హైదరాబాద్ : 19/07/2020
*విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి లోనై అసువులుబాసిన అజయ్ SPO(ఉప్పల్ పోలీస్ స్టేషన్ )కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఉప్పల్ పోలీసులు మరియు రూ:45,000/-లు ఆర్థిక సహాయం చేసిన రాచకొండ SPO లు.*
అజయ్ (SPO) ఉప్పల్ పి యస్ లో గత 7 సంవత్సరాలుగా పనిచేస్తు విధి నిర్వహణలో తేది:10-7-2020 ఒక కారు ఆక్సిడెంట్ చేయగా తలకు బలమైన గాయాలు అయ్యి చికిత్స పొందుతూ మలక్ పేట లోని యశోద ఆసుపత్రి లో తుదిశ్వాస విడిచినాడు.
*ఇతని స్వగ్రామం అయ్యవారిపాలెం, షాద్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లా. ఇతను దేశానికి సేవచేయాలనే తలంపుతో ఆర్మీలో చేరి 18 సంవత్సరాలు పని చేసి తిరిగి SPO గా చేరి ఉప్పల్ లో పని చేసి విధినిర్వహణలో రోడ్డు ప్రమాదం సంబవించి అసువులు బాసినాడు.* ఇతనికి వసంత భార్య ఇద్దరు కొడుకులు కలరు.
*SHO ఉప్పల్ ద్వారా అజయ్ మరణ వార్త విన్న శ్రీ మహేష్ భగవత్ IPS, ADGP, Commissioner of Police రాచకొండ గారు దిగ్బ్రాంతికి లోనై తన ఆత్మ శాంతిచాలని కోరుతూ తన అంత్యక్రియలకు రూ:20,000/- లు ఇవ్వడమే కాకుండా అతనిని వాహనంలో తరలించే ఏర్పటు చేసినారు. అలాగే తన భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది.*
*అతని అంత్యక్రియలకు సుమారు 50 మంది ఉప్పల్ పోలీస్ వారు హాజరు అయినారు.*
*ఈ రోజు ఉప్పల్ ఇన్స్పెక్టర్ రంగస్వామీ గారు మరియు సిబ్బంది అజయ్ యొక్క దశదిన కర్మకు హాజరై సమిష్టిగా అందరు కలసి ఇచ్చిన ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అజయ్ కుటుంబానికి అందిచడం అయినది*.
*అలాగే రాచకొండలో పని చేస్తున్న తన తోటి SPO లు కూడా రూ: 45,000/-లు తన కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినారు.*
అలాగే అజయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఉప్పల్ పోలీస్ వారు ప్రార్దిచటం జరిగింది.
*Covid లాంటి గడ్డు పరిస్థితులో ఆర్థిక సహాయం అందించిన ఉప్పల్ పోలీస్ వారిని మరియు రాచకొండ కమీషనరేట్ లో పని చేసిన తన తోటి SPO లకు శ్రీ మహేష్ భగవత్ IPS, ADGP, Commissioner of Police Rachakonda గారు, రక్షిత మూర్తి IPS, DCP మల్కాజ్ గిరి గారు, శ్రీ Y. నర్సిహ్మ రెడ్డి ACP మల్కాజ్ గిరి గారు అభినందనలు తెలిపినారు.*
*సహా ఉద్యోగి అజయ్ ఆకస్మిక మరణంతో కలత చెందిన తన సహచర సిబ్బంది మరియు అధికారులు అజయ్ కుటుంబానికి మానవతాదృక్పదంతో చేసిన సహాయానికి *ప్రజా సంకల్పం మరియు link Media*అభినందనలు తెలుపుతుంది.
Bapatla Krishnamohan
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment