Wednesday, February 2, 2022

KCR రాజ్యాంగం రాస్తే ఎలా ఉంటుంది..? ఓ నెటిజన్ రాసి పంపిన వార్త.....Q న్యూస్

KCR రాజ్యాంగం రాస్తే ఎలా ఉంటుంది..? ఓ నెటిజన్ రాసి పంపిన వార్త
Q న్యూస్ 

1) ఫామ్ హౌస్ నుండి ముఖ్యమంత్రి పాలన చేయాలి .
2) బడులకు బిల్డింగ్ లు అవసరం లేదు .
3) ఉపాధ్యాయులను ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు . స్థానికత తో సంబందం లేదు .
4) mla లు భూ కబ్జాలు చేసుకోవచ్చు .
5) నిరుద్యోగులు హమాలి చేసుకోవాలి . ఉద్యోగాలు ఆడగవద్దు .
6)bc లకు రాజకీయ ప్రాతినిధ్యం అవసరం లేదు .
7)కమిషన్ ల కోసం ప్రాజెక్టులు కట్టుకోవచ్చు .
8) ప్రభుత్వం ఎన్ని వైన్ షాప్ ల కైనా లైసెన్సు ఇవ్వవచ్చు .
9)వరి ని ప్రభుత్వం కొనవలసిన అవసరం లేదు .
10)కలెక్టర్ లు ముఖ్యమంత్రి కాలు మొక్కితే mlc పదవి పొందవచ్చు .
11)అమరవీరులను పట్టించు కోవలసిన అవసరం లేదు .
12)ముఖ్య పదవులన్నీ ఒక కుటుంబానికే ఉండవచ్చు .
13) ఇష్టం వచ్చినప్పుడు భూముల రేట్ లను పెంచుకోవచ్చు
14) ప్రభుత్వ భూమి ని అమ్ముకోవచ్చు
15) st లకు జై భీమ్ సినిమా చూయించవచ్చు
16) దళితులను ఎన్ని సార్లయిన మోసం చేయవచ్చు .
17) ప్రజా సమస్యలను పక్క దోవ పట్టించడానికి రాష్ట్రం కేంద్రాన్ని నిందించాలి
18)డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలి కానీ ప్రజలకు ఇవ్వ వలసిన అవసరం లేదు .
19) ఎన్నికల ముందు అన్నీ డబ్బుల స్కీమ్ లు ప్రకటించాలి .
20) ఉప ఎన్నిక జరిగే చోట అన్నీ డబ్బుల స్కీమ్ లు ప్రకటించాలి .
21) కొత్త పెన్షన్ లు ఇవ్వవలిసిన అవసరం లేదు
22) యూనివర్సిటీ లను ముఖ్యమంత్రి సందర్శించాల్సిన అవసరం లేదు .
23) ప్రభుత్వం సంపద పెంచాల్సిన అవసరం లేదు , అప్పులు పెంచు కోవచ్చు .
24) రాజకీయ నాయకుడు ఎలాంటి మోసపూరిత వాగ్దానలైన ఇవ్వచ్చు
25)రాష్ట్రం లో ఆరోగ్య వ్యవస్థ ను పటిష్టం చేయవలిసిన అవసరం లేదు .
26) ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ పార్టీ కార్యక్రమాలకు వాడుకోవచ్చు .
27) ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను హరించవచ్చు .
28) ప్రభుత్వం ప్రతిపక్షం లో ఉన్న mla లను కొనుకోవచ్చు .
29) రైతుల ధాన్యం ను ప్రభుత్వం కొనవలిసిన అవసరం లేదు .

6 నెల్లు ముందుగానే**పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ అధినేత యోచన?

*6 నెల్లు ముందుగానే*

*పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ అధినేత యోచన?*

ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్న సీఎం కేసీఆర్‌

*30 వరకు నియోజకవర్గాల్లో కొత్తవారు లేదా యువతకు చాన్స్‌!*

*పార్టీ జిల్లా అధ్యక్షులకు సమన్వయం, సంస్థాగత శిక్షణ బాధ్యతలు*

*జాతీయ రాజకీయాలు సైతం లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కార్యాచరణ*

హైదరాబాద్‌: శాసనసభకు ముందస్తు ఎన్ని కలు ఉండబోవని కుండబద్దలు కొట్టిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వ్యూహా నికి మాత్రం ఇప్పటినుంచే పదును పెడుతున్నా రు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను 6 నెలల ముందే ప్రకటించా లని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వరుసగా రెండుసార్లు అసెం బ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది.

