Wednesday, January 13, 2021

తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారి ముత్యాల ముగ్గు కాంటెస్ట్

హైదరాబాద్ : 14/01/2021

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న *మహిళలకు* సంక్రాంతి సందర్భంగా సువర్ణ అవకాశం తెలుగు ఎన్ఆర్ఐ  రేడియో వారి ముత్యాల ముగ్గు కాంటెస్ట్ లో పాల్గొనండి  ఎన్నో  ఆకర్షణీయమైన  బహుమతులు పొందండి . 

దీనికి మీరు చేయవలసిందల్లా సంక్రాంతి పండుగ రోజు, మీరు మీ ఇంటి ముందు ముగ్గు వేసి, ముగ్గు ప్రక్కన

 *తెలుగు ఎన్ ఆర్ ఐ  రేడియో(తెలుగు వారి గుండె చప్పుడు)*

అని వ్రాయండి.
  
ఫోటో తీసి వాట్సాప్ చేయండి  +91-9849410062

Please share 🙏🙏
#telugunriradio 
www.Telugunriradio.com

https://prajasankalpam1.blogspot.com/

Plea for saving Devuni Kunta Cheruvu from encroachers heard

Hyderabad : 13/01/2021

Plea for saving Devuni Kunta Cheruvu from encroachers heard Hyderabad: The High Court on Friday issued notices to the Chief Secretary, Principal Secretaries of Municipal Administration, Revenue and Home Departments, along with HMDA, GHMC and the Lake Protection Committees and the District Collector, Hyderabad regarding a suo moto cognizance of a letter alleging the encroachment of Devuni Kunta Cheruvu, located in Asifnagar and solid waste collected from different parts of the city being dumped into it. Also Read - Justice Hima Kohli takes oath as CJ of Telangana high court ADVERTISEMENTS The High Court division bench headed by Chief Justice Hima Kohli and Justice MS Ramachandra Rao has given four weeks' time to the government officials concerned to file their responses on the suo moto. The Court appointed Avinash Desai, standing counsel for the State Election Commission, as the Amicus Curiae in the plea to assist the Court in adjudicating it. Also Read - Telangana High Court dismisses plea seeking appointment of women panel chief The Bench directed all the officials concerned cited to file a status report duly responding to the content of the letter furnished by the petitioner, Dr Lubna Sarwath, urging to restore the Devuni Kunta/Humayun Kunta Cheruvu in Asifnagar, and increase the storage capacity by evicting encroachments besides dredging the lake and restoring the inflow and outflow channels and if necessary, make new channels for the capture of rainwater. Further, the plea contended that the efforts were not made by the authorities in taking up dredging to remove the silt in the Cheruvu. Such non-action on the part of the officials was seriously affecting the lake and to evict the encroachers from the lake area. The matter would be heard next after four weeks.

https://www.thehansindia.com/telangana/sankranti-vacation-hc-to-remain-closed-till-jan-17-666035

Tuesday, January 12, 2021

మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల డబ్బు దుర్వినియోగం

హైదరాబాద్ : 13/01/2021

*తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు NVSS ప్రభాకర్ అన్న గారికి నమస్కారం 🙏*

అన్న గారు మూసీ సుందరీకరణ పేరుతో ప్రజల డబ్బును ప్రజాప్రతినిధులు & అవినీతి అధికారులు  దుర్వినియోగం చేస్తున్నారు. రామంతాపూర్ బాగాయత్ 95ఎకరాల భూమి డీనోటిఫికేషన్ విషయంలో HMDA అధికారులు ప్రభుత్వానికి ఏమి సమాధానం చెప్పారు....వీటి అన్నింటి మీద మీరు ప్రజాప్రతినిధులు & అధికారులు మరీ ముఖ్యంగా స్థానిక ప్రజలతో బహిరంగ చర్చా వేదిక మూసీ పరివాహక ప్రాంతంలో పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. వేలకోట్ల ప్రజల డబ్బును దోచుకుంటున్న ప్రభుత్వాన్ని మరియు ప్రజాప్రతినిధుల భరతం ఎప్పుడు పడతారు ??

*Copy to Group link Media*

 బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం వార్తలు

*మాజీ మంత్రివర్యులు (తాండూర్ మాజీ శాసనసభ్యులు) పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి నమస్కారం 🙏*

*అన్న గారు ఈరోజు మీరు చెంగోల్ గ్రామంలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం... అయితే మీతో ఒక వాస్తవ విషయం ఈ సందర్బంగా తెలియచేయాలని అనుకుంటున్నాను, గత నెలలో ప్రజా సంకల్పం బృందం రైతు సమస్యలను  ప్రభుత్వము ద్రుష్టికి తీసుకెళ్లాలని  వికారాబాద్ జిల్లా పర్యటనలో వున్నప్పుడు తాండూర్ నియోజకవర్గం లో కూడా పర్యటిచడం జరిగింది. అప్పుడు తాండూర్ పట్టణంలో  కొన్ని సమస్యలు ప్రజలు మా ద్రుష్టికి తీసుకొచ్చారు. అవి ఏమిటి అంటే పట్టణంలోని ప్రధాన రహదారి అయినటువంటి పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి చించొలి రహదారి మొత్తం అధ్వన్నంగా అయిపొయి భారీ సిమెంట్ వాహనాలతో మొత్తం దుమ్ము దూళి తో స్థానిక ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురికావడం అలాగే రోగాల భారిన పడడం చూసి చాలా బాధేసింది. అప్పుడు మీకు మరియు ప్రస్తుత శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారి ద్రుష్టికి https://youtu.be/hp2Qhnbh_Hw ఈ వాస్తవాలతో కూడిన వీడియో విశ్లేషణ మీ ద్రుష్టికి సోషల్ మీడియా ద్వారా తెలియపరచడం జరిగింది. ఈరోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం మీరు అదే రహదారి గుండా వెళ్లి చెంగోల్ లో కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడైనా మీరు ప్రత్యక్షంగా చూసి వుంటారు. దయచేసి ఈ సమస్య పరిష్కారం మీరే చేయాలి అని ప్రజా సంకల్పం & link Media ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాము*

Note : మహేందర్ రెడ్డి అన్నగారి PA అంజిల్ రెడ్డి గారు మీరు తక్షణమే అన్న గారికి చెప్పి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా బాధ్యత తీసుకోవాలి 👍🙏

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Monday, January 11, 2021

చెరువులను కాపాడడంలో ప్రభుత్వం మరియు అధికారుల వైఫల్యం & నిర్లక్ష్యం

హైదరాబాద్ : 12/01/2021

వరదల నివారణకు చర్యలేవి ??. అన్నారు కరెక్టే అసలు MLA గారు కార్పొరేటర్ మేడం గారు చెరువులను పర్యావరణము మరియు కబ్జాలు కాకుండా కాపాడడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అనడం కరెక్ట్ కాదా చెప్పండి. మొన్నటి వరదలు రాకముందు గతంలో వచ్చిన వర్షాలకు కూడా ప్రజలు ఇబ్బందులకు గురిఅయ్యారు అప్పుడు అఘమేఘాల మీద మేయర్ గారు వచ్చారు హామీలు ఇచ్చారు వెళ్లారు.. ఏమైంది అంటే ఏమి పరిష్కారం కాలేదు.. మొన్నటి వరదలకు స్వయంగా పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు & ఉపముఖ్యమంత్రి  మరియు మినిస్టర్లు వచ్చారు హడావిడి చేశారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు వెళ్లారు.. మళ్ళీ అదే సీన్ రిపీట్.. అంటే ఇక్కడ ఎవరు కూడా ప్రజాప్రయోజనాలకోసం ఆలోచించడం లేదు అని అందరికి తెలిసిపోయింది.

*చెరువులను కాపాడుకుందాం అనే సంకల్పంతో ప్రజాప్రయోజనాలకోసం ఉద్యమం చేపట్టిన SOUL మాజీ కన్వీనర్ Dr లుబ్న సర్వత్ మేడం గారు అన్ని వాస్తవ ఆధారాలను ప్రభుత్వఅధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని మేడం గారు ఆశ్రయించాల్సి వచ్చింది అప్పడు న్యాయస్థానం ప్రభుత్వానికి మరియు అధికారులకు చివాట్లు పెట్టినా బుద్ధిరాలేదు అంటేనే అర్ధం అవుతుంది ప్రజల మీద ప్రభుత్వానికి ఎంత ప్రేమ వుందో !!.*

*ఈ సమస్య పరిష్కారంలో GHMC & రెవిన్యూ & HMDA & ఇరిగేషన్ శాఖ అధికారులు వైఫల్యం మరియు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి వీరి అందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపియాలి అప్పుడు తెలుస్తుంది అధికారులకు ప్రజల బాధలు ఏంటో. మొత్తంగా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని తక్షణమే పనులు చేపట్టాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము లేకపోతే రాబోయే రోజుల్లో ఉన్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందో వారు ఊహించలేరు... జాగ్రత్త 👍*

Note :
*కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తుంది ప్రజా సంకల్పం & link Media మీరు ప్రజా ప్రయోజనాలకోసమే పని చేయండి లేకపోతే మా సభ్యులు ఎవరినీ వదిలిపెట్టరు. నీతి నిజాయితీగా ప్రజలకోసం మీరు పని చేయాలి ఎన్నికల సమయంలో మీరు ప్రతిజ్ఞలు చేశారు వాటిని విస్మరిస్తే జాగ్రత్త !!*

*హెచ్చరిక ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలంగాణ లో నవశకం మీడియా ఆవీర్బవించింది మీరు  అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తే చాలు మీ మీద న్యాయపరమైన చర్యలు ఉంటాయి మరిచిపోకండి*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

తెలంగాణలో మండలాల పునర్విభజన ఏ ప్రాతిపధికతన జరగాలి

హైదరాబాద్ : 11/01/2021

*గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇచ్చిన విశ్లేషణను అందరు ఒక్కసారి చదవాలి 🙏*

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియను కేవలం జిల్లాల విభజనే కాదని, *మండలాల పునర్విభజనగా కూడా పరిగణించాల్సి వుంటుందని* ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జిల్లా కలెక్టర్లకు సూచించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం ప్రధాన లక్ష్యంగా చేపట్టిన జిల్లాల, మండలాల పునర్విభజన క్రమంలో కొనసాగుతున్న కసరత్తు, పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.హైదరాబాద్  మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గత కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కార్యాచరణ ఎంత వరకు వచ్చిందో ఆరా తీశారు.

పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

తెలంగాణ అభివృద్ధి చక్రవడ్డీ మాదిరి రెట్టింపు అవుతూ అభివృద్ధి వేగం పెరుగుతూ వుంటుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. *పెరిగే అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో వుంచుకుని పాలనా ఫలాలు ప్రజలకు క్షేత్ర స్థాయిలోకి చేరుకునేలా ప్రణాళికలు రచించడమే ప్రజా ప్రభుత్వం మీదున్న బాధ్యతగా సిఎం అభివర్ణించారు*. పరిపాలన ప్రజలకు మరింత చేరువలో వచ్చినప్పుడే అభివృద్ది? ఫలాలు అందరికీ సమానంగా అందుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజన అందులో భాగమేనని సిఎం పునరుద్ఘాటించారు.

ప్రస్తుతం తాగునీరు, సాగునీరు పునరుద్ధరణే లక్ష్యంగా కొనసాగుతున్న అభివృది? సంక్షేమ కార్యక్రమాలు కొద్ది కాలంలోనే పూర్తవుతాయని పేర్కొన్న సిఎం తదనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఇప్పటినుంచే రూపకల్పన చేయాలన్నారు. ”2024 కల్లా ఐదు లక్షల కోట్లతో ఎంతో రిచ్‌ గా ఉంటాం. మరి ఆ రిసోర్సులన్ని ఎటుపోవాలె? తాగునీరు, సాగునీరు మీద యుద్ధం అయిపోతే తర్వాత పేదరికం కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఇబీసీల్లో ఉన్న ఒక్కొక్క పేద కుటుంబాన్ని టార్గెట్‌ చేసి అభివృది? చేస్తం” అని సిఎం తెలిపారు.

*కొత్తగా ఏర్పాటు చేయవలసిన మండలాల గురించి కలెక్టర్లు ఇప్పటిదాక చేసిన కసరత్తును ఒక్కో జిల్లా కలెక్టర్‌ నుంచి ఆరా తీశారు. ఆయా మండలాల్లో నివసిస్తున్న ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా వున్నాయి. వారితో మాట్లాడిండ్రా? స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో చర్చించిండ్రా? అని సిఎం కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.*

*మండల కేంద్రానికి దూరంగా వున్న గ్రామాలను గుర్తించి దగ్గరలో వున్న మండల కేంద్రానికి కలిపే సందర్భంలో ప్రజాభిప్రాయం ముఖ్యమన్నారు. ప్రస్తుత జిల్లా నుంచి పక్క జిల్లాకు పోయే మండలాలు ఏమైనా ఉన్నాయా? ఒక్క నియోజక వర్గం ఒకటికి మించి జిల్లాలో విస్తరించి ఉందా? ఉంటే ఎట్లా ఉన్నది? అక్కడి భౌగోళిక పరిస్థితులు ఏమిటి? అన్నీ సమీక్షించాలన్నారు. ఇవన్నీ సమీక్షించిన తరువాత పూర్తి స్థాయి మండలాల సంఖ్య అంచనా వేయడానికి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు.*

”మీరు మీ కసరత్తు పూర్తి చేయండి. మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కూర్చుని చర్చించండి. ఓ ఐడియాకు రండ్రి. *ఆ తర్వాత అభ్యంతరాల కోసం ప్రజా ప్రకటన ఇద్దాం. ఆతర్వాత చివరిగా నోటిఫికేషన్‌ జారీ అయితది.”* అని అన్నారు.

