Tuesday, July 21, 2020

పేరెంట్స్- సైబర్ సేఫ్టీ (తెలంగాణ)

హైదరాబాద్ : 21/07/2020

*సైబర్  నేరాల్లో  40% మహిళలే బాధితులు*

*మహిళా భద్రతావిభాగం  విభాగం డీఐజీ సుమతి*

 తెలంగాణ పోలీస్ శాఖలోని మహిళా భద్రత విభాగం  ఆధ్వర్యంలో చేపడుతున్న సైబ్ - హర్ కార్యక్రమమంలో భాగంగా *పేరెంట్స్- సైబర్ సేఫ్టీ* అనే  అంశంపై సోమవారం వర్కషాప్ నిర్వహించారు.

Source : @ts_womensafety 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Monday, July 20, 2020

ఇది పరిస్థితి తెలంగాణ లో


హైదరాబాద్ : 21/07/2020

తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇలా అయితే ఎలా ??? 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Sunday, July 19, 2020

పోలీసుల మానవత్వం

హైదరాబాద్ : 19/07/2020

*విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి లోనై అసువులుబాసిన అజయ్ SPO(ఉప్పల్ పోలీస్ స్టేషన్ )కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఉప్పల్ పోలీసులు మరియు రూ:45,000/-లు ఆర్థిక సహాయం చేసిన రాచకొండ SPO లు.*

అజయ్ (SPO) ఉప్పల్ పి యస్ లో గత 7 సంవత్సరాలుగా పనిచేస్తు  విధి నిర్వహణలో తేది:10-7-2020 ఒక కారు ఆక్సిడెంట్ చేయగా తలకు బలమైన గాయాలు అయ్యి చికిత్స పొందుతూ మలక్ పేట లోని  యశోద ఆసుపత్రి లో తుదిశ్వాస విడిచినాడు.

*ఇతని స్వగ్రామం అయ్యవారిపాలెం, షాద్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లా. ఇతను దేశానికి సేవచేయాలనే తలంపుతో ఆర్మీలో చేరి 18 సంవత్సరాలు పని చేసి తిరిగి SPO గా చేరి ఉప్పల్ లో పని చేసి విధినిర్వహణలో రోడ్డు ప్రమాదం సంబవించి  అసువులు బాసినాడు.* ఇతనికి వసంత భార్య ఇద్దరు కొడుకులు కలరు. 

*SHO ఉప్పల్ ద్వారా అజయ్ మరణ వార్త విన్న శ్రీ మహేష్ భగవత్ IPS, ADGP, Commissioner of Police రాచకొండ గారు దిగ్బ్రాంతికి లోనై తన ఆత్మ శాంతిచాలని కోరుతూ తన అంత్యక్రియలకు రూ:20,000/- లు ఇవ్వడమే కాకుండా అతనిని  వాహనంలో తరలించే ఏర్పటు చేసినారు. అలాగే తన భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది.* 

*అతని అంత్యక్రియలకు సుమారు 50 మంది ఉప్పల్ పోలీస్ వారు హాజరు అయినారు.*

*ఈ రోజు ఉప్పల్ ఇన్స్పెక్టర్ రంగస్వామీ గారు మరియు సిబ్బంది అజయ్ యొక్క దశదిన కర్మకు హాజరై సమిష్టిగా అందరు కలసి ఇచ్చిన ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అజయ్ కుటుంబానికి అందిచడం అయినది*. 

*అలాగే రాచకొండలో పని చేస్తున్న తన తోటి SPO లు కూడా రూ: 45,000/-లు తన కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినారు.*

అలాగే అజయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఉప్పల్ పోలీస్ వారు ప్రార్దిచటం జరిగింది.

*Covid లాంటి గడ్డు పరిస్థితులో ఆర్థిక సహాయం అందించిన ఉప్పల్ పోలీస్ వారిని మరియు రాచకొండ కమీషనరేట్ లో పని చేసిన తన తోటి SPO లకు శ్రీ మహేష్ భగవత్ IPS, ADGP, Commissioner of Police Rachakonda గారు, రక్షిత మూర్తి IPS, DCP మల్కాజ్ గిరి గారు, శ్రీ Y. నర్సిహ్మ రెడ్డి ACP మల్కాజ్ గిరి గారు అభినందనలు తెలిపినారు.*

*సహా ఉద్యోగి అజయ్ ఆకస్మిక మరణంతో కలత చెందిన తన సహచర సిబ్బంది మరియు అధికారులు అజయ్ కుటుంబానికి మానవతాదృక్పదంతో చేసిన సహాయానికి *ప్రజా సంకల్పం మరియు link Media*అభినందనలు తెలుపుతుంది. 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Religous structures and Hospitals

@narendramodi @TelanganaCMO *Religous structures such as temples, church, mosque etc. are very important but by end of September the only temple that all of us will need & revere are the HOSPITALS. If we have resources please invest in hospitals,today god resides only there.*
పద్మశ్రీ అవార్డు గ్రహీత *సునీత కృష్ణన్* మేడం గారి సందేశం. 
*ప్రజా సంకల్పం*
🙏
https://prajasankalpam1.blogspot.com/

HYDERABAD GHMC gives approval to two major road- proposals*

Hyderabad : 19/07/2020

*HYDERABAD GHMC gives approval to two major road- proposals*

*The GHMC enforcement Amberpet-Uppal road* 
                   &
*Gachibowli-BHEL stretch may be widened*

The Standing Committee of the GHMC   cleared two major road widening proposals to provide relief to people from traffic congestion on existing roads.

One proposal is to widen the existing road between *Ali Cafe at Amberpet and Nalla Cheruvu lake of Uppal, to a width of 150 feet. The road runs along the Musi via Patel Nagar STP, Nagole Metro Station, till Nalla Cheruvu of Uppal.*

Once widened, the five-kilometre road is expected to ease traffic on the busy thoroughfare between Amberpet and Uppal via Ramanthapur, which is set for major overhaul in view of the elevated corridor being planned on the stretch as part of the SRDP project.

Traffic tedium is already a regular issue all the way between Amberpet and Boduppal, which is set to worsen once the flyover works begin. Widening of the alternative road will help ease traffic jams on the stretch, officials hope.

The existing road is only 30 feet wide, and increasing the width by five times might require acquisition of 148 properties, the proposal mentioned.

Source :
*EDITOR TRENDING TODAY**

Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Saturday, July 18, 2020

తెలంగాణ బోనాలు శాస్త్రీయత

హైదరాబాద్ : 19/07/2020

*అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు 🙏*

*బోనాలు అమ్మవారుని పూజించే పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.* సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

*బోనాల పండగ కు శాస్త్రీయ కారణాలు*

*బోనం అంటే భోజనం అని అర్ధం.* ఆ భోజనాన్ని ఆషాఢమాసంలో అమ్మవారికి నైవేజ్యంగా పెట్టడం ఆచారంగా వస్తున సంప్రదాయం.ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు ఆలావండిన కుండకి సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులు కూడా పెడ్తారు అలాగే ఆ కుండా పై ఒక దీపాన్ని ఉంచుతారు.ఇలా వండిన బోనం ఎంత పవిత్ర మైందంటే అంతే శుభ్రమైనది కూడా. ఆలా వండిన బోనానికి *సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు.ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవ్వన్ని యాంటీ సెప్టిక్, యాంటీ బైయోటిక్ కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి  వెళ్ళే అవకాశం లేదు.అందువలన ఈ బోనానికి ఇంతపవిత్రత, శుభ్రత ఉంటుంది*. అలాగే మనం బోనం పై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్ళే దారి కనుక  చీకటిగా ఉంటే అప్పుడు మనకు *ఆ దీపమే మనకు త్రోవ్వ చూపిస్తుంది అంటే దారిలో వెలుగుల అనమాట .  ఇది బోణం యొకా ప్రత్యేకత.*

మనకు ముఖ్యంగ వానా కాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భద్రపద మాసంలో ముగుస్తుంది. *వానాకాలంలో మనకు కలరా, మలేరియా వంటి అంటు వ్యాధులు చాల త్వరగ వ్యాపిస్తాయి .వానా కాలంలో వచ్చే అంటూ వ్యాధులు చాలా ప్రమాదకరం.సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదంకూడా ఉంది.అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ ఆషాఢ, శ్రావన మసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే వానాకాలంలో మహిళలకు అరి కాళ్ళు చెడుతయీ అలా కాకుండా మహిళలు పసుపును కళ్ళకు పెట్టుకుంటారు*

అసలు పండగకు ఆషాఢ మాసానికి సంబంధం ఏంటంటే బోనాల పండుగకు అలంకారంగా  *ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడ్తారు కనుక ఆ వేపాకులో ఉండే గుణ్ణం ఆ క్రిమి కీటకాలను నాశనంచేస్తుంది కాబట్టి ఈ పండగలో వేపాకులు ప్రదానంగా వాడుతారు. వేపాకులో ఉన్న గుణ్ణం వల్ల ఎటువంటి అంటూ వ్యాధులుమనకురావు.*

*బలి* 

సవరించు
బోనాల పండుగలో ముఖ్యమైనది బలి.ప్రధానంగా బోనాల పండుగకు మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు.ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.సాధారణంగా ఈ *ఆషాఢ మాసంలో మొదలైయే వానా కాలం వలన వచ్చే అంటూ వ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు, మేకలకు, గొర్రెలకు మొదలైన వాటికీ త్వరగా సోకే అవకాశం ఉంది కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలిస్తారు.* బహుశా అందువలననేమో శ్రావణ మాసం లో  కొంత మంది మాంసాహారం తినరు.

*అమ్మవారి ఊరేగింపు*

బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు.ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, వేపాకులతో పాటు, గుగ్గీలం లేదా మైసాచి పొగలు వేస్తారు.ఈ ఊరేగింపుకి కూడా కారణాలు ఉన్నాయి ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్లు ఆ చప్పుళ్లతో పాటు పోతరాజులు నృత్యం చేస్తూ అరుస్తారు.అప్పుడు ఆ డప్పు చప్పుడు పోతరాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయి.

*గుగ్గీలం లేదా మైసాచి పొగ*

అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గీలం లేదా మైసాచి పొగ వేస్తారు.ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే. వానా కాలంలో *దోమలు,ఇతర కీటకాలు చాల వ్యాపిస్తాయి అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు.*

*శాస్త్రీయంగా ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలతో ఇన్ని పద్దతులతో జరుపుకునే పండుగ కావున భారత దేశంలో అన్ని రాష్ట్రాలలో వారి వారి భౌగోళిక పరిస్థితులను బట్టి  వివిధ రకాలుగా శాస్త్రీయ పద్దతులతో పండుగలు కులాలకు మతాలకు అతీతంగా జరుపుకోవడం ప్రపంచంలో మరెక్కడా జరుగదు **
వీకీపీడియా సౌజన్యంతో 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/