ముందస్తు వ్యూహంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొం దడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత, అధికార పార్టీలో అసమ్మతి తమకు కలిసి వస్తుందనే విపక్షాల ఆశలను వమ్ము చేయాలనే పట్టుదలతో కేసీఆర్‌ ఉన్నారు. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీఆర్‌ ఎస్‌కు ప్రస్తుతం 103 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలను గెలుస్తామని రెండ్రోజుల క్రితం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం
*కొత్త ముఖాలకు ప్రాధాన్యత?*
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరించిన కేసీఆర్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 25 నుంచి 30 మంది కొత్తవారిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వీరిలో ప్రస్తుత ఎమ్మెల్యేల వారసు లతో పాటు కొన్ని కొత్త ముఖాలకు ప్రత్యేకించి యువతకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం దక్కించుకున్న ఎర్రోల్ల శ్రీనివాస్, మన్నె క్రిషాంక్‌ వంటి కొందరు యువనేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ముగ్గురు ముఖ్య నేతలు తమ వారసులతో రాజకీయ ఆరంగేట్రం చేయించాలని భావిస్తున్నారు.

*link Media ప్రజల పక్షం🖋️*

prajasankalpam1.blogspot.com 

Tuesday, February 1, 2022

హైకోర్టుకు 12 జడ్జిల నియామకానికీ కొలిజియం సిఫారసు!

*హైకోర్టుకు 12 జడ్జిల నియామకానికీ కొలిజియం సిఫారసు!*

తెలంగాణ హైకోర్టుకు 12మంది జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇందులో ఏడుగురు న్యాయవాదులు, ఐదుగురు న్యాయాధికారులు ఉన్నారు.న్యాయవాదులు కాసోజు సురేందర్‌, చాడ విజయ్‌ భాస్కర్‌రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌ కుమార్‌, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫీయుల్లా బేగ్‌, నాచరాజు శ్రవణ్‌ కుమార్‌ వెంకట్‌ పేర్లను కొలీజియం సిఫారసు చేసింది.
అదేవిధంగా పదోన్నతికోసం కొలీజియం సిఫారసు చేసిన న్యాయాధికారుల్లో జీ. అనుపమ చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎం. సంతోష్‌రెడ్డి, డీ. నాగార్జున ఉన్నారు.

*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com

గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మార్చాల్సింది రాజ్యాంగంను కాదు....!!

https://youtu.be/IIbzQVCYYTM... *గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి @TelanganaCMO కేసీఆర్ సారు గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ప్రాణాలు త్యాగాలు చేస్తే కానీ తెలంగాణ రాలేదు.ఇప్పుడున్న మీ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఆ త్యాగాలు చేసిన జాబితాలో లేరు... అంటే త్యాగాలు ఒకరివి పదవులు ఇంకొకరివి... అమరులైన అమరవీరుల ఆశయాలు ఈరోజు వరకు నెరవేర్చలేదు మీ ప్రభుత్వం... ఎన్ని హామీలు ఇచ్చారు మీరు వాటిలో ఒక్కటైనా పూర్తి చేశారా ??.... ఇప్పుడు మీరు భారత రాజ్యాంగంను మార్చాలని అనడం ఆస్యాస్పదం... ఎందుకు అంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలోకి వచ్చిన మీరు రాజ్యాంగంకు అనుగుణంగా నడుచుకోలేదు...అంటే మార్చాల్సింది రాజ్యాంగంను కాదు మీరు... మీ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయండి 👍.... మీరు మారాలి మీ స్థానంలో తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారిని కూర్చోపెట్టాలి అప్పుడైనా భారత గౌరవ రాజ్యాంగంకు అనుగుణంగా ఏమైనా పురోగతి తెలంగాణాలో వస్తుందో 🤔....Bplkm*  *Copy to Group link Media*  prajasankalpam1.blogspot.com

తెలంగాణలో జర్నలిస్టులకు రక్షణ కరువు

Courtesy by : Q News

తెలంగాణలో జర్నలిస్టులకు రక్షణ కరువు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు అవినీతి అక్రమాలపై వాస్తవాలు రాసే పరిస్థితి లేకుండా పోయిందని తెలంగాణ జర్నలిస్టుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న అనేకమంది జర్నలిస్టులపై టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, అధికారులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులపై ఇలాంటి వేధింపులు, దాడులు దూషణలు లేవని జర్నలిస్ట్ సంఘాల నేతలు హితవు పలికారు. హయత్ నగర్ మహిళ ఎమ్మార్వో జర్నలిస్టును అసభ్య పదజాలంతో దూషించడాన్ని తెలంగాణలోని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కోన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు జర్నలిస్టులను దూషించినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించి ఉంటే రాష్ట్రంలో నేడు పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండేదికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్ నిర్లక్ష్యంతోనే అధికారులు కూడా జర్నలిస్టులను దూషించే పరిస్థితి ఏర్పడడం అత్యంత బాధాకరమని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పాలనతో ప్రజా ప్రతినిధులు, అధికారులు అవినీతి అక్రమాలు భారీ ఎత్తున తీవ్రస్థాయిలో పెరిగాయన్నారు. లంచాలు ఇస్తే తప్ప ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్యులకు న్యాయం జరగడం లేదన్నారు. అధికారులు తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడుతుంటే సంబంధిత మంత్రులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జర్నలిస్ట్ సంఘాల నేతలు ప్రశ్నించారు. జర్నలిస్టులు వాస్తవాలను వెలుగులోకి తెస్తే.. వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులలో అవినీతిని కట్టడి చేయకపోతే భవిష్యత్తులో టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించి హయత్ నగర్ ఎమ్మార్వోను వెంటనే సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరంతో పాటు పలు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని పలువురు జర్నలిస్టులు హెచ్చరించారు.

పసలేని నిష్ప్రయోజనకర.... బడ్జెట్.... కేసీఆర్!

*పసలేని నిష్ప్రయోజనకర.... బడ్జెట్.... కేసీఆర్!*

హైదరాబాద్: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్...దశ దిశా నిర్దేశం లేని, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనం తో నిండి, మాటలగారడీ తో కూడి వున్నదని అని సిఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ , మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ ను సిఎం పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని సిఎం అన్నారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ ను బిగ్ జీరో అని సిఎం స్పష్టం చేశారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇన్ కం టాక్స్ లో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని సిఎం అన్నారు. ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురు చూసారని , వారి ఆశలమీద కేంద్ర బడ్జెట్ నీల్లు చల్లిందన్నారు. వైద్యం తదితర ప్రజోరోగ్యం , మౌలిక రంగాలను అభివృద్ధి పరడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేట తెల్లమైందన్నారు.
'' ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను అభివృద్ధి పరుస్తుంటే..ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమ''ని సిఎం అన్నారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని సిఎం ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

*link Media ప్రజల పక్షం🖋️*
prajasankalpam1.blogspot.com 

సుప్రీంలో కేసు.. జర్నలిస్టుల భూమిలో ఐటి టవర్స్

సుప్రీంలో కేసు.. జర్నలిస్టుల భూమిలో ఐటి టవర్స్

Courtesy by : Q Group Media 

హైదరాబాద్ : 15 సంవత్సరాలుగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారు." ఇగ ఇస్తాం .. అగ ఇస్తాం" అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రతి ఎన్నికల సందర్భంగా జర్నలిస్టులకు కచ్చితంగా ఇళ్ల స్థలాలను ఇస్తామని నమ్మిస్తూ వస్తున్నారు. జర్నలిస్టులకు జాగ వచ్చుడు లేదు.. ఆశ చావడం లేదు... 2007 నుంచి సీనియర్ జర్నలిస్టులుగా ఉన్న వారందరికీ హైదరాబాద్ లో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేట్ బషీరాబాద్, నిజాంపేట ప్రాంతాలలో కొంత భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అందులో సీనియర్ జర్నలిస్టులను గుర్తించి దాదాపు 1140 మందిని ఎంపిక చేశారు. వీరందరి నుంచి అప్పట్లో ఒక్కొక్కరి నుంచి రూ. రెండు లక్షల చొప్పున వసూలు చేసి 'జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ" పేరుతో ప్రభుత్వ ఖాతాలో దాదాపు 22 కోట్ల రూపాయలను జమ చేసింది. అప్పటి నుంచి ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే, కాలక్రమేణా ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ, ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఖచ్చితంగా మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని పలు సందర్భాలలో హామీ ఇచ్చారు. అయినప్పటికీ, ఆచరణలో పెట్టకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇదే విషయంపై జర్నలిస్టులు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కు కూడా వినతి పత్రాలు సమర్పించి అడిగినప్పుడు తాను బాధ్యత తీసుకుని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, అందులో, అందమైన భవనాలు నిర్మిస్తామని హామీలు గుప్పించారు.
సుప్రీంలో కేసు ఉండగా "ఐటీ"కి ఎలా ఇస్తారు..?
2007లో పేట్ బషీరాబాద్ లోని సర్వే నంబరు 25 /2లో 38 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయిస్తూ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దికాలం తరువాత రాష్ట్ర హైకోర్టు జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వరాదని కొంతమంది వేసిన పిటీషన్ల ఆధారంగా ఈ ఉత్తర్వులు కొట్టివేసింది. దీంతో, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తదనంతరం సుప్రీంకోర్టు వాదోపవాదనలు విని మధ్యంతర తీర్పును ఇచ్చింది. జర్నలిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములను డెవలప్ చేసుకోవచ్చని.. ఆయా భూములను సొసైటీలకు అప్పగించవచ్చు అని తీర్పు వెల్లడించింది... తదుపరి తీర్పు వచ్చేంతవరకు నిర్మాణాలు మాత్రం చేపట్ట రాదని స్పష్టంగా తీర్పునిచ్చింది. ఇంకా తుది తీర్పు రావాల్సి ఉంది. ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పు కాపీలను ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయడం జరిగింది. ఈ విషయంలో కూడా ముఖ్యమంత్రి తో పాటు ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో సుప్రీంకోర్టులో కేసు ఉండటంవల్ల మీకు ఆ భూములను స్వాధీనం చేయలేకపోతున్నామని అనేక సందర్భాల లో చెప్పినారు. అయినప్పటికీ, ప్రభుత్వంలోని పెద్దలే స్వయంగా ఈ స్థలాన్ని "ఐటీ టవర్ ల " కోసం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఈ భూములపై కేసులు కొనసాగుతున్నా , ఐటీ రంగానికి ఎలా కేటాయిస్తారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. నియమ నిబంధనల ప్రకారం ఏదైనా భూమిపై కోర్టులో వివాదం నడుస్తుంటే దాన్ని 'ఏ ఇతర వ్యక్తులకు గాని సంస్థలకు గాని" అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఉండదు.. అంతిమ తీర్పు వచ్చే వరకు యథాస్థితిని కొనసాగించాల్సి ఉంటుంది.. అయితే, ఇవేమీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు "జర్నలిస్టులు ఏం చేస్తారు లే.. వాళ్లంతా మా చేతిలో ఉన్నారు లే "" .. అనే నిర్లక్ష్య వైఖరితో, నేడు, జర్నలిస్టుల స్థలాన్ని ఐటీ సంస్థలకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం శ్రేయస్కరం కాదు. దీన్ని సంఘటితంగా ఎదుర్కోవలసిన అవసరం ఏర్పడింది... మిత్రులారా మేల్కొండి... ఈ సమయంలో అడ్డుకోకుంటే అసలు ఇళ్లస్థలాలు అనేవి జర్నలిస్టులకు ఎండమావిగా మారుతాయి.

హామీల ముసుగులో కుట్ర:
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో జర్నలిస్టులకు ఎలాంటి అనుమానం రాకుండా హామీ లిస్తూ కాలయాపన పేరుతో కుట్రలు చేసినట్లు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. పేట్ బషీరాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన 38 ఎకరాల స్థలంలో "ట్విన్ ఐటీ టవర్స్" నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జర్నలిస్టులను దగా చేయడమే అవుతుంది. ఫిబ్రవరి 8న, ఈ "ఐటి టవర్స్" కి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ భూమి పూజ కార్యక్రమం స్వయంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరుగనుంది. అంటే ఈ స్థలం జర్నలిస్టులకు ఇవ్వరాదని మంత్రి కేటీఆర్ గట్టిగా నిర్ణయించుకోవడం వల్లనే ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు అర్థమవుతోంది. మొదటి నుంచి మంత్రి కేటీఆర్ కు ఈ పేట్ బషీరాబాద్ స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయించిన విషయం తెలిసినప్పటికీ, ఐటీ కంపెనీలకు దారాదత్తం చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టులకు ఇస్తే ప్రభుత్వానికి "ఏం లాభం" అనే దిశగా ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది. అంతిమంగా జర్నలిస్టులకు స్థలాన్ని ఇవ్వకూడదని అభిప్రాయంతో ప్రభుత్వం స్థలాన్ని ఐటి కంపెనీల కోసం కేటాయించడం అత్యంత బాధాకరం. జర్నలిస్టుల ఈ విషయాన్ని గమనించి ఇళ్ల స్థలాల సాధనకోసం పోరాట కార్యక్రమాలను చేయాల్సిన అవసరం ఉంది. దీనిని అడ్డుకోకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇళ్లస్థలాలు ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి ఉండదు. కావున, విజ్ఞతతో ఆలోచించి "ఐటీ టవర్" నిర్మాణం భూమి పూజ కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా జర్నలిస్టులంతా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది.