*చెరువు తూములు బంద్ చేసి అపార్టుమెంట్ నిర్మించారు: హైడ్రా కమిషనర్ రంగనాథ్*
హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పంజా కొనసాగుతోంది. ఇప్పటికే పలు చోట్ల కూల్చివేతలు చేపట్టారు. శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్ చేర్ లో సుడిగాలి పర్యటన చేపట్టారు. స్థానిక సాకి చెరువును పరిశీలించారు. ఇక్కడ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెరువు వద్ద తూములు బంద్ చేసి ఇన్కోర్ సంస్థ అపార్టుమెంట్ కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అపార్టుమెంట్ ను రంగనాథ్ పరిశీలించారు.
అమీన్ పూర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. శంభుని కుంట, శంబికుంట, బంధం కొమ్ము, చక్రపురి కాలనీ, అమీన్పూర్ పెద్ద చెరువులను పరిశీలించారు. చెరువుల కబ్జాలపై అడ్వకేట్ రవికృష్ణ హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అన్ని చెరువుల తూములను కబ్జా చేసి, కాలువలను మూసేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈక్రమంలో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను రంగనాథ్ ఆదేశించారు. శంభునికుంట, సాకి చెరువు, అమీన్ పూర్ పెద్ద చెరువు, బంధం కొమ్ము చెరువు పరిధిలో అక్రమ
నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు.
*వైయస్ జగన్ కు నోటీసులు*
వైకాపా అధ్యక్షుడు జగన్ కు నోటీసుల ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. సోషల్మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
Courtesy / Source by:
*గంతల నాగరాజు రిపోర్టర్*
No comments:
Post a Comment