Thursday, August 1, 2024

ఉస్మానియా యూనివర్సిటీ.. బోధనేతర సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి... ఆనంచిన్ని వెంకటేశ్వరావు


*ప్రెస్ నోట్*

_*ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ.. బోధనేతర సిబ్బంది న్యాయమైన డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి: ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరావు*_

ఉస్మానియా యూనివర్సిటీలో 'గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నా తమను (జీ.ఓ.ఎమ్ ఎస్.నెం.16 ద్వారా) రెగ్యులరైజ్ చేయాలని, ఎన్నో సంవత్సరాలనుండి న్యాయంగా పోరాటం చేస్తూ యూనివర్సిటీ అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, ఈ అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికను ఇచ్చి తమ జీవితాలతో ఆడుకుంటున్నారు' అని ఈరోజు ఆగష్టు 1,2024 న OU ఆర్ట్స్ కాలేజీ వద్ద తమ ఆవేదనను వాస్తవ వివరాలను ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత అనంచిన్ని వెంకటేశ్వరావుగారికి తెలిపి తమ ఈ న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేయాలని నాన్ టీచింగ్ కాంటాక్ట్ ఉద్యోగుల ప్రతినిధులు చేతన్, డాక్టర్ వీరేశం, అరుణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి బాపట్ల కృష్ణమోహన్, ప్రజాసంకల్పం ప్రతినిధి మండల బిక్షపతి పాల్గొన్నారు.

బాపట్ల కృష్ణమోహన్ 

No comments:

Post a Comment