గుడ్ న్యూస్, నాసల్ స్ప్రే వాడితే కరోనా మొత్తం ఖేల్ ఖతం.
బీఆర్ఐసీఎం సైంటిస్టులు తాజాగా బంగాసేఫ్ ఓరో నాసల్ స్ప్రేని డెవలప్ చేశారు. ముక్కు, నోరు, కళ్ల ద్వారా వ్యాపిస్తున్న వైరస్ను అడ్డుకోగలదని చెబుతున్నారు. త్వరలోనే కరోనాను అంతం చేసే సామర్థ్యం కలిగిన నాసల్ స్ప్రేని ప్రవేశపెడతామని బీఆర్ఐసీఎం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మలా ఖాన్ చెప్పారు. అయితే రకరకాలుగా రూపాంతం చెందుతున్న కొరోనాని ఖతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్యపరిశోధకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి వివిధ దేశాలు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఫలితాలు ఎలా ఉన్నాకానీ టీకాలు వేయించుకోవడానికి ప్రజలు ఆసక్తిచూపించడం లేదు.
దీంతో సెకండ్, థర్డ్ వేవ్ తో ప్రపంచం అల్లాడుతోంది. ఇలాంటి టైమ్ లో నాసల్ స్ప్రేని అందుబాటులోకి తెచ్చారు బంగ్లా-కెనడా శాస్త్రవేత్తలు. ముక్కు, నోరు, కళ్ల ద్వారా వైరస్ సోకుతుండటంతో ఆ దిశగా పరిశోధనలు చేశారు. నాసల్ స్ప్రేతో కరోనాని ఖతం చేయవచ్చంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. కెమికల్ మెట్రోలజీ అభివృద్ధిలో భాగంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్ ఐసీఎమ్ శాస్త్రవేత్తలు ‘బంగాసేఫ్ ఓరో-నాసల్ స్ప్రేని తయారుచేశారు. ట్రయల్ రన్స్ విజయవంతం కావడంతో భారత్ కి అందించేందుకు సిద్ధమని ప్రకటించారు.
మోదీస ర్కార్ ఆమోదిస్తే 100 రూపాయలకే ఈ నాసల్ స్ప్రేని అందిస్తామని బంగ్లా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు కెనడాకి చెందిన ఓ ఫార్మా సంస్థ కూడా నాసల్ శానోటైజ్ నాసల్ స్ప్రేను అభివృద్ధి చేసింది. యూకే వేరియంట్ కోవిడ్-19 సోకిన 79 మంది బాధితులపై దీన్ని ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే భారత్ లో సరైన భాగస్వామి దొరికితే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది.
No comments:
Post a Comment