ప్రెస్ నోట్
ప్రభుత్వమైనా హైడ్రా అయినా ముందుగా ప్రతి చెరువు చుట్టూ నాళాల చుట్టూ నదుల చుట్టూ FTL ను బఫర్ జోన్ ను చూచించే బోర్డులను పెట్టాలి.
సంబంధిత అధికారులు అక్రమ పర్మిసన్లు ఇవ్వకుండా కఠిన చట్టం చేసి నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన ఉద్యోగుల పై చర్యలు తీసుకోవాలి.ఇక ముందు అక్రమ నిర్మాణాలు జరగకుండా ఉంటాయి
ఇంతకు ముందు ఈ చెరువులు మంచి నీటి సరసులుగా ఉపయోగ పడటమే కాకుండా పంట పొలాలకు నీరు అందించే వి, గంగపుత్రులు చేపలు పెంచు కుంటు జీవనోపాధి పొందే వారు
హైదారాబాద్ నగరం చుట్టూ 185 చెరువులు ఉన్నట్లు తెలుస్తుంది ఇవే కాకుండా కుంటలు ,బావులు ఉండేవి, ఇవ్వన్నీ అప్పటి నగర ప్రజల దాహార్తిని తీర్చి వారి పొలాలకు నిరు ఇచ్చేవి.
N కన్వెన్షన్ కూల్చడం వలన నాగార్జున గారికి ఆర్థికంగా పెద్దగా నష్ట పోయేది వుండదు ఇలాంటివి ఆయనకు వంద వుండవచ్చు మరి ఒకటే ఇల్లు బఫర్ జోన్ లోనో FTL లోనో వున్న సామాన్య ప్రజల ఇండ్లు కూల్చితే వారి పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్న ?
చెరువులు కుంటలు కనుమరుగై పోతే హైదరాబాద్ నగరంలో గ్రౌండ్ వాటర్ వుండదు బోర్ లలో వాటర్ రావు కాబట్టి ప్రభుత్వాలు చెరువులను కుంటలను కాపాడాలి కలుషితం కాకుంటే నదుల నీటికన్న త్రాగటానికి చెరువుల నీళ్లు శ్రేష్ఠమైనవి
నారగోని ప్రవీణ్ కుమార్ ప్రెసిడెంట్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్
No comments:
Post a Comment