Monday, January 11, 2021

చెరువులను కాపాడడంలో ప్రభుత్వం మరియు అధికారుల వైఫల్యం & నిర్లక్ష్యం

హైదరాబాద్ : 12/01/2021

వరదల నివారణకు చర్యలేవి ??. అన్నారు కరెక్టే అసలు MLA గారు కార్పొరేటర్ మేడం గారు చెరువులను పర్యావరణము మరియు కబ్జాలు కాకుండా కాపాడడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అనడం కరెక్ట్ కాదా చెప్పండి. మొన్నటి వరదలు రాకముందు గతంలో వచ్చిన వర్షాలకు కూడా ప్రజలు ఇబ్బందులకు గురిఅయ్యారు అప్పుడు అఘమేఘాల మీద మేయర్ గారు వచ్చారు హామీలు ఇచ్చారు వెళ్లారు.. ఏమైంది అంటే ఏమి పరిష్కారం కాలేదు.. మొన్నటి వరదలకు స్వయంగా పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు & ఉపముఖ్యమంత్రి  మరియు మినిస్టర్లు వచ్చారు హడావిడి చేశారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు వెళ్లారు.. మళ్ళీ అదే సీన్ రిపీట్.. అంటే ఇక్కడ ఎవరు కూడా ప్రజాప్రయోజనాలకోసం ఆలోచించడం లేదు అని అందరికి తెలిసిపోయింది.

*చెరువులను కాపాడుకుందాం అనే సంకల్పంతో ప్రజాప్రయోజనాలకోసం ఉద్యమం చేపట్టిన SOUL మాజీ కన్వీనర్ Dr లుబ్న సర్వత్ మేడం గారు అన్ని వాస్తవ ఆధారాలను ప్రభుత్వఅధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని మేడం గారు ఆశ్రయించాల్సి వచ్చింది అప్పడు న్యాయస్థానం ప్రభుత్వానికి మరియు అధికారులకు చివాట్లు పెట్టినా బుద్ధిరాలేదు అంటేనే అర్ధం అవుతుంది ప్రజల మీద ప్రభుత్వానికి ఎంత ప్రేమ వుందో !!.*

*ఈ సమస్య పరిష్కారంలో GHMC & రెవిన్యూ & HMDA & ఇరిగేషన్ శాఖ అధికారులు వైఫల్యం మరియు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి వీరి అందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపియాలి అప్పుడు తెలుస్తుంది అధికారులకు ప్రజల బాధలు ఏంటో. మొత్తంగా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని తక్షణమే పనులు చేపట్టాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము లేకపోతే రాబోయే రోజుల్లో ఉన్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందో వారు ఊహించలేరు... జాగ్రత్త 👍*

Note :
*కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తుంది ప్రజా సంకల్పం & link Media మీరు ప్రజా ప్రయోజనాలకోసమే పని చేయండి లేకపోతే మా సభ్యులు ఎవరినీ వదిలిపెట్టరు. నీతి నిజాయితీగా ప్రజలకోసం మీరు పని చేయాలి ఎన్నికల సమయంలో మీరు ప్రతిజ్ఞలు చేశారు వాటిని విస్మరిస్తే జాగ్రత్త !!*

*హెచ్చరిక ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలంగాణ లో నవశకం మీడియా ఆవీర్బవించింది మీరు  అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తే చాలు మీ మీద న్యాయపరమైన చర్యలు ఉంటాయి మరిచిపోకండి*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment