Sunday, June 13, 2021

GHMC launches exclusive helpline to report water drains

Hyderabad : 13/06/2021

GHMC launches exclusive helpline to report water drains

Citizens with grievances can WhatsApp the details to 9848021665 and they can also send pictures along the location of the drain that needs to be fixed.

By Author  |  Published: 13th Jun 2021  2:08 pmUpdated: 
GHMC launches exclusive helpline to report water drains

Hyderabad: Greater Hyderabad Municipal Corporation launched an exclusive number to report grievances pertaining to storm water drains.

Citizens with grievances can WhatsApp the details to 9848021665 and they can also send pictures along the location of the drain that needs to be fixed.

People can also directly report the grievances to 9848098166- phone number of Animal Husbandry Minister Talasani Srinivas Yadav.

State government sanctioned Rs 45 crore to widen and repair the drains.To make sure these works are executed efficiently and on a war footing basis, elected representatives will inspect their respective jurisdiction from June 14 to 19.

Srinivas Yadav will also inspect the storm water drains works in Begumpet on June 14. According to a press release issued by the minister’s office, Chief Minister K Chandrashekar Rao and Municipal Administration and Urban Development Minister KT Rama Rao are constantly monitoring the works related to nalas

హైదరాబాద్ ప్రజలారా మూసీ నదిని కబ్జాల నుంచి కాపాడుకుందాం

హైదరాబాద్ : 13/06/2021

హైదరాబాద్ ప్రజలారా మూసీ నదిని కబ్జాల నుంచి కాపాడుకుందాం 🙏

https://youtu.be/IfygIAAKuFs....1

https://youtu.be/fOQpHZE363E..... 2 *ప్రజల డబ్బులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూడండి... పర్యావరణ ప్రేమికులారా ఆలోచించండి... Bplkm*

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
 https://youtube.com/channel/UCO3m8P1ULX6soj73A43nhMg   (youTube)

కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm

https://prajasankalpam1.blogspot.com/


 prajasankalpam1.blogspot.com

Friday, June 11, 2021

Vaccination: టీకా అందరికీ వద్దు కేంద్రానికి సూచించిన ప్రజారోగ్య నిపుణులు

హైదరాబాద్ : 12/06/2021
Vaccination: టీకా అందరికీ వద్దు కేంద్రానికి సూచించిన ప్రజారోగ్య నిపుణులు

Vaccination: టీకా అందరికీ వద్దు

ఇంటర్నెట్‌డెస్క్‌(ఈనాడు తాజా వార్తలు ట్విట్టర్): వ్యాక్సిన్ పంపిణీ, వైరస్ కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజారోగ్య నిపుణుల బృందం నివేదిక సమర్పించింది. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నవాళ్లకే తొలుత టీకాలు వేయాలని ప్రజారోగ్య నిపుణుల బృందం కేంద్రానికి సూచించింది. అందరికీ వ్యాక్సిన్‌ వేయడం సముచితం కాదని పేర్కొంది. ప్రణాళికా రహితంగా టీకా పంపిణీ నిర్వహిస్తే కొత్తరకం స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే కొవిడ్‌ బారిన పడ్డవారికి వ్యాక్సిన్‌ అవసరం లేదని అభిప్రాయపడింది. 

ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్ అసోషియేషన్‌, ఇండియన్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌, సోషల్‌ మెడిసిన్‌, ఇండియన్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఎపిడెమాలజిస్ట్స్‌, ఎయిమ్స్‌ వైద్యులు, కొవిడ్‌పై ఏర్పడిన టాస్క్‌ఫోర్స్‌ సభ్యులతో కూడిన బృందం ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక నివేదిక సమర్పించింది. అందరికీ టీకా వేయడం కంటే, లక్షిత వర్గాలకు ప్రాధాన్య క్రమంలో టీకా ఇవ్వడం వల్ల మేలు జరుగుతుందని నిపుణుల బృందం తెలిపింది. యువత, చిన్నారులకు ఇప్పుడు టీకా పంపిణీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. సామూహికంగా, విచక్షణారహితంగా, అసంపూర్తిగా ఈ క్రతువు నిర్వహిస్తే వైరస్‌ మ్యుటేషన్లతో కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే కరోనా బారిన పడ్డవారికి టీకా అనవసరమని నిపుణులు స్పష్టం చేశారు. టీకా అనేది కరోనాపై శక్తిమంతమైన ఆయుధమని దాన్ని వాడకుండా అట్టి పెట్టుకోకూడదని, అలాగని విచక్షణారహితంగా ఉపయోగించకూడదని కేంద్రానికి సూచించింది. స్వల్ప ఖర్చుతో అత్యధిక ప్రయోజనాలు రాబట్టుకునేలా టీకా పంపిణీని వ్యూహాత్మకంగా వాడుకోవాలని నిపుణులు పేర్కొన్నారు. 

