Sunday, January 10, 2021

ప్రజలమనోభావాలకు విరుద్ధంగా కొత్త మండలాలు

హైదరాబాద్ : 10/01/2021

*మీడియా మిత్రులకు నమస్కారం 🙏*

మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండలం మరికల్ గ్రామంను(మేజర్ గ్రామ పంచాయతీ) కొత్త మండలాలలో మండలంగా ప్రకటించాల్సిన ప్రభుత్వం తెరాస ప్రజాప్రతినిధుల స్వార్థరాజకీయాల కోసం వేరే చోటును ప్రతిపాదించడం జరిగింది కావున మీ మీ న్యూస్ బృందం ఒక్కసారి మరికల్ గ్రామము చుట్టూ వున్న గ్రామాల ప్రజలను కలిసి వాస్తవాలు తెలుసుకుని వారికి న్యాయం జరిగేవిధంగా సహారించాలని కోరుకుంటున్నాను 🙏

*ప్రజా ప్రయోజనాలకోసం మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను*

http://prajasankalpam1.blogspot.com/2021/01/blog-post.html

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Saturday, January 9, 2021

తెలంగాణ లో ఆదాయపుపన్ను శాఖ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ : 09/01/2021

            *బ్రేకింగ్ న్యూస్*

*కాలేశ్వరం సబ్ కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు.......!*
కాళేశ్వరం ప్రాజెక్టు సబ్‌ కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో శనివారం ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 20 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు సీ5 ఇన్‌ ఫ్రా ప్రమోటర్లు జువ్వాడి మదన్‌మోహన్‌రావు, నిశంత చెన్నడి నివాసాలతో పాటు పౌలోమి ఎస్టేట్‌, బృందావన్‌ స్పిరిట్స్‌, బేగంపేటలోని మధుపాల టవర్స్‌, కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్తరాక్‌ గార్డెన్‌లో దాడులు కొనసాగిస్తున్నారు.
పన్నుచెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో 18, కరీంనగర్‌లో రెండు బృందాల్లో సోదాల్లో పాల్గొన్నాయి.

*link Media 🖋️ **

*రాబోయే రోజుల్లో తెరాస ప్రభుత్వం దోచుకున్న లక్షలకోట్ల ప్రజల డబ్బును తిరిగి ప్రజలకు చెందేలా కొత్తగా రూపుదిద్దుకున్న నవశకం మీడియా ద్వారా సంచలన వాస్తవాలు ప్రజలకు అందుబాటులోకి....👍*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Friday, January 8, 2021

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ ఈనెల 11 న సమీక్షా సమావేశం

హైదరాబాద్ : 08/01/2021

ఈ నెల 11న ఉదయం 11.30 గంటల నుండి సీఎం శ్రీ కేసీఆర్ రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. రెవెన్యూ, పంచాయతిరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యా, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.

రెవెన్యూకు సంబంధించిన అంశాలపై సీఎం ఇటీవల సీనియర్ అధికారులు, కొంత మంది కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 11వ తేది నాడు జరిగే సమావేశంలో రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూలంకషంగా చర్చిస్తారు.

*పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనల్ల ఏర్పాటు, పార్ట్.బి. లో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు.*

రాష్ట్రంలో విద్యా సంస్థల్లో తరగతులను ఎప్పటి నుండి తిరిగి ప్రారంభించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఏ తరగతి నుండి క్లాసులు నిర్వహించాలి? ఏ విధంగా నిర్వహించాలి? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

@TelanganaCMO (ట్విట్టర్)
సౌజన్యంతో

https://prajasankalpam1.blogspot.com/

భారత గౌరవనీయులైన రాష్ట్రపతికి సర్ గారికి మండలంకోసం ఉత్తరాల ఉద్యమం ద్వారా ్థానిక ప్రజల సంకల్పం తీసుకున్నారు

హైదరాబాద్ : 08/01/2021

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండలం మరికల్ గ్రామ ప్రజల మరియు చుట్టూ వున్న గ్రామాల ప్రజల సంకల్పబలానికి అభినందనలు తెలియచేస్తుంది ప్రజా సంకల్పం & link Media 👍.

మరికల్ మండలంకోసం స్థానికంగా ప్రజలనుంచి పెద్ద ఎత్తున ఉద్యమం మొదలయింది. అసలు ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా రాజకీయ లబ్దికోసం కొందరు ఆడుతున్న నాటకంగా ప్రజల మనోభావాలను చూస్తే తెలుస్తుంది. మొత్తం వివరాలు ఇదే వెబ్ సైట్ లో వున్నాయి.

