Thursday, August 22, 2024

*విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య : TJSS*

*విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య : TJSS*

*పాత్రికేయులపై దాడి సహించరానిది
*సీఎం సొంత ఊరిలో ఇంత దాష్టీకం 
*దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ బుక్ చేయాలి


మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం అమానుషం అని తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం మండిపండింది. రుణమాఫీ అమలుపై క్షేత్రస్థాయి రిపోర్టింగ్ చేస్తుండగా మహిళలు అని చూడకుండా సరిత, విజయ రెడ్డి అనే జర్నలిస్టులను బూతులు తిడుతూ.. ఫోన్లు, కెమెరాలు లాక్కోవటమే కాకుండా.. భౌతిక దాడికి పాల్పడడం సిగ్గుమాలిన చర్య అని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం సభ్యులు అగ్రహ వ్యక్తం చేశారు .మహిళా జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరగడం.. పదేళ్ల తెలంగాణ చరిత్ర, అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో తొలిసారి అని ఇలాంటి దాడులను సహించేది లేదని TJSS అధికార ప్రతినిధి గౌటి రామకృష్ణ హెచ్చరించారు. 

వెంటనే దాడి చేసిన గుండాలపైన కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని  TJSS డిమాంండ్ చేస్తుంది. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని గౌటి రామకృష్ణ తెలిపారు. 
********************************************
మహిళా జర్నలిస్ట్ లపై దాడికి పాల్పడ గుండాలపై చర్యలు తీసుకోవాలని  శుక్రవారం 23 ఆగస్టు 2024 నాడు తెలంగాణ DGP గారికి అలాగే మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద గారికి వినతి పత్రం ఇస్తున్నాం. కావున TJSS సభ్యులందరూ, జర్నలిస్టులు  రావలసిందిగా కోరుతున్నాం. 

*సమయం: 3pm మహిళ కమిషన్ కార్యాలయం బుధ భవన్, తర్వాత డిజిపి కార్యాలయం*


*గౌటి రామకృష్ణ*
*ప్రధాన కార్యదర్శి* 
 *TJSS*

No comments:

Post a Comment