డెల్టా వేరియంట్‌ ప్రభావంతో కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసుల మధ్య వ్యవధిని తగ్గించడం వంటి అవకాశాలను పరిశీలించాలని నిపుణుల బృందం కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరణాలను తగ్గించడంపై దృష్టి సారించాలని కేంద్రానికి సూచించింది. కొవిడ్‌తో మరణిస్తున్న వారిలో వృద్ధులు, ఊబకాయులు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతకు టీకా వేయడం ఆర్థికంగా ప్రయోజనకరం కాదని స్పష్టం చేశారు. 

Loading video

బాలకార్మిక వ్య‌వ‌స్థ వ్య‌తిరేక దినోత్స‌వం: క‌రోనావైర‌స్‌తో బాల కార్మికులు ఇంకా పెరుగుతారా?

హైదరాబాద్ :12/06/2021

బాలకార్మిక వ్య‌వ‌స్థ వ్య‌తిరేక దినోత్స‌వం: క‌రోనావైర‌స్‌తో బాల కార్మికులు ఇంకా పెరుగుతారా?

BBC తెలుగు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)
బాల కార్మికులు

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

ఐఎల్ఓ వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య దాదాపు 15 కోట్లు

క‌రోనావైర‌స్ వ్యాప్తి న‌డుమ ప‌త‌న‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింత మంది పిల్లల్ని కార్మికులుగా మార్చే ముప్పుంద‌ని‌ అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) హెచ్చ‌రిస్తోంది.

పిల్ల‌ల నుంచి బాల్యాన్ని, వారి గౌర‌వాన్ని దోపిడీ చేయ‌కుండా అడ్డుకునే బాల కార్మిక చ‌ట్టాల‌ను ఆర్థిక ఇబ్బందులు నీరు గార్చే ముప్పుంద‌ని, ఇది పిల్లల శారీర‌క‌, మాన‌సిక అభివృద్ధికి చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ప్ర‌పంచ బాల కార్మిక వ్య‌వ‌స్థ వ్యతిరేక‌ దినోత్స‌వంనాడు ఐఎల్‌వో ఓ నివేదిక విడుద‌ల చేసింది.

"పిల్ల‌ల‌ను ప‌నుల్లో పెట్ట‌కుండా అడ్డుకునే నిబంధ‌న‌లు, చ‌ట్టాల‌కు చాలా దేశాలు కోర‌లు పీకేస్తున్నాయ‌ని మేం ఆందోళ‌న ప‌డుతున్నాం." అని ఐఎల్‌వోకు చెందిన బాల కార్మిక వ్య‌వ‌స్థ నిపుణుడు బెంజ‌మిన్ స్మిత్.. బీబీసీకి వివ‌రించారు.

"ఇప్ప‌టివ‌ర‌కూ సాధించిన విజ‌యాల‌ను కోవిడ్‌-19 పేరుతో తుంగ‌లోకి తొక్కేయ‌కూడ‌దు. ఆ దిశ‌గా ప‌డుతున్న అడుగుల‌ను స‌హించేది లేదు"

ఎంత మంది పిల్ల‌లు ప‌నిచేస్తున్నారు?

బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను ప్రాథమిక హ‌క్కులకు ఉల్లంఘ‌న‌గా ఐఎల్‌వో నిర్వ‌చించింది. క‌రోనావైర‌స్ వ్యాప్తి న‌డుమ చాలా కుటుంబాలు పేద‌రికంలో ప‌డ‌టంతో బ‌డి మానేసే పిల్ల‌ల సంఖ్య పెరుగుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేసింది.

ప్ర‌స్తుతం 5 నుంచి 17 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న 15.2 కోట్ల మంది పిల్ల‌లను బాల కార్మిక వ్య‌వ‌స్థ పీడిస్తోంద‌ని సంస్థ వెల్లడించిన తాజా గ‌ణాంకాలు చెబుతున్నాయి.

వీరిలో స‌గం మంది అనారోగ్య‌క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌మాద‌క‌ర ప‌నులు చేస్తున్నారు.

ఆఫ్రికాలో బాల కార్మికులు ప‌నిచేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. 2016 అంచ‌నాల ప్ర‌కారం.. ఇక్క‌డ ప్ర‌తి ఐదుగురు పిల్ల‌ల్లో ఒక‌రు బాల కార్మికులున్నారు.

బాల కార్మికుల్లో ఎక్కువ‌మంది కుటుంబ వృత్తులు, వ్యాపారాల్లోనే ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్నార‌ని ఐఎల్‌వో వివ‌రించింది. దీన్ని అడ్డుకునేందుకు ఐరాస తీసుకొచ్చిన నిబంధ‌న‌ల‌ను 180కిపైగా దేశాలు ఆమోదించాయి.

2025నాటికి బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా నిర్మూలించాల‌ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోనూ నిర్దేశించారు. ఆ దిశ‌గా ప్ర‌పంచ దేశాలు కృషి చేస్తున్నాయ‌ని బాలల‌ హ‌క్కుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న సంస్థ‌లు చెబుతున్నాయి.

బాల కార్మికులు

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

చాలా మంది బాలకార్మికులు జీతం లేని పనులు చేస్తున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది

అయితే, క‌రోనావైర‌స్ వ‌ల్ల ప్ర‌త్య‌క్షంగా లేదా ప‌రోక్షంగా ప్రభావితం అవుతున్న కుటుంబాల‌పై ఆర్థికంగా చాలా ఒత్తిడి ప‌డుతోంద‌ని స్మిత్ ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.

"కోవిడ్‌-19 వ‌ల్ల‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుదేల‌వడంతో బాల కార్మిక వ్య‌వ‌స్థ‌‌పైనున్న నిషేధాన్ని ఎత్తివేయాల‌నే వాద‌న బ‌ల‌డ‌పడుతోంది. ఫ‌లితంగా ప్ర‌పంచ దేశాలు చ‌ట్టాల‌ను నీరుగార్చే ముప్పుంది."

"అడుగులు స‌రైన దిశ‌లో ప‌డ‌క‌పోతే.. ఓ త‌రాన్ని మ‌నం కోల్పోతాం అని ఓ నిపుణుడు వ్యాఖ్యానించారు."

"2000 నుంచి 2016 మ‌ధ్య ప్ర‌పంచ వ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య 38 శాతం వ‌ర‌కు త‌గ్గింది. అంటే ప‌నిచేస్తున్న పిల్ల‌ల సంఖ్య‌ 9.4 కోట్ల మంది వ‌ర‌కూ త‌గ్గింది."

అయితే కొన్ని దేశాలు వ్య‌తిరేక దిశ‌లోనూ న‌డుస్తున్నాయి. 2014లో కార్మికుల‌కు ఉండాల్సిన క‌నీస‌ వ‌య‌సును బొలివియా 14 నుంచి ప‌దేళ్ల‌కు త‌గ్గించింది. దీనిపై పెద్ద వివాద‌మే చెల‌రేగింది. మాన‌వ హ‌క్కుల సంస్థ‌లు తీవ్ర‌మైన విమ‌ర్శ‌నాస్త్రాలూ సంధించాయి.

మ‌రికొన్ని దేశాలు కూడా బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను చ‌ట్ట‌బ‌ద్ధం చేశాయి. అయితే అక్క‌డ బాల కార్మికులు పెద్ద సంఖ్య‌లో లేరు.

