Saturday, May 22, 2021

ఆచరణ సాధ్యం కానీ తీర్పులు వద్దు: సుప్రీం కోర్టు

హైదరాబాద్ : 22/05/2021

ఆచరణ సాధ్యం కానీ తీర్పులు వద్దు: సుప్రీం కోర్టు

సాక్షి మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)

సాక్షి, న్యూఢిల్లీ: ఆచరణ సాధ్యం కానీ, అమలు చేయడం వీలుకానీ ఆదేశాలు ఇవ్వొద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం కింది కోర్టులకు సూచించింది. ఇటీవల అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై  సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.  ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో...  సుమోటోగా స్వీకరించింది అలహబాద్‌ హైకోర్టు.  విచారణ పూర్తైన తర్వాత  ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది.

నెల రోజుల వ్యవధిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న ప్రతీ గ్రామానికి ఐసీయూ సౌకర్యం కలిగిన రెండు అంబులెన్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పాటు నాలుగు నెలల వ్యవధిలో రాష్ట్రంలో అన్ని నర్సింగ్‌ హోమ్‌లలో ఉన్న బెడ్లకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించాలంది. నిష్పత్తికి తగ్గట్టుగా ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయాలంది.

సుప్రీంలో అప్పీల్‌
హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకి వెళ్లింది ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం వాస్తవంలో సాధ్యం కాదని పేర్కొంది. నెల నుంచి నాలుగు నెలల సమయం ఇచ్చి ఇన్ని అద్భుతాలు చేయమంటే మా వల్ల కాదంటూ వాదించింది. కోర్టు చేసిన వ్యాఖ్యల వల్ల ఉత్తర ప్రదేశ్‌లో ఆరోగ్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతింటోందని వివరించింది. 

అలా వద్దు
ఉత్తర ప్రదేశ్‌ వాదనలు విన్న తర్వాత... ఆచరణలో సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వొద్దంటూ అలహబాద్‌ హైకోర్టుకు సూచించింది సుప్రీం కోర్టు. కరోనాతో విలవిలాడుతున్న ప్రజల కష్టాలను చూసి కోర్టు స్పందించి ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పు పట్టలేమంది. అయితే కోర్టు  వెలువరించే ఆదేశాలు ఆచరణలో సాధ్యమయ్యేవిగా ఉండాలంటూ తేల్చి చెప్పింది. ఆచరణలో సాధ్యం కానీ హామీలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉందని పేర్కొంది.

Friday, May 21, 2021

వైవిధ్యం లేకపోతే వినాశమే!

  • నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
వైవిధ్యం లేకపోతే వినాశమే!

నమస్తే తెలంగాణ మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)

జీవ వైవిధ్యం దెబ్బతింటే పర్యావరణానికే ముప్పు ఏర్పడుతుంది. జీవుల మధ్య ఆహారగొలుసు దెబ్బతిని ప్రాణులన్నింటికీ ప్రమాదం వాటిల్లుతుంది. భూమిపై ఆహారపంటలు, ఫలాలు, ఔషధాలు ఇచ్చే 90 శాతం మొక్కలకు కీటకాలు, పక్షులు పరాగ సంపర్క సహకారాలుగా ఉంటాయి. మొక్కలు నశిస్తే వాటిమీద ఆధారపడిన జంతువులు నశిస్తాయి. పక్షులు నశిస్తే మొక్కలు పెరగడం, పంటలు పండటం ఆగిపోతుంది. అంతిమంగా ఏ జీవికైనా ఆహారోత్పత్తి దెబ్బతిని మనుషుల మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.

నాగరికత నేర్చిన మానవుడి విచక్షణారాహిత్యం వల్ల ఈ జీవ వైవిధ్యం ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నది. ఏటా కీటక జనాభాలో 2.5 శాతం క్షీణత కలుగుతున్నది. ఫలితంగా అనేకచోట్ల పంటల దిగుబడి తగ్గుతున్నదని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. పర్యావరణ సమతుల్యత అంటే ప్రకృతి వనరులనే కాకుండా, అమూల్యమైన జంతుజాలాన్ని కాపాడుకోవడం. జీవ వైవిధ్యం జాతీయ సంపదకు సూచిక వంటిది. మానవ వికాసానికి చోదకశక్తిగా పనిచేస్తుంది. ప్రపంచంలో 2.3 శాతం భూభాగంలో 12 శాతం జీవ వైవిధ్య జాతులకు నిలయంగా ఉన్న భారత్‌లో కూడా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 60 శాతం ఉభయచరాలు, 47 శాతం సరీసృపాలు ప్రమాదపుటంచుకు చేరుకున్నాయి.

కొన్ని జీవరాసులు నశించినా వాటి ప్రభావం అన్ని జీవుల మీద పడుతుంది. దాంతో పర్యావరణం దెబ్బతిని ఆ దుష్ఫలితం మనుషుల మీద పడుతుంది. ఏ దేశంలోనైతే జీవ వైవిధ్యం కాపాడబడుతుందో ఆ దేశం సమృద్ధిగా ఉంటుంది. జీవ వైవిధ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం అడవులపై మనిషి దృష్టిపడటమే. అడవుల్లో అణువిద్యుత్‌ కేంద్రాలు, ఖనిజాల తవ్వకం జరగటం వల్ల జంతుజాలం కనుమరుగవుతున్నది. ప్రతి జీవికి జీవించే హక్కున్నది. కానీ ఇష్టానుసారంగా చేపలు, ఇతర జంతువుల వేట, మితిమీరిన ప్లాస్టిక్‌ వాడకం, వ్యవసాయ ఉత్పత్తుల కోసం యంత్రాల వాడకం, శిలాజ ఇంధనాలను మండించడం, గనుల తవ్వకం, కర్బన ఉద్గారాలు జీవ వైవిధ్య విధ్వంసానికి ప్రధాన కారణాలు.

సుందర్‌లాల్‌ బహుగుణ నిర్వహించిన చిప్కో ఉద్యమం, పర్యావరణ పరిరక్షణకు సాగిన ఉద్యమాలన్నింటికీ తలమానికమైనది. స్వీడన్‌ బాలిక గ్రేటా తంబెర్గ్‌ ‘వాయిస్‌ ఫర్‌ ది ప్లానెట్‌ అండ్‌ ది స్ట్రెక్‌ ఫర్‌ ైక్లెమెట్‌’ నినాదంతో నిర్వహించిన జీవ వైవిధ్య రక్షణ ఉద్యమం ఆ దేశంలో పర్యావరణ అనుకూల విధానాలు అమలయ్యేలా చేసింది. గ్రెటా తంబెర్గ్‌, వందనా శివ, మేథాపాట్కర్‌, వనజీవి రామయ్య దారిలో పౌర సమాజం జీవ వైవిధ్య రక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచమంతటా ఏటా 10 వేల జాతులు లేదా రోజుకు 27 జాతులు అంతరించిపోతున్నాయని విల్సన్‌ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. వృక్ష, జంతు, పక్షిజాతులు అంతరించిపోతే మానవ మనుగడకు ప్రమాదం. ఇప్పటికే ఋతువులు గతితప్పుతున్నాయి. జీవనదులు ఎండిపోతున్నాయి. ప్లాస్టిక్‌ వాడకాన్ని నిలిపివేయటం ద్వారా పర్యావరణాన్ని తద్వారా భూగోళాన్ని రక్షించుకోవాలని నిపుణులు పిలుపునిస్తున్నారు. ప్లాస్టిక్‌ను దూరం పెట్టి, మన ఆరోగ్యంతో పాటు పుడమి తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కృషిచేయాలి. 2030 నాటికి కనీసం 30 శాతం భూమి ఉపరితలాన్ని రక్షించాలని పథకాలు రూపొందిస్తున్నారు. భూమి ఉపరితలం రక్షించబడితే దీని మీద ఆధారపడిన వృక్ష, జంతుజాతులు కూడా రక్షించబడతాయి. ఇందులో భాగంగానే అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం సంరక్షణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. వాటి సంతతిని వృద్ధిచేసి జీవ వైవిధ్యానికి పాటుపడుతున్నారు.