*మరికల్ మండలం కోసం గ్రామం మరియు చుట్టూ వున్నా గ్రామాలలోని ప్రతి ఒక్కరు కూడా ఉత్తరాల ఉద్యమంలో పాల్గొనేలా సంకల్పం తీసుకోవాలి యువత  మరియు శ్రేయోభిలాషులు 🎉👍🙏*

*గౌరవనీయులైన రాష్ట్రపతి సర్ గారు  ప్రజా ప్రయోజనాలను తప్పకుండా పరిశీలించడం జరుగుతుంది... అందుకే అందరి సంకల్పబలం దృడముగా ఉండాలి.... ఈ సంకల్పం ముందు ముందు  రాజకీయ నాయకులకు గుణపాఠం అవుతుంది 👍*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Thursday, January 7, 2021

ప్రజల తరపున ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది

హైదరాబాద్ : 07/01/2021

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

*తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారికి మరియు యువమంత్రివర్యలు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏.*

తెలంగాణ లో భూకబ్జాల గురించి & రైతు భూసమస్యల గురించి మీ దృష్టికి మరియు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎలాంటి విచారణ & చర్యలు లేవు ఎందుకు ??. GHMC పరిధిలో లెక్కలేనన్ని కబ్జాలు... చివరకు చెరువులను కబ్జా చేస్తే వారిని అలానే వదిలేసారు దానికి పోయిన సంవత్సరం వరదలకు ఏమి జరిగిందో అందరు చూసారు. ఏదైనా ప్రజా ప్రయోజన సమస్య పరిష్కారం మీ దృష్టికి వాస్తవాలతో ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు.. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను లెక్కచేయరు  ఇలానే వుంటే ప్రజా ఉద్యమాలపోరాటాలకు మీ ప్రభుత్వం కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు!!

*ఉదాహరణకు (1) LB నగర్ నియోజకవర్గం సరూర్ నగర్ మండలం, బైరామల్ గూడ గ్రామ పరిధిలోని SY NO 29/1 లో గల ప్రభుత్వ విలువైన భూమిని V. విశ్వనాథ్ రావు &  K. మోహన్ రావు అనే ఈ ఇద్దరి అసలు దస్తావేజు లో వున్న హద్దుల ప్రకారం కాకుండా అదే SY NO లోని వేరే ప్రాంతంలో భూమిని ఆక్రమించుకున్నారు. దీనికి రెవిన్యూ అధికారుల అండ ఉండడం ఆశ్చర్యం వేసింది. ఇప్పటికైనా న్యాయంగా విచారణ చేసి విలువైన ప్రభుత్వభూమిని ప్రజా ప్రయోజనాలకోసం ఉపయోగించండి.... (2)కందుకూరు RDO పరిధి తలకొండపల్లి MRO ఆఫీస్ చంద్రదన గ్రామ శంకరమ్మ భూ సమస్య విషయంలో అప్పటి అధికారులు ఎలాంటి ఆధారాలు లేని వేరే వారికి శంకరమ్మకు చెందిన వారసత్వ భూమిని ఇతరుల పేరు మీద రికార్డ్ లో నమోదు చేయడం కరెక్టే నా ?? మళ్ళీ శంకరమ్మ MRO & RDO & JC & ప్రజావాణి లో మోరపెట్టుకున్నా ఈరోజు వరకు న్యాయం జరగడం లేదు.. ఇదేనా మీ ప్రభుత్వం & అధికారుల పని తీరు అని ప్రజా సంకల్పం & link Media ప్రశ్నిస్తుంది*

@TelanganaCMO
@KTRTRS
@KTRoffice
@KTR_న్యూస్

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

GHMC వరద సహాయం లెక్కలు మాయం !!

హైదరాబాద్ : 07/01/2021

శ్రవణ్ అన్న గారు వరద సహాయం విషయంలో తెరాస ప్రభుత్వం ప్రజలను నట్టేటముంచింది... మోసం చేసింది... వారి ప్రజా ప్రతినిధులకు లాభం చేకూర్చింది ఇది వాస్తవం... అధికారులు నిర్లక్ష్యం & వైఫల్యం చెందారు...

బాపట్ల కృష్ణమోహన్

prajasankalpam@gmail.com

@Praja_Snklpm (ట్విట్టర్)

prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)

prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Tuesday, January 5, 2021

గుళ్లల్లో ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది?**త్రిదండి చినజీయర్‌* *స్వామి*

హైదరాబాద్ : 06/01/2021

*ఎవరున్నారో తెల్చాలి  జీయర్ స్వామి......!*


*గుళ్లల్లో ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది?*
*త్రిదండి చినజీయర్‌* *స్వామి*
గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. ఇప్పుడే రాష్ట్రంలోని ఆలయాల్లో వరుసగా ఎందుకు ఉపద్రవాలు జరుగుతున్నాయో? వీటి వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చాల్సిన అవసరముందని త్రిదండి చిన జీయర్‌ స్వామి అన్నారు. ఇంటెలిజెన్స్‌ విభాగం పెద్దలతో కమిటీని నియమించి.. వారికి పూర్తి అధికారాలిచ్చి విచారణ జరిపిస్తే.. బాధ్యులెవరో తప్పకుండా తెలుస్తుందన్నారు. గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రి కొండపై స్వామి మంగళవారం మీడియాతో మాట్లాడారు.
వ్యక్తులకు ఉండే ద్వేషాలను ఇలా చూపించడం సరికాదని హితవు పలికారు. ఆలయాలకు రక్షణ కొరవడిందనే విషయం స్పష్టంగా కనబడుతోందన్నారు.
ఆలయాలకు సంబంధించి రాష్ట్రంలో 50కి పైగా ఘటనలు జరిగినట్టు తెలుస్తోందన్నారు. 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆలయాలను సందర్శించి స్థానికుల అభిప్రాయాలు తీసుకుంటానన్నారు. అలాగే సాధువులను కలిసి.. వారందరి మార్గదర్శనంతో తదుపరి కార్యక్రమాలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు.

*link Media*

https://prajasankalpam1.blogspot.com/