మ‌రోవైపు ప్ర‌పంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్య‌వ‌స్థ నిషేధం విధించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని కొంద‌రు నిపుణులు ప్ర‌శ్నిస్తున్నారు. "ఈ నిషేధం ప్ర‌మాద‌క‌రం, అన‌వ‌స‌రం" అని అంత‌ర్జాతీయ విద్యావేత్త‌ల బృంద‌మొక‌టి వ్యాఖ్యానించింది.

బొలీవియా బాలిక

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

బొలీవియా దేశం 2014లో పని వయసును 10 ఏళ్ళకు తగ్గించింది

వారి వాద‌న ఏమిటి?

పిల్ల‌ల‌కు అన్నిసార్లూ ప‌ని చేటు చేస్తుంద‌ని అనుకోకూడ‌ద‌ని కొంద‌రు అంత‌ర్జాతీయ విద్యావేత్త‌లు అంటున్నారు. వారు అమెరికాలోని డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన మాజీ సెనేట‌ర్ టామ్ హార్కిన్ కేసును ప్ర‌స్తావిస్తుంటారు.

బంగ్లాదేశ్‌లో ఓ సంస్థ బాల కార్మికుల సాయంతో దుస్తుల‌ను త‌యారీ చేస్తుంద‌ని 1993లో టీవీ ఛానెల్ బ‌య‌ట‌పెట్టింది. ఈ సంస్థ‌కు దిగ్గ‌జ సంస్థ వాల్‌మార్ట్‌తో వ్యాపార సంబంధాలున్నాయి. దీంతో ఇలా బాల కార్మికుల‌తో త‌యారు చేయించే ఎలాంటి వ‌స్తువునూ దిగుమ‌తి చేసుకోకూడ‌ద‌ని హార్కిన్ ఓ బిల్లు తీసుకొచ్చారు.

ప‌దేళ్లపాటు చాలా ప్ర‌య‌త్నాలు చేసినా ఈ బిల్లు ఆమోదం పొంద‌‌లేదు. అయితే, బిల్లు ప్ర‌తిపాదించిన వెంట‌నే బంగ్లాదేశ్‌లో చాలా సంస్థ‌లు కార్మికుల‌ను విధుల నుంచి తొల‌గించాయి.

దాదాపు 50,000 మంది పిల్ల‌లు ఆనాడు రోడ్డున ప‌డ్డార‌ని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలోని ఇంట‌ర్నేష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రొఫెస‌ర్ జో బోయ్‌డెన్ చెప్పారు.

ప్ర‌స్తుతం 15.2 కోట్ల మంది పిల్ల‌లను బాల కార్మిక వ్య‌వ‌స్థ పీడిస్తోంద‌ని ఐఎల్‌వో గ‌ణాంకాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

ప్ర‌స్తుతం 15.2 కోట్ల మంది పిల్ల‌లను బాల కార్మిక వ్య‌వ‌స్థ పీడిస్తోంద‌ని ఐఎల్‌వో గ‌ణాంకాలు చెబుతున్నాయి.

"బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను నిర్మూలించాల‌నే ఉద్దేశంతో హార్కిన్స్ బిల్లును తీసుకొచ్చారు. ప‌నులు చేయ‌డం మాన్పిస్తే.. పిల్ల‌లు పాఠ‌శాల‌కు వెళ్తార‌ని అనుకున్నారు. అయితే ఆ త‌ర్వాత చేప‌ట్టిన ఓ అధ్య‌య‌నంలో.. అక్క‌డ ఒక్క విద్యార్థి కూడా పాఠ‌శాల‌లో చేరిన‌ట్లు క‌నిపించ‌లేద‌ని తేలింది." అని 2018లో బీబీసీకి ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో బోయ్‌డెన్ వివ‌రించారు.

"చాలామంది పిల్ల‌లు వ్యభిచారం, ఇటుక‌ల త‌యారీ లాంటి ప్ర‌మాద‌క‌ర ప‌నుల్లో అడుగుపెట్టారు. ఈ ప‌నుల‌తో పోలిస్తే బ‌ట్ట‌ల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌ని చేయ‌డం చాలా మేలు." అని ఆమె వ్యాఖ్యానించారు. ఇథియోపియా, భార‌త్‌, పెరు, వియ‌త్నాంల‌లో బాల కార్మిక వ్య‌వ‌స్థ‌పై ఆమె వ‌రుస‌ అధ్య‌య‌నాలు చేప‌ట్టారు.

"పిల్ల‌లు రోజువారి జీవితంలో ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల‌కు చ‌ట్టాలు స‌మాధానాలు చెప్ప‌లేవు" అని ఆమె న‌మ్ముతున్నారు.

బాల కార్మికులు

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

బంగ్లాదేశ్ దుస్తుల పరిశ్రమలో బాల కార్మికులు

పేద దేశాల్లో మేలు జ‌రుగుతోందా?

చాలా మంది చ‌దువు, ప‌నిని క‌లిపి చూస్తార‌ని బోయ్‌డెన్ వివ‌రించారు. "ప‌నిచేస్తే వ‌చ్చే డ‌బ్బును ఇంట్లో ఇవ్వ‌డంతోపాటు పుస్త‌కాలు, స్కూల్ యూనిఫామ్స్ కొనుక్కోవ‌డానికి ఉప‌యోగిస్తారు."

మా అధ్య‌య‌నాల్లో పాల్గొన్న కొంత మంది విద్యార్థులు ప‌నిచేయడానికీ సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పార‌ని ఆమె వివ‌రించారు.

"పేద దేశాల్లో ప‌నిచేస్తున్న పిల్ల‌లు.. చాలా మంది నెమ్మ‌దిగా ప‌నుల్లోకి అడుగుపెడుతున్నారు. వారిలో చాలా మందికి మంచి నైపుణ్యాలున్నాయి" అని ఆమె వివ‌రించారు.

"డ‌బ్బులు ఎలా జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చుపెట్టాలో వారికి తెలుసు. అంతేకాదు వ‌స్తువుల్ని విక్ర‌యించ‌డంలోనూ వారు నైపుణ్యం సాధించారు."

బాల కార్మిక వ్య‌వ‌స్థపైనున్న నిషేధాన్ని ఎత్తివేయాల‌ని వాదిస్తున్న‌వారిలో కొంద‌రు బాల కార్మికులు ఉన్నారు. బాల కార్మిక చ‌ట్టాలు త‌మ హ‌క్కుల‌ను కాల రాస్తున్నాయ‌ని వారు వాదిస్తున్నారు.

ఫిలిప్పీన్స్‌లో ఆడుకుంటున్న బాలలు

ఫొటో సోర్స్,GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

2000-2016 మధ్య కాలంలో దాదాపు 9.5 కోట్ల మంది పిల్లలు పని నుంచి విముక్తి పొందారు.

"అలా చేయ‌డంలో అర్థంలేదు"

అయితే, బాల కార్మిక వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఏ నిబంధ‌నా నిరుగార‌కూడ‌ద‌ని ఐఎల్‌వోకు చెందిన బెంజ‌మిన్ స్మిత్ అంటున్నారు.

ప్ర‌పంచం‌లోని ఒక్క చిన్నారి కూడా బాల కార్మిక వ్య‌వ‌స్థ పాలిట ప‌డ‌కుండా అడ్డుకోవ‌డం అసాధ్య‌మ‌ని ఆయ‌న అంగీక‌రించారు. మ‌రోవైపు పేద దేశాల్లో ఇది చిన్నారుల‌కు జీవన ఆధారం కావొచ్చ‌ని కూడా అన్నారు. అయితే, ప్ర‌స్తుత చ‌ట్టాల్లో మాత్రం ఎలాంటి మార్పులూ చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

"కొంత మంది చిన్నారులు త‌ప్ప‌క ప‌నిచేయాల్సిన ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని మాకు తెలుసు. వారు పనిచేస్తేనే వారి కుటుంబం క‌డుపు నిండుతుంది. ఆ విషయాన్ని మేమూ ఒప్పుకుంటున్నాం."

