కళ్లుండీ చూడలేని కేసీఆర్ సర్కార్ సాక్షిగా.. మరో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య
కరోనా వైరస్ తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ టీచర్ల జీవితాలను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తే.. టీఆర్ఎస్ సర్కార్ అనాలోచిత చర్య వారి బతుకులనే బలి తీసుకుంటోంది. ఏడాదికాలంగా మూతబడిన పాఠశాలలు ఇటీవల తెరుచుకోవడంతో.. ఇక తమ సమస్యలు తీరినట్టే అని సంతోషించిన ప్రైవేట్ టీచర్లకు నెల తిరక్కుండానే షాకిచ్చింది ప్‌ాభుత్వం. ఉన్నపళంగా విద్యాసంస్థలను మూసివేయడంతో వారంతా మళ్లీ రోడ్డునపడ్డారు. దీంతో ఎలా బతకాలా అని మథనపడుతున్న వారికి.. చివరికి చావే మార్గంగా కనిపిస్తోంది. ఆ దారిలోనే… ఆకలికి తాళలేక, కుటుంబాన్ని పోషించే మార్గం కనబడలేక మరో ప్రైవేట్ టీచర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నాగార్జునసాగర్‌లోని హిల్ కాలనీకి చెందిన ప్రైవేటు టీచర్ వనెం రవికుమార్ (30) తెల్లవారుజామున ఉరి వేసుకున్నాడు. బీఏ, బీఎడ్ పూర్తి చేసిన రవికుమార్.. ప్రైవేట్ స్కూల్‌లో పనిచేసేవాడు. అయితే ఏడాదిగా స్కూళ్లు తెరవకపోవడంతో జీవనోపాధి కరువైంది. ట్యూషన్లు చెప్పుకుంటూ నెలకి రూ. 1500 సంపాదిస్తున్నాడు. కానీ ఆ ఆదాయంతో కుటుంబాన్ని పోషించలేకపోయాడు. దీంతో మనస్తాపం చెందిన రవికుమార్ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.
@తొలివెలుగు సౌజన్యంతో
No comments:
Post a Comment