జీవ వైవిధ్య దినోత్సవం జరుపాలని ఐరాస తీర్మానించింది. మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. ఏటా ఒక్కొక్క నినాదంతో ఈ దినోత్సవాన్ని జరుపుతారు. ‘మేం కూడా పరిష్కారంలో భాగమే’ అనే థీమ్‌ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. మానవ భవిష్యత్తుకు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తారు. మన దేశంలో 1,00,696 జంతు జాతులున్నాయి. 48,653 జాతుల మొక్కలున్నాయి. ఇవి కనుమరుగు కాకుండా 2002లోనే దేశంలో ప్రత్యేక జీవవైవిధ్య చట్టం వచ్చింది. దీంతో విచక్షణారహితంగా చెట్లను నరకటం, క్రిమి సంహారాల ఇష్టానుసార వినియోగం, అడవుల్లోని వన్యప్రాణులను, సముద్ర జలాల్లో జలచరాల వేటను కట్టడి చేశారు. మనిషి మనుగడకు ఇతర జీవరాసుల అవసరం ఎంతైనా ఉంది. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఈ విషయం తెలియజేయడమే జీవ వైవిధ్య దినోత్సవ ముఖ్య ఉద్దేశం.

DRDO develops Covid-19 antibody detection kit

Hyderabad : 22/05/2021

DRDO develops Covid-19 antibody detection kit


The Hans India (Twitter)

DRDO develops Covid-19 antibody detection kit

AddThis Website Tools
New Delhi: The Defence Research and Development Organisation (DRDO) has developed an antibody detection kit known as Dipcovan, which is expected to be available at Rs 75 per test in the market from June first week onwards.

The kit has been developed by the Defence Institute of Physiology and Allied Sciences (DIPAS) of DRDO. "The antibody detection-based kit Dipcovan is the DIPAS-VDx Covid-19 IgG Antibody Microwell ELISA for sero-surveillance," the institution said.


The kit can detect both spike as well as nucleocapsid (S&N) proteins of SARS-CoV-2 virus with a high sensitivity of 97 per cent and specificity of 99 per cent.

The kit has been developed in association with Vanguard Diagnostics Pvt Ltd, a development and manufacturing diagnostics company based in New Delhi.

The kit has been developed indigenously by the scientists, followed by extensive validation on more than 1,000 patient samples at various Covid designated hospitals in Delhi.

కరోనా: ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేత

హైదరాబాద్ : 21/05/2021

కరోనా: ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేత

సాక్షి మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)


సాక్షి, నెల్లూరు : కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని ఈరోజు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి  చేపట్టారు. మందుకోసం జనం పోటెత్తడంతో మందు పంపిణీ కష్టంగా మారింది. భౌతిక దూరం లేకుండా క్యూ లైన్‌లు కడుతుండటంతో తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తూనట్టు నిర్వాహకులు ప్రకటించారు. మళ్ళీ పంపిణీ తేదీ పకటిస్తామని నిర్వహకులు తెలిపారు. అయితే రేపటి నుండి విశాలామైన గ్రౌండ్‌లో  ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకాని ఆదేశించారు.

 


Thursday, May 20, 2021

నిల‌క‌డ‌గానే దేశంలో క‌రోనా కేసులు… మ‌ర‌ణాలే అస‌లు స‌మ‌స్య‌

హైదరాబాద్ : 21/05/2021

నిల‌క‌డ‌గానే దేశంలో క‌రోనా కేసులు… మ‌ర‌ణాలే అస‌లు స‌మ‌స్య‌... (తొలివెలుగు మీడియా సౌజన్యంతో)ట్విట్టర్ 

దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు ఆగ‌టం లేదు. గురువారం కాస్త త‌గ్గిన‌ట్లే త‌గ్గిన క‌రోనా మృతుల సంఖ్య ఒక్క‌సారిగా పెరిగిపోయింది. తాజాగా దేశంలో మ‌రో 4,209మంది వైర‌స్ కు బ‌ల‌య్యారు. ఇక కొత్త‌గా 2,59,591కేసులు న‌మోదుకాగా, మ‌రో 3,57,295మంది క‌రోనాను జ‌యించారు.

దేశంలో ప్ర‌స్తుతం 30,27,925యాక్టివ్ కేసులున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య 2,91,331కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 2,60,31,991మందికి వైర‌స్ సోక‌గా, 2,27,12,735మంది డిశ్చార్జ్ అయ్యారు.

19,18,79,503మంది వ్యాక్సిన్ పంపిణీ జ‌రిగింది.

ఇక దేశంలో అత్య‌ధికంగా త‌మిళ‌నాడులో 35,579, కేర‌ళ 30,491, మ‌హారాష్ట్ర 29,911, క‌ర్ణాట‌క 28,869, ఏపీలో 22,610కేసులొచ్చాయి. దేశంలో వ‌చ్చిన కొత్త కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల్లోనే 56శాతం కేసులు న‌మోద‌య్యాయి.