"అయితే వారి కోస‌మ‌ని ప్ర‌పంచంలో మిగ‌తా చిన్నారుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న చ‌ట్టాల‌ను నీరు గార్చ‌కూడ‌దు."

"బాల కార్మిక వ్య‌వ‌స్థ పేద‌రికాన్ని మ‌రింత పెంచుతుంది. పిల్ల‌ల బాల్యాన్నీ దోపిడీ చేస్తుంది."

రఘు అరెస్టుపై జాతీయ బీసీ కమిషన్ సీరియస్- ఢిల్లీకి రావాల‌ని ఎస్పీ, క‌లెక్ట‌ర్‌కు ఆదేశం

హైదరాబాద్ : 11/06/2021

రఘు అరెస్టుపై జాతీయ బీసీ కమిషన్ సీరియస్- ఢిల్లీకి రావాల‌ని ఎస్పీ, క‌లెక్ట‌ర్‌కు ఆదేశం

రఘు అరెస్టుపై జాతీయ బీసీ కమిషన్ సీరియస్- ఢిల్లీకి రావాల‌ని ఎస్పీ, క‌లెక్ట‌ర్‌కు ఆదేశం 

తొలివెలుగు జ‌ర్న‌లిస్టు ర‌ఘును అరెస్ట్ చేసిన తీరుపై జాతీయ బీసీ క‌మిష‌న్ నిప్పులు చెరిగింది. ర‌ఘు ఓ తీవ్రవాది అయిన‌ట్టుగా రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసి, ఆపై అరెస్ట్ చేసిన‌ట్టుగా ప్ర‌క‌టించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. ఈ వ్య‌వ‌హారంపై పోలీసుల‌కు జాతీయ బీసీ క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది. సూర్యాపేట‌ జిల్లా SP, జిల్లా కలెక్టర్ ఈ నెల 21న‌ ఢిల్లీకి రావాలని ఆదేశించింది.

తెలంగాణలో మానవ హక్కులు లేవా అంటూ ప్ర‌భుత్వాన్ని ఘాటుగా ప్ర‌శ్నించింది జాతీయ బీసీ క‌మిష‌న్. తెలంగాణ పోలీసులు.. ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నార‌ని.. ఇది ఏమాత్రం మంచి పరిణామం కాద‌ని హిత‌వు ప‌లికింది. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ పాలన కొనసాగించగలరా అని ప్ర‌శ్నించింది. జర్నలిస్టులను వీధి రౌడీలుగా బావిస్తున్నారా అంటూ నిల‌దీసింది. పోలీసులు ఇలా వ్యవహరించటం సిగ్గుచేటు అని మండిప‌డింది. చట్టాన్ని రక్షించాల్సిన వారే అడ్డదారిలో వెళ్ల‌టం ఆ ప్రజాస్వామికమ‌ని వ్యాఖ్యానించింది. కేసులో ముద్దాయిగా ఉంటే నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయొచ్చని.. కానీ సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను భయబ్రాంతుల‌కు గురిచేసేలా పోలీసులు వ్య‌వ‌హ‌రించాని ఆక్షేపించింది.

తెలంగాణ‌లో ఇలాంటివే అనేక కేసులు త‌మ దృష్టికి వచ్చాయ‌ని చెప్పింది. ఆదాబ్ హైద‌రాబాద్ ప్ర‌తినిధి ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు ఖమ్మంలో మార్నింగ్ వాకింగ్ చేస్తుండ‌గా కిడ్నాప్ చేసి, అరెస్ట్ చేశార‌ని జాతీయ బీసీ క‌మిష‌న్ గుర్తు చేసింది. అదే రోజు కొల్లాపూర్ అవుట రాజశేఖర్ అనే జ‌ర్న‌లిస్టును కూడా అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టిన సంగ‌తిని నోటీసులో ప్ర‌స్తావించింది. ఇక పెబ్బేరులో మందడి చిరంజీవిపై ఇలాంటివే అక్రమ కేసులు ఉన్నాయ‌ని తెలిపింది.


