కూర, రసం, పెరుగులాంవంటివి ఏవి లేవు. అన్నాన్ని నీళ్లలో కలుపుకుని.. ఉల్లిపాయ, వెల్లుల్లి పాయ నంజుకుని తింటాడు. ఈ ఫోటోతో పాటు అతడికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు అపిత్ లిడ్. ‘‘ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నా స్నేహితుడు. చాలా కష్టపడి పని చేస్తాడు. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా వేరే ప్రదేశంలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. తన జీతంలో అత్యధిక భాగం కుటుంబానికే పంపిస్తాడు. చాలా తక్కువ మొత్తం తనకోసం ఉంచుకుంటాడు. అలా మిగుల్చుకున్న డబ్బులో ఇలాంటి భోజనం చేస్తాడు. ప్రతి రోజు ఇదే అతడి ఆహారం. దీని గురించి అతడు బాధపడడు. తన భోజనాన్ని ఎంతో ప్రేమిస్తాడు’’ అంటూ చెప్పుకొచ్చిన ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఇప్పటికే ఆరు వేల మంది ఈ స్టోరిని షేర్ చేశారు. ‘‘ఇతడి పరిస్థితి చూస్తే.. చాలా బాధగా ఉంది..ఇలాంటి ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవుతావు’’.. ‘‘ఇతడికి సాయం చేయండి’’.. ‘‘ఇతడి జీవితం మనకు ఓ పాఠం నేర్పుతుంది’’.. ‘‘ఉన్నంతలో సర్దుకుపోయే నీ తత్వానికి గ్రేట్.. నీకు మంచి జరుగుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
No comments:
Post a Comment