@తొలివెలుగు మీడియా సౌజన్యంతో
తెలంగాణలోనూ భారీగా పెరిగిన కరోనా కేసులు- ముందుంది విలయమే
కరోనా సెకండ్ వేవ్ తెలంగాణలో వేగంగా వ్యాపిస్తుంది. గతంలో విస్తరించిన దానికన్నా వేగంగా వైరస్ పంజా విసురుతుంది. ఫలితంగా కేవలం రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య వందల నుండి వేలకు చేరింది.
రాష్ట్రంలో తాజాగా 1,914 మంది కొవిడ్ బారిన పడగా.. వైరస్ సోకి ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,617 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 11 వేలు దాటింది. 6,634 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. మరో 285 మంది కోలుకున్నారు.
కొత్తగా వచ్చిన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 393 మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో సోమవారం రికార్డు స్థాయిలో 74,274 మందికి కరోనా పరీక్షలు చేసుకున్నారు.
ప్రజలు కోవిడ్ నిబంధనలను భేఖాతరు చేస్తే… కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు ఆసుపత్రులు కూడా సరిపోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు
No comments:
Post a Comment