Wednesday, April 28, 2021

తెలంగాణలో తెల్లారని జీవితాలు

హైదరాబాద్ : 29/04/2021

నరకలోకపు జాగిలాలు
హాస్పటల్స్ లో సంచరిస్తుంటే
పేదవాడు చస్తేమి బ్రతికితేమి
కాసుల లెక్కలే కావాలి వాటికి
కరొన నగరం లో నాట్యం చేస్తుంది
విరామమెరగక తిరుగుతుంది
కనపడలేదా వినపడలేదా
అసహాయుల హా హా కారాలు
ఏలికల్లారా పీలికల్లారా
నిరు పేదలు రోదనలతో
శ్వాస అందక చస్తుంటే
ఎంత దారుణం
ఎంత దారుణం
కరోన సోకి జరం వస్తె
దిగులు పడి కలత చెంది
వైద్య మందక మరణిస్తే
ఎంత కష్టం
ఎంత నష్టం
ఇటు చూస్తే ప్రవేట్ వైద్యం
అందని ద్రాక్ష
అటు చూస్తే గవర్నమెంట్ వైద్యం
నరక లోకపు శిక్ష
వెర్రివాల్లారా పిచ్చివాల్లారా
రాజకీయనాయకుల అక్రమాల
చక్రాల కింద నలిగిపోయే
దీనులారా హినులారా
మీ బాధలు మీ గాథలు
వినేదేవ్వరు కనేదేవ్వరు
ఏలికల నాలికలు వేల చీలికలు
వరాల వర్షం కురిపించారని
కష్టాలకు కన్నీళ్లకు తావే ఉండదని
ఓటు వేస్తే
కరోనా కాటుకు కొన ఊపిరితో
కొట్టుకుంటుంటే కాపాడే నాయకుడెక్కడ?
కాస్టానికి సైతం కరీదు కట్టే లోకం
పేదలకు శ్యాపమాయే
కడ చూపుకు నోచుకోని చావులాయే
కంటినిండా గంగ పొంగుడాయే
ప్రాణం లేని శిలలకు వందల వేల కోట్లు అక్కడ
ప్రాణమున్న మనుస్యులకు విలువ లేదు ఇక్కడ
తల్లి పోతే తండ్రి పోతే
గుక్క పట్టి ఏడ్చే పసి పిల్లలకు
దిక్కు ఎవ్వరు
మొక్కు ఎవ్వరు
తెలంగాణలో తెల్లారని జీవితాలు
పాలకులకు పట్టవాయే
బ్రతుకంతా గాయమాయే
కాయాన్ని కాల్చడానికి
కాస్టాలే కరువాయే
ఎంత చిత్రం ఎంత చిత్రం
తెలంగాణ బ్రతుకు విచిత్రం
…....................................
*రచన*: నారగోనీ ప్రవీణ్ కుమార్
సామాజిక కార్యకర్త
9849040195

Bapatla Krishnamohan 
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (Twitter)
prj_snklpm9456 (Instagram)
prajasankalpam1 (youTube)
కూ యాప్‌లో @praja_snklpm యొక్క ఆసక్తికరమైన ఆలోచనలను వినండి - https://www.kooapp.com/profile/praja_snklpm
https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment