Saturday, July 18, 2020

తెలంగాణ బోనాలు శాస్త్రీయత

హైదరాబాద్ : 19/07/2020

*అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు 🙏*

*బోనాలు అమ్మవారుని పూజించే పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.* సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

*బోనాల పండగ కు శాస్త్రీయ కారణాలు*

*బోనం అంటే భోజనం అని అర్ధం.* ఆ భోజనాన్ని ఆషాఢమాసంలో అమ్మవారికి నైవేజ్యంగా పెట్టడం ఆచారంగా వస్తున సంప్రదాయం.ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు ఆలావండిన కుండకి సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులు కూడా పెడ్తారు అలాగే ఆ కుండా పై ఒక దీపాన్ని ఉంచుతారు.ఇలా వండిన బోనం ఎంత పవిత్ర మైందంటే అంతే శుభ్రమైనది కూడా. ఆలా వండిన బోనానికి *సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు.ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవ్వన్ని యాంటీ సెప్టిక్, యాంటీ బైయోటిక్ కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి  వెళ్ళే అవకాశం లేదు.అందువలన ఈ బోనానికి ఇంతపవిత్రత, శుభ్రత ఉంటుంది*. అలాగే మనం బోనం పై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్ళే దారి కనుక  చీకటిగా ఉంటే అప్పుడు మనకు *ఆ దీపమే మనకు త్రోవ్వ చూపిస్తుంది అంటే దారిలో వెలుగుల అనమాట .  ఇది బోణం యొకా ప్రత్యేకత.*

మనకు ముఖ్యంగ వానా కాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భద్రపద మాసంలో ముగుస్తుంది. *వానాకాలంలో మనకు కలరా, మలేరియా వంటి అంటు వ్యాధులు చాల త్వరగ వ్యాపిస్తాయి .వానా కాలంలో వచ్చే అంటూ వ్యాధులు చాలా ప్రమాదకరం.సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదంకూడా ఉంది.అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ ఆషాఢ, శ్రావన మసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే వానాకాలంలో మహిళలకు అరి కాళ్ళు చెడుతయీ అలా కాకుండా మహిళలు పసుపును కళ్ళకు పెట్టుకుంటారు*

అసలు పండగకు ఆషాఢ మాసానికి సంబంధం ఏంటంటే బోనాల పండుగకు అలంకారంగా  *ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడ్తారు కనుక ఆ వేపాకులో ఉండే గుణ్ణం ఆ క్రిమి కీటకాలను నాశనంచేస్తుంది కాబట్టి ఈ పండగలో వేపాకులు ప్రదానంగా వాడుతారు. వేపాకులో ఉన్న గుణ్ణం వల్ల ఎటువంటి అంటూ వ్యాధులుమనకురావు.*

*బలి* 

సవరించు
బోనాల పండుగలో ముఖ్యమైనది బలి.ప్రధానంగా బోనాల పండుగకు మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు.ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.సాధారణంగా ఈ *ఆషాఢ మాసంలో మొదలైయే వానా కాలం వలన వచ్చే అంటూ వ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు, మేకలకు, గొర్రెలకు మొదలైన వాటికీ త్వరగా సోకే అవకాశం ఉంది కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలిస్తారు.* బహుశా అందువలననేమో శ్రావణ మాసం లో  కొంత మంది మాంసాహారం తినరు.

*అమ్మవారి ఊరేగింపు*

బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు.ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, వేపాకులతో పాటు, గుగ్గీలం లేదా మైసాచి పొగలు వేస్తారు.ఈ ఊరేగింపుకి కూడా కారణాలు ఉన్నాయి ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్లు ఆ చప్పుళ్లతో పాటు పోతరాజులు నృత్యం చేస్తూ అరుస్తారు.అప్పుడు ఆ డప్పు చప్పుడు పోతరాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయి.

*గుగ్గీలం లేదా మైసాచి పొగ*

అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గీలం లేదా మైసాచి పొగ వేస్తారు.ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే. వానా కాలంలో *దోమలు,ఇతర కీటకాలు చాల వ్యాపిస్తాయి అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు.*

*శాస్త్రీయంగా ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలతో ఇన్ని పద్దతులతో జరుపుకునే పండుగ కావున భారత దేశంలో అన్ని రాష్ట్రాలలో వారి వారి భౌగోళిక పరిస్థితులను బట్టి  వివిధ రకాలుగా శాస్త్రీయ పద్దతులతో పండుగలు కులాలకు మతాలకు అతీతంగా జరుపుకోవడం ప్రపంచంలో మరెక్కడా జరుగదు **
వీకీపీడియా సౌజన్యంతో 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment