంజయ్‌నే జైల్లో వేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.జైలు అంటే దొంగలు భయమని.. తమకేం భయలేదన్నారు. మోడీ సర్కార్‌లో 33 మంది బ్యాంక్‌లను మోసం చేసి విదేశాల్లో తలదాచుకుంటున్నారని మండిపడ్డారు. ఇది మోదీ ఆధ్వర్యంలో దేశం సాదించిన ఘనత అని ఎద్దేవా చేశారు. ఇందులో సగం కంటే ఎక్కువ మంది మోదీకి స్నేహితులేనని, గుజరాతిలేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ మాస్ట్ గో ఫ్రమ్ ది కంట్రీ నినాదం ఇప్పుడు అవసరమన్నారు. ''కనీస సంస్కారం లేని పార్టీ బీజేపీ. ప్రధాని మోదీ. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీకి ప్రజల్లో నమ్మకం ఉండేది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, రాష్ట్రాల్లో గెలవకపోయిన అధికారం చేలాయిస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ చేసిన రాజకీయాలపై చర్చ పెడదాం.'' అని సీఎం కేసీఆర్ అన్నారు.

link Media ప్రజల పక్షం🖋️