అంతర్జాతీయ, జాతీయ స్థాయి కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు ఎప్పటికప్పుడే కార్యరూపందాల్చేలా కొత్తగా ఇన్వెస్టర్స్ టాస్క్‌ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి @revanth_anumula గారు ప్రకటించారు. టెక్నాలజీ, స్కిల్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో అపారమైన అవకాశాలున్న తెలంగాణలో పెట్టుబడుల భద్రతకు ప్రభుత్వమే భరోసా ఇస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాబోయే పదేండ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకోసం 'ప్యూచర్ స్టేట్ తెలంగాణ' నినాదంతో ప్రజాప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలను అమలు చేస్తుందన్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ప్రపంచంతోనే పోటీపడుతోంది తప్ప పక్క రాష్ట్రాలతో కాదన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాలుగో నగరమైన ఫ్యూచర్ సిటీని ప్రపంచ అవసరాలు తీర్చగలిగేలా 'చైనా వన్ ప్లస్ కంట్రీ' స్థాయిలో నిర్మిస్తోన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కోకాపేటలో నూతనంగా ఏర్పాటుచేసిన క్యాంపస్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి @OffDSB గారు, ఉన్నతాధికారులు, కాగ్నిజెంట్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొత్త క్యాంపస్ ఏర్పాటుతో @Cognizant సంస్థకు దేశంలోనే హైదరాబాద్ అతిపెద్ద కేంద్రంగా మారిందని, ప్రస్తుతం సుమారు 65వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారని, తద్వారా తెలంగాణలో ఉద్యోగాలు కల్పించే రెండో అతిపెద్ద సంస్థగా కాగ్నిజెంట్ ఎదగడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభినందించారు.
తెలంగాణకు పెట్టుబడుల కోసం ఇటీవల చేపట్టిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలు విజయవంతం అయ్యాయని, ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ పట్ల, తెలంగాణ పట్ల పాజిటివ్ దృక్పథం నెలకొని ఉందన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ఐటీ రంగాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ యువతలో నైపుణ్యాలు పెంచి గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ప్రజాప్రభుత్వం సరికొత్తగా ఏఐ సిటీని నిర్మిస్తోందని, సెప్టెంబర్ లో ప్రతిష్టాత్మక #AIGlobal సదస్సును కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.
#TelanganaInvestment #TelanganaTheFutureState
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1823738873354314060?t=LCU6neMgBA1OcV2ACNYL5g&s=19
No comments:
Post a Comment