తొలివెలుగు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)

Hyderabad: Young techie helps Covid-hit with logistics and essentials

Hyderabad :11/06/2021

Hyderabad: Young techie helps Covid-hit with logistics and essentials

Syed Akbar | TNN | Updated: Jun 11, 2021, 08:15 IST
TNN
This pandemic has devastated many lives... The digital presence of the ecosystem is helping us bridge the most critical and widest gap among patients, hospitals, pharma industry and government —T Sowmya | IT PROFESSIONAL

HYDERABAD: T Sowmya, a young 

techie

 with a software giant, has been arranging logistics for 

Covid-19

 patients post discharge. She is also helping Covid-19 widows set up sources of income, coordinating tele consultations and supplying medicines and food. The most fulfilling experience for Sowmya was when she helped a pregnant woman from a village far away to deliver her baby in Hyderabad pre-empting complications.


“This pandemic has devastated many lives. The feeling of waking up every day to news of death in known circles, the cries of help by the needy, helplessness of scores of people due to lack of awareness, alternative measures, finances and health support system moved me. The digital presence of the ecosystem is helping us bridge the most critical and widest gap among patients, hospitals, pharma industry and government,” Sowmya said.


She has been donating medical essentials to Covid-19 hospitals offering free treatment for the poor (Aakar Asha Hospital, Kukatpally) and orphanages (Amma Nanna Anadha Ashramam for mentally challenged senior citizens at Choutuppal) and extending monetary support to Covid-hit families. She also coordinates among government, pharma distributors and patients’ attendants for life-saving drugs.


Sowmya told TOI that the most rewarding experience for her was to help a pregnant woman deliver baby in Hyderabad ensuring that there are no complications. “When the father of the baby called and gave the good news, there were no limits to my joy. Of course, this wouldn’t have been possible without the support of MLC K Kavitha and strategic intervention,” she said.


Soumya juggles between household chores, taking care of her parents, meeting stringent deadlines at work to ensuring round-the-clock service to Covid-19 affected people daily. “It is a very challenging, yet fulfilling experience,” she said.

Thursday, June 10, 2021

బీహార్‌లో డీఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళ

హైదరాబాద్ : 11/06/2021

బీహార్‌లో డీఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళ

నమస్తే తెలంగాణ మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)
బీహార్‌లో డీఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళ

పట్నా: బీహార్‌లో డీఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళగా రజియా సుల్తాన్‌ రికార్డుల్లో నిలిచారు. గోపాల్‌గంజ్‌ జిల్లాలోని హతువా గ్రామానికి చెందిన ఆమె 64వ బీహార్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ ఎగ్జామ్స్‌లో (బీపీఎస్సీ) బీహార్‌ పోలీస్‌ ఫోర్స్‌లో డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీలుగా ఎంపికైన 40 మందిలో రజియ ఒకరు. ప్రస్తుతం ఆమె బీహార్‌ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

రజియాది గోపాల్‌గంజ్‌ అయినప్పటికీ విద్యాభ్యాసం మాత్రం జార్ఖండ్‌లోని బొకారోలో పూర్తయ్యింది. ఆమె తండ్రి మహమ్మద్‌ అస్లామ్‌ అన్సారీ బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో స్టెనోగ్రాఫర్‌గా పనిచేశారు. దీంతో ఆమె బొకారోలో పాఠశాల విద్య పూర్తిచేశారు. జోధ్‌పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ కంప్లీట్‌చేశారు.

చిన్నప్పటి నుంచి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాయాలన్నది తన కల అని, డీఎస్పీగా ఎంపికవ్వడంతో తన కల సాకారమయ్యిందని రజియా చెప్పారు. 2017లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను బీపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాని తెలిపారు. పోలీస్‌ అధికారిగా పనిచేయనుండటం చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు సరైన న్యాయం అందని సందర్భాలు చాలా ఉన్నాయి, అందులో ముఖ్యంగా మహిళలు ఉన్నారు. మహిళలు తమకు జరిగే అన్యాయాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనకడుగువేస్తున్నారు. ఇలాంటి కేసులు నమోదయ్యేలా తనవంతుగా ప్రయత్నిస్తానని చెప్పారు.