Thursday, August 29, 2024

చెరువుల ఆక్రమణ ఎప్పటి నుంచి అంటే!

చెరువుల ఆక్రమణ గత పదేళ్ల క్రితమే మొదలయినట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో నేను ఇరవై ఏళ్ల క్రితం రాసిన ఒక వ్యాసం లోంచి కొన్ని విషయాలు ఇక్కడ పంచుకుంటున్నాను. హైదరాబాద్ లోని ప్రముఖ పరిశోధనా సంస్థ CESS లో మిత్రుడుప్రొఫెసర్ రామచంద్రయ్య సేకరించిన వివరాల ప్రకారం 1990 తరువాత వలసలు పెరిగి చెరువులు ఆక్రమణకు గురయినాయి. ( పట్టిక చూస్తే ఆ విషయం బోధపడుతుంది)
నిజానికి హైదరాబాద్ చెరువులతో విలసిల్లిన నగరం. ఈ నగరానికి పునాదివేసిన కుతుబ్షాహీ రాజులు 1534-1724 మధ్యకాలంలో సహజ సిద్ధమైన చెరువులను కాపాడుతూ వచ్చారు. తరువాత వచ్చిన అసఫ్ జాహీ పాలకులు 1724-1948 మధ్య  ఫ్రెంచ్, బ్రిటీష్, ఇండియన్ ఇంజనీర్ల సహకారంతో వందలాది కొత్త చెరువులు నిర్మించారు. హుస్సైన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మీరాలం  చెరువులను తాగునీటి కోసం నిర్మించారు. 1960-70 ల దాకా కాలువల ద్వారా నీళ్లు పారేవి. 2000 సంవత్సరం తరువాతి వరకు ఈ జలాశయాలే మొత్తం నగరాన్ని కాపాడాయి.
1985 తరువాత కోస్తావలసలు మొదలయ్యాయి. 2000 సంవత్సరం నాటికి ఈ వలసలు వందరెట్లు పెరిగి చెరువులు తరగడం మొదలయ్యింది. కొత్తగా రియల్ ఎస్టేట్ అనే కొత్త జాతి  పఠాన్ చెరువు, అమీన్ పూర్ చెరువు మొదలు దుర్గం చెరువు, పేరం చెరువు, సరూర్నగర్ చెరువు, సఫీల్గూడ చెరువు, యూసఫ్ గూడా చెరువు ఇట్లా వందలాది చెరువుల చుట్టూ వేలాది ఎకరాలను కబ్జాచేసి, ప్లాట్లు వేసి కొత్త కాలనీలను  కట్టేసింది. అప్పటి ప్రభుత్వం దీనిని ప్రోత్సహించింది. నాయుడు గారి కాలంలో ప్రభుత్వమే కనీసం పది పెద్ద చెరువులను పూడ్చి పార్కులుగా  మార్చేసి క్రిమినల్ చర్యలకు పాల్పడింది. చాచా నెహ్రూ పార్కు, కృష్ణకాంత్ పార్క్, సఫిల్ గూడా పార్క్, సరూర్ నగర్ పార్క్ అలావచ్చినవే. అప్పుడు మొదలయిన కబ్జాలు ఇప్పుడు చెరువులను పూర్తిగా మింగేసే స్థాయికి చేరాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి @revanth_anumula గారు నిజంగానే ఆ ఆక్రమణలు పూర్తిగా తొలగించి చెరువులను శుద్ధి చేస్తే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు.

Courtesy / Source by :  https://x.com/GhantaC/status/1829125664240513465?t=ItfbzaEhl6kfxW-fBMdu4A&s=19

No comments:

Post a Comment