Monday, April 19, 2021

గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ

హైదరాబాద్ : 20/04/2021

గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ🙏
           మీరు తొందరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
               ఎన్నో జాగ్రత లతో మేసిలే మీకు కూడా కరోనా వచ్చింది అంటే దాని తీవ్రతను అర్థం చేసుకోండి సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ఈ రాష్ట్రంలో
            సరైన వైద్య సదుపాయాలు లేవు మీరు కొవిడ్ పెసెంట్ల రక్షణ కు తీసుకున్న జాగ్రత్తలు గుండు సున్నా  వందల కొట్లో వేల కొట్లో కొవిడ్ వైద్యానికి కేటాయించ లేదు,
           ఆరోగ్య శ్రీ లో కోవిడ్ రోగాన్ని చేర్చ లేదు
            ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఆజమాయిసి లేదు మీకు
 అవి దోపిడీ చేస్తున్నాయి
   మిడిల్ క్లాస్ వాడికి కోవిడ్ జబ్బు వస్తె ఉన్నది అమ్ము కోవాలిసిన పరిస్థితి,మూడు నుండి ముప్పై లక్షలకు పైగా ప్రవేట్ హాస్పిటల్స్ వసూలు చేస్తున్నాయి
              ఈ కారణంగా మధ్య తరగతి వారు పేద వారీగా మారి పోతున్నారు,
                 పది వేల కోట్లు కర్చు పెట్టీ అయినా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన భాధ్యత మీకు ఉంది
      కొన్ని రోజులు ప్రాజెక్టు లను పక్కకు పెట్టండి,
ప్రజలు బ్రతికి ఉంటే కదా పంటలు పండిoచేది,ఆ డబ్బులు ప్రజల ఆరోగ్యం కోసం కర్చు పెట్టండి
          నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారానికి పంపినట్లుగా
        ప్రతి హాస్పిటల్ కు మీ MLA MP లను రోజు పంపి వైద్యాన్ని పర్య వేక్షించండి నిజమైన ప్రజా సేవకులు ప్రజలు యెక్కడ బాధ పడితే అక్కడికి వెళ్ళాలి,మీ MLA,MP ల జీతాలు కోవిడ్ పేషెంట్ల కర్చుకు ఉపయోగించండి
     దేశానికి ఆదర్శంగా ఉండండి దేశం లో ఎవ్వరు తీసుకుంట లేనంతగా జీతాలు మీరు తీసుకుంటున్నారు, ఏ రాష్ట్రం MLA లు కూడా మన రాష్ట్ర MLA లంత జీతాలు తీసుకోవడం లేదు
 మీరే వారికి యెక్కువ జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు,
       ఇప్పుడు ఎన్నికలు అవసరమా? అన్ని ఎన్నికలు రద్దు చేయండి లక్ష మంది తో నాగార్జునసాగర్ లో మీటింగ్ పెట్టారు యెన్ని వేల మందికి కరోనా అంటిందో మరి ఆ పాపం ఎవ్వరిది?
           బార్లు,సినిమా హాల్స్  లాంటివి బంధు పెట్టండి నిత్య అవసర వస్తువుల షాప్ లు తప్ప కొన్ని రోజులు అన్ని మూయండి
     లక్షల లో ప్రజలు కోవిడ్ బారిన పడక ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మీతో బాటు ఈ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి🙏
        మీరు తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ🙏
   నారగోని ప్రవీణ్ కుమార్
      సామాజిక కార్యకర్త
(ప్రజా సంకల్పం గౌరవ సభ్యులు)

No comments:

Post a Comment