Thursday, April 15, 2021

తీహార్ జైలు నుంచి పెరోల్‌పై విడుద‌లైన ఖైదీల్లో 3,300 మంది మిస్సింగ్

హైదరాబాద్ : 15/04/2021

తీహార్ జైలు నుంచి పెరోల్‌పై విడుద‌లైన ఖైదీల్లో 3,300 మంది మిస్సింగ్

కొవిడ్ నేప‌థ్యంలో తీహార్ జైలు నుంచి గ‌తేడాది బెయిల్‌, పెరోల్‌పై విడుద‌లైన మొత్తం 5,556 మంది ఖైదీల్లో 2,200 మంది జైలుకు తిరిగి రాగా 3,300 మంది ప‌త్తా లేకుండా పోయారు. వీరి ఆచూకీని క‌నుగొనేందుకు జైలు అధికారులు ఢిల్లీ పోలీసుల స‌హాయం కోరారు. ఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. క‌రోనా ఉధృతి కార‌ణంగా జైళ్ల దారుణ పరిస్థితులపై స్పందించిన సుప్రీంకోర్టు జైళ్ల‌లో రద్దీని నివారించడానికి అత్యవసర పెరోల్‌పై ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్రాలను కోరింది.

ఈ క్ర‌మంలో తీహార్ జైలు నుంచి 5,556 మంది ఖైదీలు, మండోలి, రోహిణి, ఇత‌ర జైళ్ల నుంచి 1,184 మంది ఖైదీలు పెరోల్‌పై విడుద‌ల‌య్యారు. వీరిలో తిరిగి లొంగిపోయిన వారుగానీ లేదా శిక్షా కాలం పూర్తిచేసుకున్నవారు గానీ 1,072 మంది ఉండ‌గా మ‌రో 112 మంది దోషులు లొంగిపోలేదు. వీరిని గుర్తించేందుకు వారి పేర్లు, వివ‌రాల‌ను జైలు అధికారులు ఢిల్లీ పోలీసుల‌తో పంచుకున్నారు.

మిస్సింగ్ లిస్ట్‌లో ఉన్న దోషులు, అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీలలో చాలా మంది హెచ్ఐవీ, క్యాన్సర్, మూత్రపిండాలు పనిచేయకపోవడం, ఉబ్బసం, క్షయవ్యాధి వంటి అనారోగ్యంతో బాధపడుతున్న‌ట్లు అధికారులు తెలిపారు. ద‌క్షిణాసియాలోనే అతిపెద్ద జైలు తీహార్ జైలు. 10 వేల మంది ఖైదీల‌ను ఉంచే సామ‌ర్థ్యం క‌లిగి ఉంది. మిస్సింగ్ అయిన 112 మంది దోషులు, తీహార్ జైలుకు తిరిగిరాని 3,300 మంది ఖైదీల ఆచూకీని క‌నుగొనేందుకు వారి పేర్లు, వివ‌రాల‌ను జైలు అధికారులు ఢిల్లీ పోలీసుల‌తో పంచుకున్నారు.

@నమస్తే తెలంగాణ సౌజన్యంతో

No comments:

Post a Comment