Tuesday, August 20, 2024

*హైడ్రా కూల్చివేతలు మున్నాళ్ళ ముచ్చటగా మిగిలి పోనున్నాయా?*

ప్రెస్ నోట్ 

*హైడ్రా కూల్చివేతలు మున్నాళ్ళ ముచ్చటగా మిగిలి పోనున్నాయా?* 
*ఆరంభ శూరత్వం కావచ్చు*
 *తూ తూ మంత్రంగా మిగిలి పోవచ్చు*

హైడ్రా ఉద్యోగులు సమర్ధులైన కూడ రాజకీయ నాయకుల వత్తిళ్ళకు లొంగక తప్పదు
         
హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు వున్నవి వున్న చెరువుల విస్తీర్ణం ఎంత? ప్రస్తుతం ఎంత విస్తీర్ణంలో చెరువులు ఉన్నాయి ఏ చెరువు ఎంత కబ్జా గురైనది కబ్జాదారులు ఎవ్వరు ముందు లెక్కలు హైడ్రాకు తెలుసా? తెలిస్తే బహిర్గతం చేయాలి, కబ్జాదారుల పేర్లు బయట పెట్టాలి నూతనంగా FTL లో నిర్మిస్తున్న కొన్ని నిర్మాణాలను కూలుస్తున్నారు సరే ఇప్పటికే నిర్మాణం అయిన వాటిని వదిలి వేస్తారా? బ్లాక్ మెయిల్ చేయడానికి కూడ అవకాశం వుంది, FTL లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారంటే అక్కడి అధికారులు అవినీతి పరులని స్పష్టం అవుతుంది, ఇప్పుడు కూలుస్తూ వున్న భవనాలకు HMDA పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్ వున్నట్లు బాధితులు చెప్పుచున్నారు పర్మిషన్ ఇచ్చిన ఉద్యోగుల పై చర్యలు తీసుకుంటారా? పర్మిషన్ ఇచ్చిన అధికారుల పై చర్యలు కఠినంగా లేకుంటే వారు మళ్ళీ మళ్ళీ పర్మిషన్ లు ఇస్తూనే ఉంటారు కదా
         సామాన్య వ్యక్తులు నిర్మించు కుంటున్న బిలింగ్స్ పై తప్ప పెద్దల బలింగ్స్ పై హైడ్రా చర్య తీసుకో గలదా? అనేది భవిషత్ లో తేలనుంది, హైదరాబాదు లో కబ్జాకు గురికాని చెరువే లేదు చెరువుల మధ్యనుండి రోడ్లు వేసుకున్నా అడిగే నాథుడు లేడు

నారగోని ప్రవీణ్ కుమార్ ప్రెసిడెంట్, 
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్

No comments:

Post a Comment