సుమారు 50 వేల నుంచి 60 వేల జనాభా వుండే ఒక మండలం ఏర్పాటు, సుమారు 20 మండలాలతో జిల్లా ఏర్పాటు, సుమారు లక్షన్నర జనాభాతో అర్బన్‌ మండలాల ఏర్పాటు, ఒక రెవిన్యూ డివిజన్‌ పరిధిలో 10 నుంచి 12 మండలాలు, రెండు అసెంబ్లి సెగ్మెంట్లు, ఒక అసెంబ్లి సెగ్మెంటుకు 5 నుంచి 6 మండలాలు వుండే విధంగా కసరత్తు చేయాలన్నారు.

*ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.*

ప్రస్తుతమున్న నియోజకవర్గాన్ని దృష్టిలో ఉంచుకొని కసరత్తు చేయనవసరంలేదు.
*బలవంతంగా తమను ఇతర మండలంలో కలిపారన్న భావన ప్రజలకు రాకుండా చూడాలి.ప్రజాక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నం కనుక ఆయా గ్రామాలను వివిధ మండలాలలో కలుపుతున్న, తీసివేస్తున్న సందర్భాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకుంటే బాగుంటుంది*.
పెద్ద మండలాలను రెండుగా చేసే అంశాలను పరిశీలించాలి.
*ప్రజల అవసరాలు, సెంటిమెంట్లను సమన్వయం చేసుకుంటూ శాస్త్రీయంగా నిర్ణయాలు తీసుకోవాలి.వ్యక్తుల అభిప్రాయాలు, రాజకీయ కోణంలో కాకుండా ప్రజాక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలుండాలి*.
మారుతున్న కాలంతో మారుతూ అభివృద్ధిని అందుకోవాలని, లేకుంటే తెలంగాణ ప్రగతి సాధ్యం కాదని ముఖ్యమంత్రి సూచించారు

*@తెలంగాణ మాస పత్రిక సౌజన్యంతో*

 బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Sunday, January 10, 2021

The biggest vaccination drive on the planet




Hyderabad : 11/01/2021

The biggest vaccination drive on the planet is going to take place as the Government of India has approved 2 vaccines for emergency use. 

1.3 billion people will be vaccinated in phases, beginning with our frontline health workers, the police and those above the age of 50 before the rest of the population.

While India’s Drugs Controller General, VG Somani, has hailed the vaccines as “100% safe”, the media has reported that some of our country’s eminent scientists, medical experts and health watchdogs are shocked at the “hasty authorisation” of the locally-made vaccine. The clinical trials that will prove its success haven’t been completed. The government has decided not to release this data.

As a citizen who may be vaccinated some day, you have every right to ask questions, seek answers and clarity. This is a matter that affects you and the people you care about.

We need to ask the Government of India to do the following:

1. Data on the safety of the vaccine to be publicised. 

2. Funds allocated for vaccination, including price of each dose, has to be declared publicly.

3. Insurance cover for all those being vaccinated. 

4. Ensure legal rights and protections for those taking a drug that is still in trial stage

5. Have a public database of adverse effects both short and long term
6. Enable self reporting
7. Declare a compensation and free treatment policy
8. Provide free legal aid to those who feel their adverse reaction is not addressed
9. Declare a limit of adverse effects and a mark of lack of efficacy beyond which the vaccine will be pulled out
10. Dissolve policy of legal indemnity to manufacturers
11. Form a committee of civil society members to monitor the process

12. At no point should the vaccine be made mandatory or linked to any schemes/ public facilities that deprive non-vaccinated people of the right or freedom guaranteed by Indian Constitution.


Narasimha Reddy Donthi

201, Aarthi Residency, Laxminagar Colony,
Saidabad, Hyderabad 500 059 (Telangana), India
Ph. 0091-40-24077804
Alternate e-mail: narasimha_donthi@yahoo.com
Twitter: @DonthiNreddy and check this: https://archive.org/details/@donthinreddy