మొన్న ప్రైవేట్ టీచర్ సూసైడ్… నేడు భార్య కూడా.. ఈ పాపం ఎవరిది…?
కరోనా వైరస్ కష్టాలు… సర్కార్ నిర్లక్ష్యం .. ఈ రెండూ కలిసి ఆ కుటుంబాన్ని నిలువునా ముంచేసాయి. ఇద్దరు చిన్నారులను అనాథలుగా మార్చాయి. ఇప్పటికే ఏడాదికి పైగా లాక్ డౌన్ వల్ల జీతాలు లేక ఇబ్బందిపడుతున్న తమకు… స్కూల్స్ తెరిచారు ఇక మంచిరోజులు వచ్చాయని భావించగా… మాయదారి కరోనా వల్ల తెలంగాణలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నాగార్జున సాగర్ కు చెందిన రవికుమార్ రెండ్రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణం ఓవైపు, ఆర్థిక ఇబ్బందులు ఎలా ఎదుర్కొవాలా అన్న భయం మరోవైపు రవి కుమార్ భార్యను కూడా బలవన్మరణానికి ఉసికొల్పాయి. ఇద్దరు పిల్లల్ని అనాథలుగా మార్చాయి. ఒక పేద కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చాయి.
ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రైవేటు టీచర్లు సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు స్కూల్స్ విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేశాయని, కానీ తమకు మాత్రం జీతాలు ఇవ్వటం లేదని ప్రైవేట్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
No comments:
Post a Comment