Wednesday, May 19, 2021

కేసీఆర్ రాకతో వెంటిలేటర్‌పై ఉన్న రోగికూడా లేచి మాట్లాడాడు

సిబ్బందిలో కొత్త ఉత్సాహం
  • సిబ్బందిలో కొత్త ఉత్సాహం

  • సీఎం సందర్శన మనోనిబ్బరాన్ని నింపింది
  • వెంటిలేటర్‌పై ఉన్న రోగికూడా లేచి మాట్లాడాడు
  • గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు

హైదరాబాద్‌ సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ)ట్విట్టర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గాంధీ దవాఖాన సందర్శన వైద్యులు, సిబ్బందిలో మనో నిబ్బరాన్ని, రోగుల్లో భరోసాను నింపిందని దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు పేర్కొన్నారు. సీఎం వస్తున్నారనగానే వైద్య సిబ్బందిలో కొత్త ఉత్తేజం కనిపించిందని చెప్పారు. అందరూ సంతోషం వ్యక్తంచేశారని, ఇక రోగుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన ఘటనగా వారు ఫీలయ్యారని.. ఒక సీఎం వచ్చి ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న రోగి యోగక్షేమాలు అడగడం నిజంగా ఊహించనిదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను చూడగానే సీ-టాప్‌ వెంటిలెటర్‌పై ఉన్న పేషెంట్లు కూడా గుర్తుపట్టడం, వారంతట వారే లేచి మాట్లాడటం.. చేతులెత్తి నమస్కరించడం చాలా ఆశ్చర్యమేసిందని అన్నారు. సాధారణంగా వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్స్‌ లేవలేరని, సీఎంను చూడగానే ఎైగ్జెట్‌మెంట్‌కు గురైనవారు చాలా ఆనందించారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ దవాఖానలోని ఎమర్జెన్సీ, జనరల్‌ వార్డులన్నీ కలియతిరిగారు. వైద్యసిబ్బంది, నర్సులు, స్వీపర్లు, ఇలా ప్రతిఒక్కరితోనూ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని, దానికి సంబంధించిన పూర్తివివరాలను అందజేయాలని సూచించారని తెలిపారు. రెండ్రోజుల్లో వివరాలను సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తానని డాక్టర్‌ రాజారావు తెలిపారు.

Plea in SC for President’s rule in West Bengal

Hyderabad : 20/05/2021

Plea in SC for President’s rule in West Bengal

A view of the Supreme Court of India. FileA view of the Supreme Court of India. File | Photo Credit: S. Subramanium
Legal CorrespondentNEW DELHI  THE HINDU (Twitter)
It cites reports of post-poll murder of BJP workers, destruction of property allegedly by Trinamool Congress “goons”

A lawyer has asked the Supreme Court to “direct” the Centre to advise President’s rule in West Bengal on the ground of failure of the constitutional machinery, following reports about post-poll murders of BJP workers and wanton destruction of property allegedly by ruling Trinamool Congress “goons”.

Advocate Ghanshyam Upadhyay said the apex court should “direct/request” the West Bengal Governor to give a detailed report on the “law and order situation in the State of West Bengal and failure of constitutional machineries in the State”.

The court, if satisfied, should then “be pleased to hold and declare that there is no rule of law in the State and there is complete failure of constitutional machinery”.

The petition also urged the apex court to direct the West Bengal government to immediately transfer the “killing” of 16 “perceived” BJP workers and the destruction of their houses to a Special Investigation Team for a time-bound investigation monitored by the Supreme Court.

The SIT should file periodic reports on the investigation before the apex court, Mr. Upadhyay underlined.

“Massacre killings of suspected BJP workers/supporters and destruction of their houses/properties have taken place soon after the election result were declared… The remaining workers/supporters of BJP and their families have been left with no other option than to leave their houses/residences and hide themselves to save their lives and limbs. Media reports have further revealed till filing of the instant petition that the incidents of killing of BJP workers and destruction of their properties by the people of TMC are still going on with complete impunity…” the petition said.

On Tuesday, a Vacation Bench of the Supreme Court had asked the State government to respond to a plea for a CBI probe into the death of two men, alleged to be BJP workers, by their families. The Bench had scheduled the next hearing in that case on May 25.