*షాద్ నగర్ లో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన బాధాకరం.!*
*బాధితురాలిని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, కమిషన్ బృందం.!*
*తక్షణమే పోలీసులపై చర్యలు తీసుకోవాలి..!*
*బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాం.!*
సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో గత నెల 24 వ తేదీన దొంగతనం చేసిందనే నెపంతో దళిత మహిళపై షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి తో పాటు మరో నలుగురు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనలో ఆదివారం నాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బృందం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ సునీత ను పరామర్శించారు ఈ సందర్భంగా బాధిత మహిళా మాట్లాడుతూ తనపై పోలీసులు మహిళా అని చూడకుండా అర్థరాత్రి ఐదుగురు పోలీసులు తనను విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు తన కుమారుడిని కూడా కొట్టారని ఎస్సీ కమిషన్ చైర్మన్ తో పాటు కార్పొరేషన్ చైర్మన్ ప్రితం దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు తన పట్ల చాలా దారుణంగా వ్యవహరించారని తనకు న్యాయం చేయాలని వేడుకుంది బాధిత మహిళ ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం మాట్లాడుతూ ఓ దళిత మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మహిళకు న్యాయం చేయాలని న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఇంత దారుణ ఘటన ఇప్పటివరకు ఏక్కడ చూడలేదన్నరు.
Courtesy / Source by :
Sathyanarayana.J
(జనం సాక్షి)
No comments:
Post a Comment