Thursday, January 7, 2021

ప్రజల తరపున ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది

హైదరాబాద్ : 07/01/2021

*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*

*తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారికి మరియు యువమంత్రివర్యలు కేటీఆర్ సర్ గారికి నమస్కారం 🙏.*

తెలంగాణ లో భూకబ్జాల గురించి & రైతు భూసమస్యల గురించి మీ దృష్టికి మరియు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎలాంటి విచారణ & చర్యలు లేవు ఎందుకు ??. GHMC పరిధిలో లెక్కలేనన్ని కబ్జాలు... చివరకు చెరువులను కబ్జా చేస్తే వారిని అలానే వదిలేసారు దానికి పోయిన సంవత్సరం వరదలకు ఏమి జరిగిందో అందరు చూసారు. ఏదైనా ప్రజా ప్రయోజన సమస్య పరిష్కారం మీ దృష్టికి వాస్తవాలతో ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు.. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను లెక్కచేయరు  ఇలానే వుంటే ప్రజా ఉద్యమాలపోరాటాలకు మీ ప్రభుత్వం కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు!!

*ఉదాహరణకు (1) LB నగర్ నియోజకవర్గం సరూర్ నగర్ మండలం, బైరామల్ గూడ గ్రామ పరిధిలోని SY NO 29/1 లో గల ప్రభుత్వ విలువైన భూమిని V. విశ్వనాథ్ రావు &  K. మోహన్ రావు అనే ఈ ఇద్దరి అసలు దస్తావేజు లో వున్న హద్దుల ప్రకారం కాకుండా అదే SY NO లోని వేరే ప్రాంతంలో భూమిని ఆక్రమించుకున్నారు. దీనికి రెవిన్యూ అధికారుల అండ ఉండడం ఆశ్చర్యం వేసింది. ఇప్పటికైనా న్యాయంగా విచారణ చేసి విలువైన ప్రభుత్వభూమిని ప్రజా ప్రయోజనాలకోసం ఉపయోగించండి.... (2)కందుకూరు RDO పరిధి తలకొండపల్లి MRO ఆఫీస్ చంద్రదన గ్రామ శంకరమ్మ భూ సమస్య విషయంలో అప్పటి అధికారులు ఎలాంటి ఆధారాలు లేని వేరే వారికి శంకరమ్మకు చెందిన వారసత్వ భూమిని ఇతరుల పేరు మీద రికార్డ్ లో నమోదు చేయడం కరెక్టే నా ?? మళ్ళీ శంకరమ్మ MRO & RDO & JC & ప్రజావాణి లో మోరపెట్టుకున్నా ఈరోజు వరకు న్యాయం జరగడం లేదు.. ఇదేనా మీ ప్రభుత్వం & అధికారుల పని తీరు అని ప్రజా సంకల్పం & link Media ప్రశ్నిస్తుంది*

@TelanganaCMO
@KTRTRS
@KTRoffice
@KTR_న్యూస్

*Copy to Group link Media*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment